Sunday, 26 October 2008

కంటి నఖిలాండతతి కర్తనధికునిగంటి

Get this widget | Track details | eSnips Social DNA


కంటి నఖిలాండతతి కర్తనధికునిగంటి
కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి

మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి
బహు విభవముల మంటపములు గంటి
సహజనవరత్న కాంచనవేదికలు గంటి
రహివహించిన గోపురంబులవె కంటి

పావనంబైన పాపవినాశనము గంటి
కైవశంబగు గగనగంగ గంటి
దైవికపు పుణ్య తీర్ధములెల్ల పొడగంటి
కోవిదులు కొనియాడు కోనేరు గంటి

పరమయోగీంద్రులకు భావగోచరమైన
సరిలేని పాదాంబుజములు గంటి
తిరమైన గిరిచూపు దివ్య హస్తము గంటి
తిరువేంకటాచలాధిపు చూడగంటి

మొత్తకురే అమ్మలాల

Get this widget | Track details | eSnips Social DNAమొత్తకురే అమ్మలాల - ముద్దులాడు వీడె
ముత్తెము వలె నున్నాడు - ముద్దులాడు

1. చక్కని యశోద తన్ను సలిగతో మొత్త రాగా
మొక్క బోయీ గాళ్ళకు - ముద్దులాడు
వెక్కసాన రేపల్లె - వెన్నలెల్ల మాపుదాక
ముక్కున వయ్యగ దిన్న - ముద్దు లాడు

2. రువ్వెడి రాళ్ళ దల్లి - రోలదన్ను గట్టెనంట
మువ్వల గంటల తోడి ముద్దు లాడు
నవ్వెడి జెక్కులనిండ - నమ్మిక బాలుని వలె
మువ్వురిలో - నెక్కుడైన ముద్దులాడు

3. వేలసంఖ్యల సతుల - వెంటబెట్టుకొనిరాగా !
మూల జన్ను గుడిచీని ముద్దులాడు
మేలిమి వెంకటగిరి మీద నున్నాడిదె వచ్చి
మూలభూతి దానైన ముద్దులాడు

దుండగీడైన కృష్ణుని ఎవతో కొట్ట్బఒగా మఱొక్క తరిగ వారించుట పద వస్తువు.

ముంగర ముత్తెము వలె ముద్దులు కులిలే చిన్ని కృష్ణుని మొత్తుటకు ఎవరికి మాత్రము చేతులెట్లాడును ?

గొల్ల భామ మరొక్క గొల్లభామకు బాలకృష్ణుని లీలావిలాసాలను వినిపిస్తున్నది. యశోద తన చిన్నికృస్ణుని మొత్త బోయినది (కొట్టబోయినది) వెంటనే ముద్దు కృష్ణుడు తల్లి కాళ్ళకు మొత్త బోయినాడు. బాల కృష్ణుడు సామాన్యుడా ?

అందితే జుట్టు - అందకపోతే కాళ్ళు - కృష్ణునకిది వెన్నతో బెట్టిన విద్య. ఇంకేమున్నది ? గోపెమ్మ కోపము మటు మాయమైనది. కృష్ణునకు అలుసు చిక్కినది. సఖులతో పరిహాసకులతో ఊరిమీదికి బోయి, గొల్ల ల ఇళ్ళను కొల్లగొట్టినాడు. వెన్న ముద్దలు మాపుదాకా ముక్కున కారునట్లు మెక్కినాడు.

గోపకిశోరుని అల్లరి మితిమీరినది. యశోదమ్మ బాలుని దండింపదలచినది. చిన్ని కృష్ణుని రోట గట్టినది. అది అంత తేలికా ? దామోదరునికి కోపమే వచ్చినది. తన్ను రోటికి కట్టిన తల్లిపై రాళ్ళు రువ్వినాడు. తన చిన్ని చేతులకు అందినంత వరకు విసిరినాడు. చిదిమిన పాలు గారు చిన్ని బుగ్గలతో, చిలికిన నవ్వులతో, మొల చిరు మువ్వలతో గోకులమంతా కలియ దిరిగే నందకిశోరుడు బాలుడా ! పరబ్రహ్మ స్వరూపుడు. త్రిమూర్తులలో మేటియైనవాడు.

బాలకృష్ణ కేళీవిలాసాలు చిలికి చిలికి పెద్దవైనవి. యశోదతో ఫిర్యాదు చేయుటకు వ్రజ భామలు కదలి వచ్చినారు. గోకుల మిల్లిల్లు కదలినది. అక్కడి దృశ్యమును చూచి పల్లీబిబ్బోకవతులు ఆశ్చర్య చకితలైనారు. కృష్ణుడు పసిబాలుని వలె ఒక మూలకు ఒదిగి, యశోదాదేవి యొడిలో చేరి పాలు త్రాగుతున్నాడు. ఆ తల్లి కన్నులతో వాత్సల్యాన్ని కురిపిస్తూ, తన తనయుని తల నిమురుతున్నది. ముద్దుగుమ్మలు ఆ ముద్దుల బాలుని చూచి ముసి ముసి నగవులతొ వెనుకకు మరలినారు.

ఆ లీలామానుష విగ్రహుడే నేడు వేంకటగిరిమీద మూలభూతియై నిలచినవాడు.

విన్నపాలు వినవలె

Get this widget | Track details | eSnips Social DNAవిన్నపాలు వినవలె - వింత వింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా.


1. తెల్లవారె జామెక్కె - దేవతలు మునులు
అల్లనల్లనంత నింత నదిగో వారే
చల్లని తమ్మిరేకుల సారసపు గన్నులు
మెల్ల మెల్లనె విచ్చి మేలుకొన వేలయ్యా

2. గరుడ కిన్నర యక్ష కామినులు గములై
విరహపు గీతముల వింతాలాపాల
పరిపరివిధముల బాడేరు నెన్నదివో
సిరి మొగము దెరచి చిత్తగించ వేలయ్యా

3. పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు
పంకజభవాదులు నీ పాదాలు చేరి
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా

భావము :

విన్నపాలు = వేరు వేరు అధికారులు నిత్యమును చేయు సునామణి మాటలు అవి వింత వింతలైనవి.

పన్నగపు దోమతెర = ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువునకు పలువిధములగు భోగోపకరణములుగా సేవ చేయును. అట్లే ఆ పన్నగము - పాము దోమతెరగా గూడ రూపెత్తి సేవించును.

అంతనింతన్ = దూరముగా, దగ్గరగా, పెద్ద చిన్న గుంపులుగా, సారసపు = సరసమే సారసము - రసముతో - ప్రీతితో కూడినది.

గములు = గుంపులు, వింతాలాపాలన్ = క్రొత్త క్రొత్త రాగాలాపములతో,

సిరి మొగము = శ్రీమంతమైన ముఖము

తెరచి = దోమతెర మఱుగు దొలగించి చూపి.

అంకెలన్ = సమీపమున

అలమేలుమంగ = అలర్ మేల్ మంగై - పూవు (తామర) మీది స్త్రీ అను తమిళ పదమునకు తెలుగు వికృతి. తమిళంలో 'మంగై ' అనగా 14 - 18 ఏళ్ళ మధ్య వయసు గల స్త్రీ. నిద్ర మేల్కనిన నీ మొదటి చూపు మంగళ దేవతయైన ఆ పద్మావతీ దేవి మీద ప్రసరించుట జగన్మంగళ హేతు వగును.

ఇది స్వామికి మేలుకొలుపు. ఇది సకల చరాచర సృష్టికే మేలుకొలుపు. మనకే కాదు - భగవంతునికి కూడ దోమతెర కట్టుకొనుట తప్పలేదు. ఆది శేషుడున్నంతవరకు స్వామికి ఏ కొరత లేదు. అవతారములెత్తుటలో శేషుడు తన ప్రభువునకు ఏమీ తీసిపోవువాడు కాదు. 'ఆది శేశుడు శ్రీ మహావిష్ణువునకు పలు విధములగు భోగోప కరణములుగా సేవ చేయు ' నని యమునాచార్యులవారు ఆనతిచ్చినారు. వారు 'వారణాదిభిః ' అనుట మేలైనది. అన్నమయ్య పన్నగమును దోమతెరగ కూడ భావించినాడు. అతనిదొక విలక్షణమైన భావచిత్రణ.

అందరి విన్నపాలు వినవలెనని మేలుకొను మని అన్నమయ్య తన విన్నపాలనే స్వామికి తొలుత వినిపించినాడు. భక్త పరాధీనుడైన భగవంతునకు వినక తప్పలేదు.

అదిగో - తెల తెలవారినది. ప్రొద్దు జామెక్కినది. ముక్కోటి దేవతలు, మునులు - అరుగో అంతలంతల నిలచినారు. మెల్ల మెల్లగా నీ కన్నుందామరలు విచ్చి చల్లని చూపులు వారిపై చల్లవయ్యా !

అవిగో - క్రొత్త క్రొత్త రాగాలాపనలు నీకు వినిపించుట లేదా ? అవి గుంపులు గుంపులుగ నీ యొద్ద చరిన గరుడ కిన్నెర యక్ష కామినుల విరహ గీతములు. నీ ప్రణయ దృక్కులతో వారి కోరికలు తీర్చుము. దోమతెర తోల్గించి, సిరులు చిందే నీ ముఖమును చూపుము. ఆ హరిణేక్షణల చిత్తములను తెలిపే పాటలను చిత్తగించవయ్యా !

అరుగో (దోమ తెర యైన) శేషుడు, తుంబురు నారదాదులు. బ్రహ్మ - అందరు నీ పాదాల సన్నిధిలోనే నిలచి యున్నారు. తొంగలి రెప్పలు విచ్చి నీ తొలి చూపు కలిమికలికిపై నిలుపవయ్య ! జగన్మంగళ - అలమేలుమంగను చూడవయ్యా !

ఈ వింత వింత విన్నపములు విని సిరిమగడు ముసి ముసి నగవులతో నిద్ర లేచియే ఉండును.


(శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ మరియు శ్రీ కామిశెట్టి శ్రీనివాసు గార్ల వివరణ)

మధురాష్టకం

అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం


వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం
చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం

వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాధౌ మధురౌ,
నృత్యం మధురం సఖ్యం మధురం, మధురాధిపతేరఖిలం మధురం

గీతం మధురం పీతం మధురం, భుక్తం మధురం సుప్తం మధురం,
రూపం మధురం తిలకం మధురం, మధురాధిపతేరఖిలం మధురం

కరణం మధురం, తరణం మధురం, హరణం మధురం రమణం మధురం,
వమితం మధురం శమితం మధురం, మధురాధిపతేరఖిలం మధురం

గుంజౌ మధురా మాలా మధురా, యమునా మధురా వీచీ మధురా,
సలిలం మధురం కమలం మధురం, మధురాధిపతేరఖిలం మధురం

గోపీ మధురా లీలా మధురా, యుక్తం మధురం ముక్తం మధురం,
దృష్టం మధురం శిష్టం మధురం, మధురాధిపతేరఖిలం మధురం

గోపా మధురా గావో మధురా, యష్టిర్మధురా సృష్టిర్మధురా,
దళితం మధురం ఫలితం మధురం, మధురాధిపతేరఖిలం మధురం

- శ్రీ మద్వల్లభాచార్య

తెప్పగా మఱ్రాకు మీద తేలాడు వాడు

తెప్పగా మఱ్రాకు మీద తేలాడు వాడు
ఎప్పుడు లోకములెల్ల నేలేటి వాడు

మోత నీటి మడుగులో ఈత గఱిచినవాడు
పాతగిలే నూతి క్రింద బాయనివాడు
మూతి దోసిపట్టి మంటి ముద్ద పెల్లగించువాడు
రోతయైన పేగుల పేరులు గలవాడు

కోడికూతనోరివాని కుఱ్రతమ్ముడైనవాడు
బూడిదిబూసినవాని బుద్ధులవాడు
మూడవన్నె లేడివెంట మాయలబడినవాడు
దూదలనావులగాచి దొరయైనవాడు

ఆకసాన బారే వూరి అతివలమానముల
కాకుసేయువాడు తురగముపై వాడు
ఏకమై వెంకటగిరి నిందిరారమణిగూడి
యేకాలము బాయని యెనలేనివాడు

భావము : -

మోతనీటి మడుగు = ఘోషించు నీరు గల సముద్రము (మత్స్య)
పాతగిలే = ప్రాచీనుడయియే
నూతి క్రింద = సముద్రము నడుగున (అతనిపాలికి సముద్రము మడుగు నూయి వంటిది) - (కూర్మ)
తోసిపట్టి = చాచిపట్టుకుని (వరాహ)
పేగుల పేరులు = హిరణ్యకశిపునివి (నృసింహ)

కోడి..వాడు = అహల్యను పొందుటకై అర్ధరాత్ర మందే కోడియై కూసిన ఇందృని తమ్ముడు ఉపేందృడు (వామన)
బూడిది .. వాడు = విభూతి దాల్చిన పరమశివుని వద్ద అస్త్రవిద్యలు నేర్చినవాడు (పరుశరామ)
మాడవన్నె = బంగారు వన్నె గల
లేడి ... వాడు = మారీచునిచే వంచితుడు (రామ)
దూడల ... వాడు = బలరామకృష్ణులలో ఎవరైనా గావచ్చును

ఆకసాన .. వాడు = త్రిపురముల రాణుల నడతను చెఱచిన వాడు (బుద్ధ)
తురగముపైవాడు = కల్కిగా నవతరించి గుఱ్రముమీద స్వారీ చేయువాడు (కల్కి)

భావము చెప్పినది : శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ

(సృష్టికి పూర్వము ఏకోదకములో వటపత్రశాయిగానున్న విష్ణుని దశావతారముల ఉల్లేఖము పద వస్తువు)

దర్మానికి గ్లాని కలిగినప్పుద్డు లోకపాలకుడైన భగవంతుడు అవతారాలెత్తక తప్పదు. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించుటయే వేంకటేశ్వరుని కర్తవ్యము. శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీత లో ఇట్లు చెప్పెను.

యదా యదాహి దర్మస్య గ్లాని ర్బవతి భారత ! అభ్యుత్ధాన మధర్మస్య తదా త్మానం సృజామ్యహం [ భగవత్గీత 4 అధ్యా 7 శ్లో ]

పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ! ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే [ భగవత్గీత 4 అధ్యా 8 శ్లో ]

సోమకాసురుడు వేదాలను అపహరించి, ధర్మచ్యుతి కి కారకుడైనాడు. సముద్రమున గాగిన ఆ రాక్షసుని విష్ణువు మత్స్యాకృతి దాల్చి సమ్హరించినాడు. వేదోద్ధరణము చేసినాడు.

క్షీర సాగర మధనము ప్రారంభమైనది. మందర పర్వతము మునగసాగినది. శ్రీ మహా విష్ణువు ఆదికూర్మమై దానిని మోసి నిలిపినాడు.

భూమిని చాపచుట్టగ చేసి ప్రజలను బాధించిన హిరణ్యాక్షుని వరాహావతారముని ధరింది సంహరించినవాడు; భూమిని కోరలతో పట్టి ఎత్తినాడు.

నృసింహాకృతి పూని లోక కంటకుడైన హిరణ్యకశిపుని పొత్త చీల్చి ప్రేగులను హారములుగ వేసికొన్నాడు.

వామన రూపుడై మూడడుగుల దాన మడిగి, త్రివిక్రముడై బలిని పాతాళమునకు త్రొక్కి, ఇంద్రునకు స్వర్గము నప్పగించినాడు.

ధరలో క్షత్రియుల ఔద్దత్యము మితిమీరినది. హరి పరశురాముడైనాడు. శివుని కడ అస్త్ర విద్యల నభ్యసించినాడు. ఇరువది యొక్క మారులు భూప్రదిక్షణము చేసి, దుష్టులైన క్షత్రియవీరులను నిర్జించినాడు.

మాయా మృగాకృతి తో మారీచుడు శ్రీ రాముని వంచించినాడు ; సీతాపహరణమునకు కారకుడైనాడు. రాముడు ఆ మాయావిని నేలకూల్చినాడు.

గొల్లపల్లెలో, గోవులతో, గోపాలురతో ఆడుతూ, పాడుతూ తిరిగిన నంద కిశోరుడు యాదవకుల ప్రభువైనాడు. పరమాత్ముడైనాడు.

త్రిపురముల గర్వముతో కన్ను మిన్ను కానక తిరిగిన త్రిపురాసుర సంహారమునకు హరి దోహదము చేసినాడు. బుద్ధుడై రాక్షసుల రాణుల శీలము నపహరించినాడు.

ఇక, కల్కిగా అవతరించి, ధర్మ రక్షణ చేసేవాడు, గుఱ్రముమీద స్వారీ చేసేవాడు శ్రీమన్నారాయణుడే.

ఇవి వేంకటగిరినిలయుని అవతార లీలలు. ఆ ఇందిరారమణుడు సాటిలేనివాడు. సర్వకాల సర్వావస్థల యందు ప్రాణికోటిని అనుగ్రహించుటకై శేషగిరి శిఖరముల నిలచినాడు.

Friday, 17 October 2008

నిత్య పూజలివివో

Get this widget | Track details | eSnips Social DNAనిత్య పూజలివివో నేరిచిన నోహో
ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి

తనువే గుడియట తలయే శిఖరమట
పెనుహృదయమే హరి పీఠమట
కనుగొన చూపులే ఘనదీపములట
తన లోపలి అంతర్యామినికిని

పలుకే మంత్రమట పాదైన నాలికే
కలకలమను పిడి ఘంటయట
నలువైన రుచులే నైవేద్యములట
తలపు లోపల నున్న దైవమునకు

గమన చేష్టలే అంగరంగగతియట
తమిగల జీవుడే దాశుడట
అమరిన వూర్పులే ఆలవట్టములట
క్రమముతో శ్రీ వేంకటరాయనికి

జయ జయ నృసింహ సర్వేశ

Get this widget | Track details | eSnips Social DNAజయ జయ నృసింహ సర్వేశ
భయహర వీర ప్రహ్లాదవరద

మిహిర శశినయన మృగనరవేష
బరిరంతస్థల పరిపూర్ణ
అహినాయక సింహాసన రాజిత
బహుళ గుణగణ ప్రహ్లాదవరద

చటుల పరాక్రమ సమఘనవిరహిత
నిటలనేత్ర మౌని ప్రణుత
కుటిలదైత్యతతి కుక్షి విదారణ
పటు వజ్రనఖ ప్రహ్లాదవరద

శ్రీవనితా సంశ్రిత వామాంక
భావజకోటి ప్రతిమాన
శ్రీవేంకటగిరిశిఖరనివాస
పావనచరిత ప్రహ్లాదవరద

బండి విరిచి

Get this widget | Track details | eSnips Social DNA


బండి విరిచి పిన్న పాపలతో నాడి
దుండగీడు వచ్చె దోబూచి

1) పెరుగు వెన్నలు ప్రియమున వే
మరు ముచ్చిలించు మాయకాడు
వెరవున్నా దన విధము దాచుకొని
దొరదొంగ వచ్చె దోబూచి

2) పడుచు గుబ్బెత పరపుపై పోక
ముడి కొంగు నిద్రముంపునను
పడుయుతా వద్ద పవళించినట్టి
తొడుకు దొంగ వచ్చె దోబూచి

3) గొల్లపల్లెలో ఇల్లిల్లూ చొచ్చి
కొల్లలాడినా కోడెకాడు
యెల్లయినా వేంకటేశుడు ఇదె
తొల్లిటిదొంగ వచ్చె దోబూచి


{Couldnt understand charanam (2)though}

Wednesday, 15 October 2008

బ్రహ్మ కడిగిన పాదము

బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానె నీ పాదము

చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము

కామిని పాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము

పరమయోగులకు పరిపరివిధముల
పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమపదము నీ పాదము

వినండి :

Get this widget | Track details | eSnips Social DNA

Thursday, 2 October 2008

భావయామి గోపాలబాలం

భావయామి గోపాలబాలం మన
స్సేవితం తత్పదం చింతయేయం సదా

1. కటిఘటిత మేఖలా ఖచితమణిఘంటికా
పటలనినదేవ విభ్రాజమానం
కుటిలపదఘటిత సంకుల శింజీతే నతం
చటులనటనా సముజ్జ్వలవిలాసం

2. నిరతకరకలితనవనీతం బ్రహ్మాది
సురనికరభావనాశోభిత పదం
తిరువేంకటాచల స్థిత మనుపమం హరిం
పరమపురుషం గోపాలబాలం.


Listen to MSS

Get this widget | Track details | eSnips Social DNA
Listen to SP Sailaja
Get this widget | Track details | eSnips Social DNA

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger