Sunday 30 November 2008

విష్ణు సహస్ర నామం శ్లో 5



శ్లో|| స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః
అనాధి నిధనో ధాతా విధాతా థాతురుత్తమః

1. స్వయంభూః = స్వయముగా అవతరించువాడు
2. శంభుః = శాంతి స్వరూపుడు
3. ఆదిత్యః = అదితికి కుమారుడు
4. పుష్కరాక్షః = కల్వ పువ్వు వంటి కన్నులు కలవాడు
5. మహాస్వనః = గొప్ప ధ్వని కలవాడు
6. అనాది నిధనః = మొదలు చివరలు లేనివాడు
7. ధాతాః = సృష్టికర్త
8. విధాతా = కల్పించువాడు
9. ధాతుః ఉత్తమః = = బ్రహ్మ కన్నా ఉత్తముడైనవాడు

భావము :

పరమాత్మ తనంతట తానే పుట్టుచున్నాడు. శాంతియే తానై వ్యక్తమగుచున్నాడు. అదితి కుమారుడు, కలువ పువ్వుల వంటి కన్నులు కలవాడు, శబ్ద స్వరూపమైనవాడు, మొదలు, తుది లేనివాడు. సృష్టి క్రమమును ఏర్పరచువాడు లేక కల్పించువాడు. తానే సృష్టి కర్తయు, అట్టి సృష్టి కర్తకు పాలకుడు అయి ఉన్నవాడు.

విష్ణు సహస్ర నామం శ్లో 4



శ్లో||4 సర్వ శ్శర్వ శ్శివ స్థాణు ర్బూతాదిర్నిధిరవ్యయః
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః

1.సర్వ = సమస్తము
2.శర్వ = శివుడు
3.శివ = శుభము కలిగించువాడు
4.స్థాణుః = స్థిరమయిన వాడు
5.భూతాధిః = భూతములకు కారణమైనవాడు
6. నిధిః = దాచబడిన సంపద అయినవాడు లేక అందరిచే సమర్పణమయిన వాడు
7. అవ్యయః = వ్యయమగుట లేని వాడు, లేక నశించుట లేనివాడు
8. సంభవః = పుట్టుక లేక కలిగించుట అనుదానికి అధిపతి అయినవాడు
9. భావనః = భావమును నడిపించువాడు లేక భావనకు గమ్యమయినవాడు
10. భర్తా = పోషించువాడు
11. ప్రభవః = మేల్కొనుటకు లేక వ్యక్తమగుటకు అధిపతి అయినవాడు
12. ప్రభుః = సమర్ధుడు లేక అధిపతి
13. ఈశ్వరః = సృష్టి వైభవమునకు అధిపతి అయినవాడు

భావము :

సమస్తము తాను అయినవాడు, హింసను నశింపచేయువాడు, శుభమును కలిగించువాడు, భూతములకు స్థిరమయిన కారణమయినవాడు, వ్యయము కాని నిధి అయినవాడు, భావమయి పుట్టుకయైనవాడు, భరించువాడు, మేల్కొలుపుటకు సమర్ధుడయినవాడు, అట్లు సృష్టివైభవమునకు కారణమయినవానికి నమస్కారము.

Friday 28 November 2008

విష్ణు సహస్ర నామం - శ్లో 3




శ్లో|| యోగో యోగ విదాం నేతా ప్రధాన పురుషేశ్వరః
నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః

1. యోగః = యోగము తానే అయినవాడు
2. యోగవిదాం = యోగులలో
3. నేతా = నాయకుడు
4. ప్రధానః = మూల ప్రకృతి (మాయ)
5. పురుషేశ్వరః = పురుషులకు అధిపతి అయినవాడు
6. నారసింహ వపుః = నరసింహ రూపుడైనవాడు
7. శ్రీమాన్ = లక్ష్మీ దేవి భర్త
8. కేశవః = కేశములు కలవాడు
9. పురుషోత్తమః = ఉత్తమ పురుషుడైన వాడు

భావము : ఆయనే యోగము, యోగులకు నాయకుడై ఉన్నవాడు, మూల ప్రకృతి లేక మాయగా వచ్చినవాడు, పురుషులకు ఈశ్వరుడైన వాడు. నృసింహ రూపముతో వచ్చినవాడు, లక్ష్మీ దేవికి భర్త. లోకములే ఆయన కేశములు. ఉత్తమ పురుషుడను ప్రవృత్తి చే తెలియబడువాడు.

Monday 24 November 2008

పిబ రే రామరసం

Get this widget | Track details | eSnips Social DNA


పిబ రే రామరసం రసనే |
పిబ రే రామరసం ||

ధూరీకృత సాతకసంసర్గం |
పూరితనానావిధ ఫలపర్గం

జననమరణ భయశోకవిదూరం|
సకలశాస్త్ర నిగమాగమసారం

పరిపాలిత సరసిజగర్భాండం |
పరమపవిత్రీకృత పాషండం

శుద్ధపరమహంస ఆశ్రమగీతం |
శుకశౌనక కౌశికముఖపీతం

మానస సంచరరే

Get this widget | Track details | eSnips Social DNA


మానస సంచరరే బ్రహ్మణి || మానస సంచర రే ||

మదశిఖిపించాలంకృతచికురే |
మహనీయకపోలవిజితముకురే ||

శ్రీరమణీకుచదుర్గవిహారే |
సేవక జనమందిర మందారే ||

పరమహంశముఖచ్చంద్రచకోరే |
పరిపూరితమురళీరవధారే ||

ఉయ్యాల బాలునూచెదరు



ఉయ్యాల బాలునూచెదరు కడు
నొయ్య నొయ్య నొయ్యనుచు ||

బాల యవ్వనలు పసిడి ఉయ్యాల
బాలుని వద్ద పాడేరు
లాలి లాలి లాలి లాలెమ్మ
లాలి లాలి లాలి లాలనుచు ||

తమ్మిరేకు కనుదమ్ముల నవ్వుల
పమ్ముజూపుల బాడేరు
కొమ్మలు మట్టెల గునుకుల నడపుల
ధిమ్మి ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు ||

చల్లు చూపుల జవరాండ్లు రే-
పల్లె బాలుని పాడేరు
బల్లిదు వేంకటపతి జేరందెలు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లనుచు ||

విష్ణు సహస్ర నామం - శ్లో 2



2. శ్లో || పూతాత్మా పరమాత్మాచ ముక్తానాం పరమాగతిః
అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవచ ||


1.పూతాత్మా = నిర్మలమైన ఆత్మ కలవాడు
2. పరమాత్మా = ఆత్మకు ఆధారమయిన వాడు లేక వెలుగునకు వెలుగైనవాడు,
3. చ = మరియు
4. ముక్తానాం = మోక్షము పొందినవారికి
5. పరమా = ఉత్కృష్టమైన (ప్రధానమయిన )
6. గతిః = మార్గము లేక లక్ష్యము
7. అవ్యయః = వైభవము తరగని వాడు
8. పురుషః = దేహము నందుండు ప్రజ్ఞ్య
9. సాక్షీ = చూచువాడు లేక గమనించు వాడు
10. క్షేత్రజ్ఞ = క్షేత్రము నందుండి తన భావములను, ఆలోచనలను, ఉపాధిని తెలిసినవాడు
11. అక్షరః = నాశనము లేనివాడు
12. ఏవచ = ఆ విధముగా నున్నాడు కదా !


భావము : పరిశుద్ధమైన ఆత్మ కలవాడు, గొప్ప ఆత్మ అయినవాడు, మోక్షము పొందిన జీవులకు ప్రధాన లక్స్యము గా నున్నవాడు, తరగుట యనునది లేనివాడు, దేహమునందున్న ప్రజ్ఞ్య లన్నింటిని గమనించువాడు, ఉపాధియందుండి తెలిసికొనువాడు, నాశము లేనివాడు కదా !

విష్ణు సహస్ర నామం శ్లో 1



శ్లో || విశ్వం విష్ణు ర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః
భూత కృ ద్భూత భృద్బావో భూతాత్మా భూత భావనః

1. విశ్వం = ప్రపంచం
2. విష్ణు = వ్యాపించే గుణం కలిగిన వాడు
3. వషట్కార = ప్రపంచమే తానుగా వసించువాడు
4. భూత = జరిగిపోయినది
5. భవ్య = జరగనున్నది
6. భవత్ = జరుగుచున్నది
7. ప్రభుః = పాలకుడు
8. భూతకృత్ = జీవులను సృష్టించువాడు
9. భూతభృత్ = జీవులను భరించువాడు
10. భూతాత్మా = భూతములకు (జీవులకు) ఆత్మ అయిన వాడు
11. భూత భావనః = జీవులను కల్పన చేయువాడు

భావము : ఈ సృష్టి అంతయు విష్ణువు చే వ్యాప్తి చెంది యున్నది. అతడు విశ్వమంతయు నిండి అందు నివసించి యున్నవాడు. అతడే, జరిగినది, జరగబోవునది మరియు జరుగుచున్నది అను కాలము. అతడు ఈ సృష్టికి పాలకుడు కనుక జీవులకు సృష్టికర్త. అతడు భూతములకు ఆత్మ అయినవాడు. కనుక వానిని భరించి పోషించుచున్నాడు. తన ఉదరమందే జీవులను కల్పించుచున్నాడు.

Sunday 23 November 2008

జయ జయ రామా సమర విజయ రామా




జయ జయ రామా సమర విజయ రామా
భయ హర నిజభక్త పారీణ రామా

జలధి బంధించిన సౌమిత్రి రామా
సెలవిల్లు విరచిన సీతారామా
అల సుగ్రీవు నేలిన అయోధ్య రామా
కలిగి యజ్ఞముగాచే కౌసల్య రామా

అరి రావణాంతక ఆదిత్యకులరామా
గురుమౌనులను గాచే కోదండ రామా
ధర నహల్య పాలిటి దశరథ రామా
హరు రాణినుతుల లోకాభి రామా

అతి ప్రతాపముల మాయామృగాంతక రామా
సుత కుశలవప ప్రియ సుగుణ రామా
వితత మహిమల శ్రీవేంకటాద్రి రామా
మతిలోన బాయని మనువంశ రామా

అలమేలు మంగ నీ అభినవ రూపము



అలమేలు మంగ నీ అభినవ రూపము
జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మా

గరుడాచలాధీశు ఘన వక్షమున నుండి
పరమానంద సంభరితవై
నెరతనములు చూపి నిరంతరము నాథుని
హరుషించగ జేసితి గదవమ్మా

శశి కిరణములకు చలువల చూపులు
విశదముగా మీద వెద చల్లుచు
రసికత పెంపున గరగించి యెప్పుడు నీ
వశము చేసుకొంటి వల్లభునోయమ్మా

రట్టడి శ్రీ వేంకటరాయనికి నీవు
పట్టపురాణివై పరగుచు
వట్టిమాకు తిగిరించు వలపు మాటల విభు
జట్టి గొని వురమున సతమైతివమ్మా

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger