Showing posts with label పెద తిరుమలాచార్యుల సంకీర్తన. Show all posts
Showing posts with label పెద తిరుమలాచార్యుల సంకీర్తన. Show all posts

Saturday, 17 March 2012

గోవిందా శ్రిత గోకుల బృందా



గోవిందా శ్రిత గోకుల బృందా
పావన జయ జయ పరమానందా

జగదభిరామా సహస్ర నామా
సుగుణ ధామ సంస్తుత నామా
గగన శ్యామా ఘనరిపు భీమా
అగణిత రఘు వంశాంబుధి సోమా

జననుత చరణా శరణ్య శరణా
దనుజ హరణ లలిత స్ఫురణా
అనఘా చరణాయుత భూభరణా
దినకర సన్నిభ దివ్యాభరణా

గరుడతురంగా కారోత్తుంగా
శారధి భంగ ఫణి శయనాంగా
కరుణాపాంగా కమలాసంగా
వర శ్రీ వేంకటగిరిపతి రంగా


గోవిందా = భూమిని, గోవును, స్వర్గాన్నీ, వేదాన్ని పొందినవాడా
శ్రిత = ఆశ్రయించిన
గోకుల బృంద = ఆవుల గుంపు కలిగిన వాడా
పావన = పవిత్రమైన వాడా
జయ = సర్వులను జయించి వశపరచుకొనెడివాడా
జయ జయ = గెలువుము, గెలువుము
పరమానంద = ఎక్కువైన ఆనందమే స్వరూపముగా కలిగినవాడా
జగదభిరామా = ప్రపంచములో ప్రియమైనవాడా !
సహస్ర నామా = వేయి పేర్లు కలిగిన వాడా !
సంస్తుత నామా= పొగడ దగిన పేర్లు కలిగిన వాడా
గగన శ్యామా = ఆకుపచ్చ, నలుపూ కలిసిన ఆకాశపు రంగు కలవాడా
ఘనరిపు భీమా = ఘనులయిన శత్రువులకు భయంకరమైన వాడా !
అగణిత = లెక్కించడానికి వీలు లేని
రఘువంశాంబుధి సోమా = గొప్పదయిన రఘువంశ సముద్రమునకు చంద్రుడా !
జననుత చరణా = జనుల చేత పొగడదగిన పాదాలు కలవాడా
శరణ్య శరణా = రక్షకులకు రక్షణ ఇచ్చువాడా !
దనుజ హరణా = రాక్షసులను సంహరించువాడా
లలిత స్ఫురణా = అందంగా ప్రకాశించువాడా !
అనఘా = పాపము లేని వాడా !
చరణాయుత = చరణముల చేత విస్తృతమైన
భూభరణా = భూమిని ధరించినవాడా
దినకర సన్నిభ = సూర్యునితో సమానమైన వాడా !
దివ్యాభరణా = దివ్యమైన ఆభరణాలు కలిగినవాడా !
గరుడతురంగా = గరుత్మంతుడు వాహనముగా కలిగినవాడా
ఆకారోత్తుంగా = విశ్వరూపము కలిగిన వాడా !
శరధి భంగ = సముద్ర గర్వమును పోగొట్టిన వాడా
ఫణి శయనగాంగా = ఆదిశేషుడు పానుపుగా కలిగినవాడా !
కరుణాపాంగా = దయ నిండిన కడకన్ను కలవాడా !
కమలాసంగా = లక్ష్మీదేవి యందు అనురాగము కలిగిన వాడా !
వర = శ్రేష్ఠుడైన
శ్రీ వేంకట గిరి పతి రంగా = శ్రీ వేంకటాచల ప్రభూ !



అన్నమాచార్యుల వారి రెండో భార్య అక్కలమ్మ. ఆమెకు పుట్టిన వారు పెద తిరుమలాచార్యుల వారు. ఈయన కూడా తండ్రి లాగా రోజుకో కీర్తన వేంకటేశ్వరునికి అంకితం చేస్తూ రాశారు. వారు రాసిన ప్రసిద్ధమైన సంస్కృత కీర్తన ఇది. గోవర్ధన గిరిని ఎత్తి గోవులను రక్షించడం చేత గోవిందుడయ్యాడని భారతం చెప్పింది. గోవర్ధనోద్ధరణ సందర్భంలో సురభి పాలతో శ్రీకృష్ణుని అభిషేకించి ఆయనకు గోవిందుడని నామకరణము చేసినట్లు భాగవతంలో వుంది. వరాహావతారంలో రసాతలంలో ఉన్న భూమిని తన కోరలతో పైకి ఉద్ధరించాడు కనుక విష్ణువును గోవిందుడన్నారు. నమ్ముకొన్న భక్తులను నేటి కలి యుగంలో ఆయన ఉద్ధరిస్తాడని మనసారా నమ్ముతూ గోవింద ! గోవింద అని కోట్లాది భక్తులు నోరారా పిలుస్తుంటారు. తనకు సంబంధించిన గోపాలక మిత్రులను, గోగణాలను రక్షించడానికి ఏడు రోజులపాటు శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని చిటికెన వేలి మీద ఎత్తాడు. వారికోసం ఎందరో రాక్షసులను సంహరించాడు. దీనినే పెద తిరుమలాచార్యులు 'శ్రిత గోకుల బృందా !' అన్నాడు.

ఈ కీర్తన లో కవి ప్రయోగించిన 'జగదభిరామ' ప్రయోగం ఎంతో పేరు పొందింది. ఆధునిక చల చిత్ర యుగంలో ఈ ప్రయోగంతో మొదలయ్యే పాట విశేషమైన ఆదరణ పొందిన విషయం అందరికీ తెలిసిందే ! 'అభిరామ' అనే పేరుతో తమిళనాడులో మీనాక్షీ దేవికి పూజలు జరుగుతున్నాయి. స్ఫురణ అంటే మనస్సు మీద మెరుపు అన్నారు రమణ మహర్షి. కాంతి, శబ్ధం రెండింటిని ఈ శబ్దం సూచిస్తుందని వారి మాట. ఇంతటి విశేషార్ధం కల స్ఫురణ సబ్దాన్ని లలితంగా కవి ప్రయోగించాడు. పెద తిరుమలాచార్యులు 'గరుడ తురంగము' అంటే' జగదానంద కారక' అను ప్రసిద్ధమైన కీర్తనలో త్యాగరాజస్వామి 'ఖగతురంగ' అన్నారు. రెండు చోట్లా తురంగ మంటే వాహనమని అర్ధం. పదే పదే స్వామి నామస్మరణ చేస్తే తరిస్తాం. ఈ కీర్తనలో ఉద్ద్యేశ్యం అదే. 'జయలిడగా' అని తండ్రి అన్నమయ్య పలికిన రీతిలో స్వామికి 'జయ జయ' అన్న పెద తిరుమలయ్యను కూడా సాహితీ పరులు 'జయము జయము' అని కొనియాడతారు. స్వస్తి.

- డా||తాడేపల్లి పతంజలి (అన్నమయ్య అన్నమాట) సాక్షి, జనవరి 31, 2010.




goavindaa Srita goakula bRndaa
paavana jaya jaya paramaanandaa

jagadabhiraamaa sahasra naamaa
suguNa dhaama sanstuta naamaa
gagana Syaamaa ghanaripu bheemaa
agaNita raghu vamSaambuDhi soamaa

jananuta charaNaa SraNya SaraNaa
danuja haraNa lalita sphuraNaa
anaghaa charaNaayuta bhoobharaNaa
dinakara sannibha divyaabharaNaa

garuDaturangaa kaaroattungaa
Sardhi bhanga faNi Sayanaangaa
karuNaapaangaa kamalaasangaa
vara Sree veankaTagiripati rangaa

goavindaa = bhoomini, goavunu, svargaannee, veadaanni pondinavaaDaa
Srita = aaSrayinchina
goakula bRnda = aavula gumpu kaligina vaaDaa
paavana = pavitramaina vaaDaa
jaya = sarvulanu jayinchi vaSaparachukoneDivaaDaa
jaya jaya = geluvumu, geluvumu
paramaananda = ekkuvaina aanandamea svaroopamugaa kaliginavaaDaa
jagadabhiraamaa = prapanchamuloa priyamainavaaDaa !
sahasra naamaa = veayi pearlu kaligina vaaDaa !
samstuta naamaa = ppgaDadagina pearlu kaligina vaaDaa
gagana Syaamaa = aakupaccha, nalupoo kalisina aaakaaSapu rangu kalavaaDaa
ghanaripu bheemaa = ghanulayina Satruvulaku bhayamkaramaina vaaDaa !
agaNita = lekkinchaDaaniki veelu leani
raghuvamSaambudhi soamaa = goppadayina raghuvamSa samudramunaku chandruDaa !
jananuta charaNaa = janula cheata pogaDadagina paadaalu kalavaaDaa
SaraNya SaraNaa = rakshakulaku rakshaNa icchuvaaDaa !
danuja haraNaa = raakshasulanu samharinchuvaaDaa
lalita sphuraNaa = andamgaa prakaaSinchuvaaDaa !
anaghaa = paapamu leani vaaDaa !
charaNaayuta = charaNamula cheata vistrutamaina
bhoobharaNaa = bhoomini dharinchinavaaDaa
dinakara sannibha = sooryunitoa samaana manyina vaaDaa !
divyaabharaNaa = divyamaina aabharaNaalu kaliginavaaDaa !
garuDaturangaa = garutmantuDu vaahanamugaa kaliginavaaDaa
aakaaroattungaa = viSvaroopamu kaligina vaaDaa !
Saradhi bhanga = samudra garvamunu poagoTTina vaaDaa
phaNi Sayanagaangaa = aadiSeashuDu paanupugaa kaliginavaaDaa !
karuNaapaangaa = daya ninDina kaDakannu kalavaaDaa !
kamalaasangaa = lakshmeedeavi yandu anuraagamu kaligina vaaDaa !
vara = SreashThuDaina
Sree veankaTa giri pati rangaa = Sree veankaTaachala prabhoo !

Wednesday, 29 February 2012

ఎక్కడి మానుషజన్మం

Audio : ఎక్కడి మానుషజన్మం

ఎక్కడి మానుషజన్మం బెత్తిన ఫలమేమున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం బికను ||

మఱువను ఆహారంబును మఱవను సంసార సుఖము
మఱవను యింద్రియ భోగము మాధవ నీ మాయా
మఱచెద సుజ్ఞానంబు మఱచెద తత్వరహస్యము
మఱచెదె నురువును దైవము మాధవ నీ మాయా ||

విడువను బాపము పుణ్యము విడువను నా దుర్గుణములు
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీ మాయా
విడెచెద షట్కర్మంబులు విడెచెద వైరాగ్యంబును
విడిచెద నాచారంబును విష్ణుడ నీ మాయా ||

తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధంబుల
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా
అగపడి శ్రీవేంకటేశ్వర అంతర్యామివై
నగి నగి నను నీ వేలితి నాకా యీ మాయా ||

ekkaDi maanushajanmam bettina phalameamunnadi
nikkamu ninnea nammiti nee chittam bikanu ||

ma~ruvanu aahaarambunu ma~ravanu samsaara sukhamu
ma~ravanu yindriya bhoagamu maadhava nee maayaa
ma~racheda sujnaanambu ma~racheda tatvarahasyamu
ma~rachede nuruvunu daivamu maadhava nee maayaa ||

viDuvanu baapamu puNyamu viDuvanu naa durguNamulu
viDuvanu mikkili yaasalu vishNuDa nee maayaa
viDecheda shaTkarmambulu viDecheda vairaagyambunu
viDicheda naachaarambunu vishNuDa nee maayaa ||

tagileda bahulampaTamula tagileda bahubandhambula
tagulanu moakshapu maargamu talapuna yentainaa
agapaDi SreeveankaTeaSvara antaryaamivai
nagi nagi nanu nee vealiti naakaa yee maayaa ||

ఉన్నతోన్నతుడు వుడయవరు



Listen : ఉన్నతోన్నతుడు వుడయవరు


ఉన్నతోన్నతుడు వుడయవరు
యెన్న ననంతుడే యీ యుడయవరు ||

సర్వలోకముల శాస్త్రరహస్యము
లుర్విబొడమె నీ యుడయవరు
పూర్వపు వేదాంత పుణ్య శాస్త్రములు
నిర్వహించె నన్నిటా నుడయవరు ||

వెక్కసపు శ్రీవిష్ణుభక్తియే
వొక్క రూపమే వుడయవరు
చక్కనైన సుజ్ఞానమున కిరవై
వుక్కు మీఋఎ నెదె వుడయవరు ||

కదిసె మోక్షసాకారము దానై
వుదుటున నిలిచె నీ యుడయవరు
యిదిగో శ్రీవేంకటేశ్వరు యీడై
పొదలుచునున్నాడు భువి నుడయవరు ||

unnatoannatuDu vuDayavaru
yenna nanantuDea yee yuDayavaru

sarvaloakamula Saastrarahasyamu
lurviboDame nee yuDayavaru
poorvapu veadaanta puNya Saastramulu
nirvahinche nanniTaa nuDayavaru

vekkasapu SreevishNubhaktiyea
vokka roopamea vuDayavaru
chakkanaina sujnaanamuna kiravai
vukku meeRe nede vuDayavaru

kadise moakshasaakaaramu daanai
vuduTuna niliche nee yuDayavaru
yidigoa SreeveankaTeaSvaru yeeDai
podaluchununnaaDu bhuvi nuDayavaru

Friday, 17 February 2012

మేలుకొనవే నీల మేఘవర్ణుడా

Audio Link : మేలుకొనవే నీల మేఘవర్ణుడా


మేలుకొనవే నీల మేఘవర్ణుడా
వేళ దప్పకుండాను శ్రీవేంకటేశుడా

మంచముపై నిద్రదేర మల్లెల వేసేరు
ముంచు తురుము ముడవ మొల్లల వేసేరు
కంచము పొత్తారగించ కలువల వేసేరు
పించెపు చిక్కుదేర సంపెంగల వేసేరు

కలసిన కాక దేర గన్నేరుల వేసేరు
వలపులు రేగి విరజాజుల వేసేరు
చలువగా వాడుదేర జాజుల వేసేరు
పులకించ గురువింద పూవుల వేసేరు

తమిరేగ గోపికలు తామరల వేసేరు
చెమటార మంచి తులసిని వేసేరు
అమర శ్రీవేంకటేశ యలమలుమంగ నీకు
మమత పన్నీటితో చేమంతుల వేసేరు


mealukonavea neela meaghavarNuDaa
veaLa dappakunDaanu SreeveankaTeaSuDaa

manchamupai nidradeara mallela veasearu
munchu turumu muDava mollala veasearu
kanchamu pottaaragincha kaluvala veasearu
pinchepu chikkudeara sampengala veasearu

kalasina kaaka deara gannearula veasearu
valapulu reagi virajaajula veasearu
chaluvagaa vaaDudeara jaajula veasearu
pulakincha guruvinda poovula veasearu

tamireaga goapikalu taamarala veasearu
chemaTaara manchi tulasini veasearu
amara SreeveankaTeaSa yalamalumanga neeku
mamata panneeTitoa cheamantula veasearu

Thursday, 16 February 2012

వందేహం జగద్వల్లభం

Audio Link : వందేహం జగద్వల్లభం

వందేహం జగద్వల్లభం దుర్లభం
మందరధరం గురుం మాధవం భూధవం ||

నరహరిం మురహరం నారాయణం పరం
హరి మచ్యుతం ఘన విహంగవాహం
పురుషొత్తమం పరం పుండరీకేక్షణం
కరుణాభరణం కలయామి శరణం ||

నందనిజనందనం నందకగదాధరం
యిందిరానాధ మరవిందనాభం
యిందురవిలోచనం హితదాసవరదం,
ముకుందం యాదవం గోపగోవిందం ||

రామనామం యజ్ఞరక్షణం లక్షణం
వామనం కామినం వాసుదేవం
శ్రీమదావాసినం శ్రీవేంకటేశ్వరం
శ్యామలం కోమలం శాంతమూర్తిం ||

vaMdaehaM jagadvallabhaM durlabhaM
maMdaradharaM guruM maadhavaM bhoodhavaM ||

narahariM muraharaM naaraayaNaM paraM
hari machyutaM ghana vihaMgavaahaM
purushottamaM paraM puMDareekaekshaNaM
karuNaabharaNaM kalayaami SaraNaM ||

naMdanijanaMdanaM naMdakagadaadharaM
yiMdiraanaadha maraviMdanaabhaM
yiMduravilOchanaM hitadaasavaradaM,
mukuMdaM yaadavaM gOpagOviMdaM ||

raamanaamaM yaj~narakshaNaM lakshaNaM
vaamanaM kaaminaM vaasudaevaM
SreemadaavaasinaM SreevaeMkaTaeSvaraM
SyaamalaM kOmalaM SaaMtamoortiM ||

Wednesday, 15 February 2012

శరణు శరణు నీకు సర్వేశ్వరా

Audio Link : శరణు శరణు నీకు సర్వేశ్వరా


శరణు శరణు నీకు సర్వేశ్వరా నీ
శరణాగతే దిక్కు సామజవరదా ||

వేయి శిరసులతోడి విశ్వరూపమా
బాయట నీ పరంజ్యోతి పరబ్రహ్మమా
మ్రోయుచున్న వేదముల మోహనాంగమ
చేయి చేత అనంతపు శ్రీమూరితి ||

ముగురు వేలుపులకు మూలకందమా
వొగి మునుల ఋషుల వోంకారమా
పగటు దేవతలకు ప్రాణబంధుడా
జగమెల్లా గన్నులైన సాకారమా ||

వెలయు సచ్చిదానంద వినోదమా
అలరు పంచవింశతి యాత్మతత్వమా
కలిగిన దాసులకు కరుణానిధీ
చెలగి వరములిచ్చే శ్రీవేంకటేశుడా ||



SaraNu SaraNu neeku sarvaeSvaraa nee
SaraNaagatae dikku saamajavaradaa ||

vaeyi SirasulatODi viSvaroopamaa
baayaTa nee paraMjyOti parabrahmamaa
mrOyuchunna vaedamula mOhanaaMgama
chaeyi chaeta anaMtapu Sreemooriti ||

muguru vaelupulaku moolakaMdamaa
vogi munula Rshula vOMkaaramaa
pagaTu daevatalaku praaNabaMdhuDaa
jagamellaa gannulaina saakaaramaa ||

velayu sachchidaanaMda vinOdamaa
alaru paMchaviMSati yaatmatatvamaa
kaligina daasulaku karuNaanidhee
chelagi varamulichchae SreevaeMkaTaeSuDaa

నీవున్నచోటే వైకుంఠము

నీవున్నచోటే వైకుంఠము నెరసులు మరి చొరరాదు
పావనమది చెప్పేది వేదము పాటింపగవలెను ||

దేవుడా నా దేహమె నీకు తిరుమలగిరిపట్టణము
భావింప హృదయకమలమె బంగారపు మేడ
వేవేలు నా విజ్ఞానాదులు వేడుకపరిచారకులు
శ్రీవల్లభా ఇందులో ఇతరచింతలు వెట్టకువే ||

పరమాత్మా నా మనసే బహురత్నంబుల మంచము
గరిమల నా యాత్మే నీకు కడు మెత్తని పరపు
తిరముగ నుజ్ఞానదీపమున్నది దివ్యభోగమె ఆనందము
మరిగితి నీవున్నయెడల నిక మాయల గప్పకువే ||

ననిచిన నా వూరుపులే నీకు నారదాదుల పాటలు
వినయపు నా భక్తియె నీకును వినోదమగు పాత్ర
అనిశము శ్రీవేంకటేశ్వర అలమేల్మంగకు బతివి
ఘనుడవు నన్నేలితి విక కర్మములెంచకువే ||


Audio Link : నీవున్నచోటే వైకుంఠము

Request : సాహిత్యం నాకు చాలా నచ్చింది, కానీ వినడానికి clumsy గా, అంత సొంపుగా అనిపించలేదు. ఇంకేదైనా బాణి లో ఈ పాట ఉంటే తెలియచేయగలరు.



neevunnachOTae vaikuMThamu nerasulu mari choraraadu
paavanamadi cheppaedi vaedamu paaTiMpagavalenu ||

daevuDaa naa daehame neeku tirumalagiripaTTaNamu
bhaaviMpa hRdayakamalame baMgaarapu maeDa
vaevaelu naa vij~naanaadulu vaeDukaparichaarakulu
Sreevallabhaa iMdulO itarachiMtalu veTTakuvae ||

paramaatmaa naa manasae bahuratnaMbula maMchamu
garimala naa yaatmae neeku kaDu mettani parapu
tiramuga nuj~naanadeepamunnadi divyabhOgame aanaMdamu
marigiti neevunnayeDala nika maayala gappakuvae ||

nanichina naa voorupulae neeku naaradaadula paaTalu
vinayapu naa bhaktiye neekunu vinOdamagu paatra
aniSamu SreevaeMkaTaeSvara alamaelmaMgaku bativi
ghanuDavu nannaeliti vika karmamuleMchakuvae ||

వద్దు వద్దు సటలింక వామనా

వద్దు వద్దు సటలింక వామనా నీ
వద్దనే వున్నార మిదె వామనా ||

వరుసలు వెదకేవు వామనా నీవు
వరుడ విందరికిని వామనా
వరవాత వలపించి వామనా దే
వరవలె నున్నాడవు వామనా ||

వనము కోగిల వైతి వామనా నీకు
వనితలు బాతి వామనా
వనరేరు గొల్లెతలు వామనా కా
నను వేళ చూచుకోమీ వామనా ||

వాడవారు మొక్కేరు వామ్నా నీకు
వాడుదేరె కెమ్మోవి వామనా
వాడికె శ్రీవేంకటాద్రివామనా
వాడేచెలమవు నీవు వామనా ||

ఆడియో లింక్

vaddu vaddu saTaliMka vaamanaa nee
vaddanae vunnaara mide vaamanaa ||

varusalu vedakaevu vaamanaa neevu
varuDa viMdarikini vaamanaa
varavaata valapiMchi vaamanaa dae
varavale nunnaaDavu vaamanaa ||

vanamu kOgila vaiti vaamanaa neeku
vanitalu baati vaamanaa
vanaraeru golletalu vaamanaa kaa
nanu vaeLa choochukOmee vaamanaa ||

vaaDavaaru mokkaeru vaamnaa neeku
vaaDudaere kemmOvi vaamanaa
vaaDike SreevaeMkaTaadrivaamanaa
vaaDaechelamavu neevu vaamanaa ||

Monday, 16 January 2012

ఏమి చిత్రం బేమి మహిమలు

ఏమి చిత్రం బేమి మహిమలు యేమి నీ మాయా వినోదము
వామనాచ్యుత నిన్ను దెలియగ వసుధలో మా తరములా ||

సకలలోక నివాస నాయక శౌరి మురహర నరహరీ
ప్రకటమాయెను నీ గుణంబులు పాలముచ్చ వటంచును
వికటముగ నిను గన్న తల్లి వేల నీ వదనంబు మీటిన
అకట హా యని నోరు దెరచిన యందు లోకములుండెను ||

శ్రీసతిపతి దైత్యదానవశిక్ష కామర రక్షక
రాసి కెక్కెను బండిరొప్పిన రవ్వలా నీ నేతలు
మోసమున నర్జునుడు నీలో ముందు గానక మాటలాడిన
వాసవార్చిత విశ్వరూపము వసుధ జూపితివవుదువు ||

నమో నమో శ్రీవేంకటేశ్వర నారదప్రియ భక్తవత్సల
విమలమగు నీ దాసులిదె నీ విద్య లెల్లా జూచిరి
సుముఖులైన కరిశబరి బలియును శుకధ్రువాదులు నిన్ను గొలువగ
సమత వున్నతపదము లొసగితి సర్వమిందును గంటిమి ||


Audio Link : ఏమి చిత్రం బేమి మహిమలు

aemi chitraM baemi mahimalu yaemi nee maayaa vinOdamu
vaamanaachyuta ninnu deliyaga vasudhalO maa taramulaa ||

sakalalOka nivaasa naayaka Sauri murahara naraharee
prakaTamaayenu nee guNaMbulu paalamuchcha vaTaMchunu
vikaTamuga ninu ganna talli vaela nee vadanaMbu meeTina
akaTa haa yani nOru derachina yaMdu lOkamuluMDenu ||

Sreesatipati daityadaanavaSiksha kaamara rakshaka
raasi kekkenu baMDiroppina ravvalaa nee naetalu
mOsamuna narjunuDu neelO muMdu gaanaka maaTalaaDina
vaasavaarchita viSvaroopamu vasudha joopitivavuduvu ||

namO namO SreevaeMkaTaeSvara naaradapriya bhaktavatsala
vimalamagu nee daasulide nee vidya lellaa joochiri
sumukhulaina kariSabari baliyunu Sukadhruvaadulu ninnu goluvaga
samata vunnatapadamu losagiti sarvamiMdunu gaMTimi ||

Monday, 9 January 2012

సేవే భావే శ్రీ బృందం

సేవే భావే శ్రీ బృందం
శ్రీ వల్లభ చింతానందం ||

పటుకుతర్కనగ బంజన దీక్షం
కుటిల దురితహరగుణ దక్షం
ఘటితమహాఫల కల్పకవృక్షం
చటుల రామానుజ శమదమభిక్షం ||

కృద్ధమృషామత కుంఠన కుంతం
బౌద్ధాంధకార భాస్వంతం
శుద్ధచేదమణి సుసరస్వంతం
సిద్దాంతీకృత చిన్మయకాంతం

చార్వాకగహన చండకుఠారం
సర్వాపశాస్త్ర శతధారం
నిర్వికారగుణ నిబిడ శ్రీవేంక
టోర్వీధర సంయోగ గభీరం ||



Audio Link : సేవే భావే శ్రీ బృందం

చిత్తగించు మా మాటలు

చిత్తగించు మా మాటలు శ్రీ నరసింహ
చిత్తజ జనక వో శ్రీ నరసింహా ||

చెలరేగి యున్నాడవు శ్రీనరసింహ నీకు
చెలులెల్లా మొక్కేరు శ్రీనరసింహ
సెలవుల నవ్వే రిట్టె శ్రీ నరసింహ నీకె
నెలవు మా వలపు శ్రీనారసింహ ||

చిందీనె చెమటలు శ్రీనరసింహా నిను
జెందీ నది కడుజాణ శ్రీనరసింహ
చెందమ్మిరేకు గోళ్ళ శ్రీనరసింహ
చిందులెల్ల బాడేము శ్రీనారసింహ ||

సిరినెరగౌగిటి శ్రీనరసింహ మంచి
సిరుల యహోబల శ్రీనరసింహా
సిరసెత్తు శ్రీవేంకట శ్రీనరసింహ నీ
సెర బడివారము శ్రీనారసింహ ||

Audio Link : చిత్తగించు మా మాటలు

Sunday, 31 August 2008

మేలుకో శృంగార రాయ

మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
మేలుకోవె నా పాలి మించిన నిధానమా

1. సందడించే గోపికల జవ్వన వనములోన
కందువ దిరిగే మదగజమవు
ఇందుముఖి సత్యభామ హృదయపద్మములోని
గంధము మరిగినట్టి గండు తుమ్మెద

2. గతికూడి రుక్మిణి కౌగిటి పంజరములో
రతి ముద్దుగులికేటి రాచిలుకా !
సతులు పదారువేల జంట కన్ను కలువలకు
ఇతవై పొడిమిన నా ఇందు బింబమా

3. వరుస కొలనిలోని వారి చన్ను కొండలపై
నిరతి వాలిన నా నీల మేఘమా
సిరినురమున మోచి శ్రీ వేంకటాద్రి మీద
గరిమ వరాలిచ్చే కల్ప తరువా


కీర్తన వినండి.. Pl open the link in a new Tab.

Monday, 4 August 2008

ఒకపరికొకపరి

ఒకపరికొకపరి కొయ్యారమై
మొకమున కళలెల్ల మొలచినట్లుండే


జగదేకపతిమేన చల్లిన కర్పూరధూళి
జిగికొని నలువంక చిందగాను
మొగి చంద్రముఖి నురమున నిలిపె గాన
పొగరు వెన్నెల దిగబోసి నట్లుండే


పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టుపునుగు
కరగి ఇరుదెసల కారగాను
కరిగమన విభుడు గనుక మోహమదము
తొరగి సామాసిరి తొలకినట్లుండే


మెరయ శ్రీవేంకటేశు మేన సింగారముగాను
తరచైన సొమ్ములు ధరియించగా
మెరుగు బోడి అలమేలు మంగయు తాను
మెరుపు మేఘము గూడి మెరిసినట్లుండే


ఈ కీర్తనలో వేంకటేశ్వరుని అందాన్ని వర్ణిస్తున్నాడు కవి. అందాన్ని వర్ణించడమే కాదు, ఒక అందాన్ని మరో అందంతో పోలుస్తూ, రెండిటికీ ఒక సంబంధాన్ని ఊహించడం ఇందులో విశేషం.

కళలన్నీ మొహంలోనే మొలకెత్తినట్టుగా ఉండే ఇతన్ని, చూసిన ప్రతిసారీ ఓ కొత్త ఒయ్యారం కనిపిస్తునే ఉంటుంది!

పొరి - మిక్కిలి. మెరుగు - నునుపైన. తట్టుపునుగు - మేలిరకం పునుగు (ఒక సుగంధద్రవ్యం). మోహమదము - మోహం వల్ల పుట్టే స్వేదం. తొరగి - కారి. సామజ సిరి - ఏనుగు మదజలం. తొలకు - కురియు
నున్నని చెక్కులపై పూసిన పునుగు కరిగి రెండువైపులా కారుతోంది. అదెలా ఉందంటే, మోహంవల్ల పుట్టే చెమటలా ఉంది. ఈ ప్రభువు ఏనుగునడకలాంటి అందమైన నడక ఉన్నవాడు కాబట్టి (సామజ వర గమన), ఏనుగ వెళుతూంటే దాన్నుంచి కారే మదజలంలా ఉందిది. పునుగు నల్లగా ఉంటుంది. ఏనుగునుంచి కారే మదజలమూ నల్లగానే కనిపిస్తుంది.


తరచైన - ఘనమైన (thick). మెరుగుబోడి - మెరుపులాంటి శరీరం కలది. ఒంటిమీద ఘనమైన అలంకారాలతో మెరుస్తున్నాడు వేంకటేశుడు. పక్కనే మెరుపుతీగలాంటి అలమేలు మంగమ్మ, ఎలా ఉందంటే, మెరుపు మేఘంతో కూడి వెలిగిపోతున్నట్టుంది. వేంకటేశుడు నల్లనివాడు కదా!


శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger