Sunday 22 March 2009

కంటి శుక్రవారము

Get this widget | Track details | eSnips Social DNA

కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని

సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి
కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మ తోన వేష్టువలు రొమ్ము తల మొల చుట్టి
తుమ్మెద మైచాయతోన నెమ్మది నుండే స్వామిని ||

పచ్చ కప్పురమె నూఱి పసిడి గిన్నల నించి
తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరుపడి చూడ అందరి కన్నులకింపై
నిచ్చె మల్లెపూవు వలె నిటుతానుండే స్వామిని ||

తట్టు పునుగే కూరిచి చట్టలు చేరిచినిప్పు
పట్టి కరగించి వెండి పళ్యాల నించి
దట్టముగ మేను నిండ పట్టించి దిద్ది
బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని ||

జగడపు జనవుల జాజర

Get this widget | Track details | eSnips Social DNA

జగడపు జనవుల జాజర
సగినల మంచపు జాజర ||

మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడు జారగ పతిపై
చల్లే రతివలు జాజర ||

భారపు కుచముల పైపైగడు సిం -
గారము నెరపెటి గందవొడి
చేరువ పతిపై చిందగ పడతులు
సారెకు చల్లేరు జాజర ||

బింకపు కూటమి పెనగేటి చెమటల
పంకపు పూతల పరిమళము
వేనటపతిపై వెలదులు నించేరు
సను మదంబుల జాజర ||

Thursday 19 March 2009

దేవీ స్తుతి

యా దేవీ సర్వభూతేషు చేతనే త్యభిధీయతే
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు క్షుదారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు చాయారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు క్షుదారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

విష్ణు సహస్ర నామం శ్లో ||12

శ్లో || వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితః సమః
అమోఘః పుండరీకాక్షో వృష కర్మా వృషా కృతిః

1. వసుః = సృష్టియందలి సంపద
2. వసుమనాః = సంపదలను కోరు మనస్తత్వము
3. సత్యః = సత్యము లేక ధర్మము
4. సమాత్మా = సామ్యమగు పరమాత్మ
5. సమ్మితః = చక్కగా కొలువబడువాడు
6. సమః = సమత్వము కలిగినటువంటివాడు
7. అమోఘః = వ్యర్థము కానివాడు
8. పుండరీకాక్షః = పద్మము వంటి కన్నులు కలవాడు
9. వృషకర్మా = వర్షము కలిగించువాడు
10. వృషాకృతిః = వర్షమే తానయినవాడు

భావము :

సృష్టి యందలి సంపదగానూ, ఆ సంపదను గోరు మనస్సుగనూ, సత్యముగను, ధర్మముగానూ, సామ్యము గలవానిగను, చక్కగా కొలువబడువానిగనూ, సముడుగనూ, వ్యర్థముకాని వానిగను, పద్మము వంటి కన్నులు కలవానిగనూ, వర్షము కలిగించువాని గనూ, వర్షమే తానయినవానిగనూ ధ్యానము చేయవలెను.

విష్ణు సహస్ర నామం శ్లో || 11.

శ్లో || అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః
వృషా కపి రమే యాత్మా సర్వయోగ వినిస్సృతః

1. అజః = పుట్టనివాడు
2. సర్వేశ్వరః = అన్నిటికి అధిపతి అయినవాడు
3. సిద్ధః = నెరవేర్చువాడు
4. సిద్ధిః = నెరవేర్పబడినది
5. సర్వాదిః = అన్నిటికిని మొదలుయైనవాడు
6. అచ్యుతః = జారనివాడు
7. వృషా కపిః = వర్షించి మరల గ్రహించువాడు
8. అమేయాత్మా = కొలతల కందని ఆత్మ తత్వము కలవాడు
9. సర్వ యోగ వినిస్సృతః = అన్ని లోకముల యందలి పరిణామము వలన సృష్టిని పుట్టించువాడు

భావము :

పరమాత్మను పుట్టనివానిగనూ, అన్నిటికినీ అధిపతిగనూ, సాధిపబడిన మరియూ సాధించుటయను రెండునూ తానే అయినవాడుగ, అన్నిటికన్నా మొదటగా నున్నవాడుగ, జారిపోవుట లేనివానిగా, వర్షములు కలిగించి మరల నీటిని స్వీకరించువానిగ, కొలత కందని ఆత్మతత్త్వము కలవానిగ, అన్ని లోకముల యందలి సామ్యముగా, సృష్టిని పుట్టించువానిగా, ధ్యానము చేయవలెను.

శ్రీనివాసం నమామ్యహం

శ్రీనివాసం - Templates Novo Blogger