చరణములే నమ్మితి - నీ దివ్య చరణములే నమ్మితి
వారధి గట్టిన - వరభద్రాచల - వరదా వరదా వరదా వరదా - నీ దివ్య ||
వనమున ఱాతిని వనితగ జేయు నీ
చరణము శరణము శరణము నీ దివ్య ||
ఆదిదేవ నన్నఱమర సేయకు
మయ్యా అయ్యా అయ్యా నీ దివ్య ||
పాదారవిందమే - యాధారమని వర
పడితిని పడితిని పడితిని నీ దివ్య ||
వెయ్యాఱువిధముల - కుయ్యాలించి వే రా
వయ్యా అయ్యా నీ దివ్య ||
బాగుగ నన్నేలు - భద్రాచలరామ
దాసుడ దాసుడ దాసుడ నీ దివ్య ||
వాసిగ నన్నేలు వరభద్రాచల
వరదా వరదా వరదా నీ దివ్య ||
Sunday, 20 August 2017
చరణములే నమ్మితి
Posted by Sujata M at 20:25 1 comments
Labels: రామ దాసు కీర్తనలు
పాహిమాం శ్రీరామా
పాహిమాం శ్రీరామా యంటే పలుకవైతివీ - నీ
స్నేహమెట్టిదని చెప్ప- నో హో హో హో హో హో హో హో
ఇబ్బంది నొంది యాకరి - బొబ్బ వెట్టినంతలోనె
గొబ్బున గాచితివని - జబ్బుసేయక
నిబ్బరముగా నేనెంతో - కబ్బమిచ్చి వేడుకొన్న
తబ్బిబ్బుచేసెదవు రామ - అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ || పాహి ||
సన్నుతించువారినేల్ల - మును దయతో బ్రోచితివని
పన్నగశాయి నే విని విన్నవించితివి
విన్నపము వినకయెంతో- కన్నడసేసెదవు రామ
యెన్నటికి నమ్మరాదు - రన్నన్నన్నన్నన్నన్నన్న || పాహి ||
చయ్యన భద్రాచలనిలయస్వామివని నమ్మి నేను
వెయ్యాఱు విధముల నుతి-చెయ్యసాగితి
ఇయ్యెడను రామదాసుని -కుయ్యాలించి ప్రోవకున్న నీ
యెయ్యూర మేమనవచ్చు - నయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో || పాహి ||
Posted by Sujata M at 20:17 2 comments
Labels: Prince Rama Varma, రామ దాసు కీర్తనలు
Tuesday, 15 August 2017
ఇక్ష్వాకు కుల తిలక
ఇక్ష్వాకు కుల తిలక యికనైనా బలుకవె రామచంద్రా - నన్ను
రక్షింపు మింక నోరఘుకులతిలక - శ్రీ రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
1
చుట్టు ప్రాక్రారములు సొంపుతో గట్టిస్తి - రామచంద్రా - ఆ
ప్రాక్రారానికి బట్టె పదివేల వరహాలు రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
2
గోపురమంటపాల్ కుదురుగ గట్టిస్తి-రామచంద్రా- నన్ను
గ్రొత్తగజూడక యిత్తఱి బ్రోవుము - రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
3
భరతునకు జేయిస్తి పచ్చల పతకము రామచంద్రా ||
పతకానికిబట్టె పదివేలవరహాలు రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
4
శత్రుఘ్నునకు నేను జేయిస్తి మొలత్రాడు రామచంద్రా ||
మొలత్రాటికి బట్టె మొహరీలు పదివేలు రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
5
లక్ష్మణునకు వేస్తి ముత్యాల పతకము రామచంద్రా - ఆ
పతకానికిబట్టె పదివేల వరహాలు రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
6
సీతకు జేయిస్తి చింతాకు పతకము రామచంద్రా ఆ
పతకానికి బట్టె పదివేల వరహాలు రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
7
వాహనములు మీకు వరుసతో జేయిస్తి రామచంద్రా - జగ
న్మోహన సంకెళ్ళు వేసిరి కాళ్ళకు రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
8
కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా
కులుకుచు దిరిగెద-వెవరబ్బ సొమ్మని రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
9
మీ తండ్రి దశరథ మహారాజు పెట్టేనా రామచంద్రా లేక -
మీ మామ జనక మహారాజు పంపెనా రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
10
అబ్బ తిట్టితినని యాయాసపడవద్దు రామచంద్రా - ఈ -
దెబ్బల కోర్వక అబ్బ తిట్టితి నయ్య రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
11
ఏటికిజల్లిన నీళ్ళాయె నా బ్రతుకు రామచంద్రా - నేను
అధమునికంటెను అన్యాయమైతిని రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
12
సర్కారు పైకము తృణముగ నెంచుమీ రామచంద్రా ఈ
దెప్పరమున గాచి యప్పుదీర్చుమయ్య రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
13
కౌసల్యాపుత్రక దశరథతనయ శ్రీరామచంద్రా - కావు
క్షేమమున భద్రాద్రిలో నెలకొన్న - శ్రీరామచంద్రా || ||ఇక్ష్వాకు ||
14
భక్తులందఱిని బరిపాలించెడి రామచంద్రా - నీవు
క్షేమముగ శ్రీ రామదాసుని నేలుము రామ ||ఇక్ష్వాకు ||
* * *
Posted by Sujata M at 20:17 0 comments
Labels: రామ దాసు కీర్తనలు
Wednesday, 17 March 2010
తారకమంత్రము కోరిన దొరికెను
తారకమంత్రము కోరిన దొరికెను
ధన్యుడనైతిని ఓరన్నా
మీఱిన కాలుని దూతలపాలిటి
మృత్యువె యని నమ్మర యన్నా
మచ్చికతో నికబాతకంబుల
మాయలలో బడబోకన్నా
హెచ్చ్గ నూటయినిమిది తిరుపతు
లెలమి దిరుగ బని లేదన్నా
ముచ్చటగా నా పుణ్యనదులలో
మునిగెడీ పని యేమిటి కన్నా
వచ్చెడీ పర్వపుదినములలో సుడి
వడి పడుటలు మాను మికన్నా
ఎన్ని జన్మముల నైంచ్ చూచినను
యేకో నారాయణుడనా
అన్ని రూపులై యున్న పరమాత్ముని
నా మహాత్ము కధలను విన్న
ఎన్ని జన్మముల జేసిన పాపము
లీ జన్మముతో విడునన్నా
అన్నిటికిది కడసారి జన్మమిది
సత్యం బికబుట్టుట సున్న
నిర్మల మంతర్లక్ష్య భావమున
నిత్యానందముతో నున్న
కర్మంబులు విడి మోక్షసద్గతిని
గన్నులనే చూచుచునున్న
ధర్మము తప్పక భద్రాద్రీశుని
దనమదిలో నమ్ముచునున్న
మర్మము దెలిసిన రామదాసుని
మందిరమున కేగుచునున్న
Posted by Sujata M at 12:58 0 comments
Labels: రామ దాసు కీర్తనలు
నను బ్రోవమని చెప్పవే
నను బ్రోవమని చెప్పవే - సీతమ్మ తల్లీ !
ననుః బ్రోవమని చెప్పవే
నను బ్రోవమని చెప్పు నారీశిరోమణి -
జనకుని కూతురా! జననీ జానకమ్మ
ప్రక్కను జేరుక - చెక్కిలి నొక్కుచు
జక్కగ మరుకేళి - సొక్కి యుండెడి వేళ
లోకాంతరంగుడు - శ్రీకాంత నినుగూడి
యేకాంతమున నేక - శయ్యనున్న వేళ
అద్రిజవినతుడు - భద్రగిరీశుడు
నిద్ర మేల్కొనువేళ నేతరో బోధించి
Posted by Sujata M at 12:49 0 comments
Labels: రామ దాసు కీర్తనలు
ఏ తీరుగ నను దయజూచెదవో

ఏ తీరుగ నను దయజూచెదవో - యినవంశోత్తమ రామా
నాతరమా భవసాగర మీదను - నళినదళేక్షణ రామా
శ్రీరఘునందన సీతారమణా - శ్రితజనపోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను - గన్నది కానుపు రామా
మురిపెముతో నా స్వామివి నీవని - ముందుగ దెల్పితి రామా
మరువకయికనభిమానముంచునీ - మఱుగజొచ్చితిని రామా
క్రూరకర్మములు నేరక చేసితి - నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారముసేవవె - దైవశిఖామణి రామా
గురుడవునామదిదైవమునీవను - నురుశాస్త్రంబులు రామా
గురువుదైవమనియెఱుగకతిరిగెడు - క్రూరుడనైతిని రామా
తాండవమున నఖిలాండకోటి - బ్రహ్మాండనాయకా రామా
బంధనమున నీ నామముదలచిన - బ్రహ్మానందము రామా
వాసవకమలభవామరవందిత - వారధిబంధన రామా
భాసురవరసద్గుణములు గల్గిన - భద్రాద్రీశ్వర రామా
వాసవనుత రామదాసపోషకా - వందనమయోధ్య రామా
దాసార్చిత మాకభయమొసంగవె - దాసరధీరఘురామా
Posted by Sujata M at 12:39 0 comments
Labels: రామ దాసు కీర్తనలు
Monday, 7 July 2008
రామచంద్రులు నాపై చలము సేసినారు
రామచంద్రులు నాపై చలము చేసినారు సీతమ్మ చెప్పవమ్మ
కటకటా వినడేమి సేయుదు
కఠిన చిత్తుని మనసు కరుగదు
కర్మములు నెటులుండునోగద
ధర్మమే నీకుండునమ్మ
1. దిన దినము మీ చుట్టు దీనతతో దిరుగక
దిక్కెవ్వరికనోయమ్మ
దీనపోషకుడనుచు వేడితి దిక్కులన్నీ ప్రకటమాయెను
ఒక్కమాటైనను వినడు ఎక్కువేమని తలతునమ్మ
2. కౌసల్యతనయుడు కపటము చేసినాడు
కారణమిటుండెను కన్నడచేసెదవా
నీ కన్నుల వైభవంబు విన్నవింపగదమ్మ
నీ కన్న దిక్కెవ్వరోయమ్మ
3. దశరాధత్ముజుడెంతో దయశాలి యనుకొంటి
ధర్మహీనుడేయమ్మ
దానజనులకు దాతయతడట
రవికులాంబుధి సోముడితడట
Posted by Sujata M at 22:48 2 comments
Labels: రామ దాసు కీర్తనలు