Thursday, 11 March 2010

శ్రీ నామ రామాయణం

బాల కాండము

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కాలాత్మక పరమేశ్వర రామ
శేషతల్ప సుఖ నిద్రిత రామ
బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ
కాండ కిరణకుల మండన రామ

శ్రీ మద్దశరధ నందన రామ
కౌసల్యా సుకవర్దన రామ
విశ్వామిత్ర ప్రియతమ రామ
ఘోరతాటకాఘాతక రామ
మారీచాది నిపాతక రామ
కౌశికముఖ సంరక్షక రామ
శ్రీ మదహల్యోద్ధారక రామ
గౌతమ ముని సంపూజిత రామ
సురమని వరగణ సన్స్తుత రామ

నావికా ధావిత మృదుపద రామ
మిధిలాపురజన మోహక రామ
విదేహ మానసరంజక రామ
త్ర్యంబక కార్ముక భంజక రామ
సీతార్పిత వరమాలిక రామ
కృత వైనామిక కౌతుక రామ
భార్గవ దర్ప వినాశక రామ
శ్రీమదయోధ్యా పాలక రామ

Friday, 11 December 2009

మిన్నక వేసాలు మాని

Get this widget | Track details | eSnips Social DNA

మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా
సన్నల నీ యోగ నిద్ర చాలు మేలుకోవయ్యా ||

ఆవులు పేయలకు గానఱచీ బిదుకవలె
గోవిందుడయింక మేలుకొనవయ్యా
ఆవలీవలిపడుచులాటలు మరిగి వచ్చి
త్రోవ గాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా ||

వాడల గోపికలెల్లా వచ్చి నిన్నుముద్దాడ
గూడియున్నారిదే మేలుకొనవయ్యా
తోడనే యశోద గిన్నెతో బెరుగు వంటకము
ఈడకు దెచ్చి పెట్టెనిక మేలుకోవయ్యా ||

పిలిచీ నందగోపుడు పేరు కొనియదె కన్ను -
గోలుకులు విచ్చి (ఇంక) మేలుకొనవయ్య
అలరిన శ్రీ వేంకటాద్రిమీద బాలకృష్ణ
యిల మామాటలు వింటివిక మేలుకోవయ్య ||

అన్నమయ్య పై సంకీర్తన ద్వారా యోగనిద్రలో మునిగియున్న ఆ గోపబాలుని మేలుకొలుపుతున్నారు.

భావము :

నీ ఆటలు, యోగనిద్రా కట్టిపెట్టవయ్యా ! ఆవులు దూడలకు పాలిచ్చువేళ అయినది. అవి అంబారావం చేస్తున్నవి. పాలు పితికే వేళ అయినది. నీ తోటి గోప బాలురందరూ, నీతో ఆటలాడుటకు నీ వాకిట వచ్చి చేరి యున్నారు. గోపికా మణులు నీపై వ్యామోహంతో నిన్ను ముద్దులాడు వచ్చి యున్నారు. నీవు ఆరగించుటకై, నీ తల్లి యశోదమ్మ వాత్సల్యంతో బంగారు గిన్నెలో పెరుగన్నం తెచ్చి నీ చెంత నిలచి యున్నది. మేల్కొనవయ్యా ! గోపరాజైన నీ తండ్రి, నందుడు నిన్ను చేరి పిలుస్తున్నాడు.

నందరాజునకు శ్రీకృష్ణుడంటే ఎంతో ప్రేమ. శ్రీకృష్ణునకు అసురులవలన ఎపుడు ఆపద కలుగుతుందో అన్న భయంతో, నందుడు ఎల్లపుడూ చేతిలో వేలాయుధం ధరించి రక్షకుడుగా ఉంటాడట. శేషగిరిలో నెలకొన్న ఓ బాలకృష్ణా ! విశాలమయిన నీ పద్మనయనములను తెరచి మమ్ము కృపతో ఏలుకోవయ్యా !

మిన్నక వేసాలు = అనాయాసముగా వేసే వేషము
పేయల = దూడల
కన్నుకొలుకులు = కంటి చివరులు
అలరించు = ఉదయించు

Tuesday, 3 November 2009

భావయామి గోపాలబాలం (Translation)

భావయామి గోపాలబాలం మన -
స్యేవితం తత్పదం చింతయేయం సదా ||

కటిఘటిత మేఖలా ఖచితమణిఘంటికా -
పటలనినదేవ విభ్రాజమానం
కుటిల పదఘటిత సంకుల శింజీతేన తం
చటులనటనా సముజ్జ్వల విలాసం ||

నిరత, కర, కలిత నవనీతం బ్రహ్మాది -
సురనికర భావనా శోభిత పదం
తిరువేంకటాచల స్థితమనుపమం హరిం
పరమ పురుషం గోపాల బాలం ||

[ అన్నమయ్య ఆధ్యత్మిక సంకీర్తన ]

తత్పదం = అతని పదములను
కటిఘటితమేఖలా = మొలనున్న త్రాటికి
సదా = ఎల్లప్పుడు
ఖచితమణిఘంటికా = ఉన్న మణిఘంటి యొక్క
పటిలనినదేన = స్పష్టమైన శబ్దముతో
విభ్రాజమానం = ప్రాశించువానిని
కుటిలపదఘటిత = వంకరగా నడచు పదముల యందున్న
చటులనటనాసముజ్జ్వలవిలాసం = ప్రకాశించు నృత్య విలాసము గలవాడు
నిరత కరకలితనవనీతం = ఎల్లప్పుడు చేతియందు వెన్న గలిగి ఉండువాడు
బ్రహ్మాది సురనికరభావనాశోబితపదం = బ్రహ్మాది దేవతలు భావించే పదములు కలవాడు
అనుపమం = అద్వితీయుడైన
హరిం = హరిని
భావయామి = భావించెదను

సత్య జ్ఞానానంద స్వరూపుడును, నిత్య సిద్ధుడును, ఈ సకల చరాచర సృష్టిలో ఉత్తముడును, సాక్షి స్వరూపుడును, అపరిమిత సామర్ధ్యము కలవాడును అయిన శ్రీ కృష్ణభగవానుడు సర్వజనులకు నంతర్యామి స్వరూపుడయి ఉండువాడు. యోగుల చేత ఎల్లప్పుడును ధ్యానింపబడువాడు. ఇతడు సకల జగత్తుకును, సృష్టి స్థితి సంహారకర్త! ఈ మనుష్య లోకమున అందరినీ ఆనందింపజేయుచుండును. నారదుడు మొదలగు మహా యోగుల చేత నిత్యము సేవింపబడువాడు. ఇట్టి శ్రీకృష్ణ భగవానుని మనః పూర్వకంగా సేవిస్తూ తరిస్తున్నాడు అన్నమాచార్యులు. అన్నమాచార్యులవారు వేలకొలది తెలుగు లో సంకీర్తనలను రచించినను, అందులో కొన్ని సంస్కృత సంకీర్తనలు కూడ కలవు. బాలకృష్ణ కిషోరుని 'భావయామి గోపాలబాలం' అనే సంస్కృత సంకీర్తనలో ఇలా వర్ణిస్తున్నాడు.

నడుమ మొల నూలుకు కూర్చబడిన మణి ఘంటల సవ్వడితో ప్రకాశించు వాడును, వివిధ నవ్య నాట్య భంగిమలతో పాదములు తాటించుటతో ఘల్లు, ఘాల్లు మను ధ్వనితో కూడిన ఆబాలగోపాలుని పాద ద్వయాన్ని ఎల్లప్పుడు స్మరిస్తాను. చేతి వెన్నముద్ద గల బాలకృష్ణుని, బ్రహ్మాది దేవతలందరూ భక్తిభావంతో కొలుస్తున్నారు. ఉత్తమ స్థానమయిన (వైకుంఠం) తిరు వేంకటాచలం పై వెలసిన ఆ తిరువేంగళ నాధుడే బాల గోపాలుడు.


By -
Dr.Chelikani Murali Krishna Rao,
'Padakavita pitamahudu Sri Taallapaaka Annamacharya jivita charitra mariyu sankeertanalu'
Available at Visalandhra Book Stores for Rs.150/- only.

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger