Saturday, 17 March 2012

నానాటి బదుకు నాటకమునానాటి బదుకు నాటకము
కానక కన్నది కైవల్యము

పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాటకము
యెట్టనెదుట గలదీ ప్రమంచమును
కట్టగడపటిది కైవల్యము

కుడిచేదన్నము కోక చుట్టెడిది
నడు మంత్రపు పని నాటకము
వొడి గట్టుకొనిన వుభయ కర్మములు
గడి దాటినపుడే కైవల్యము

తెగదు పాపమును తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
యుగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము


నానాటి = రోజు రోజుకు
నడు మంతరము = మధ్య కాలమున కలిగినది
పని = జీవితము
ఒడికట్టు = భరింపటానికి సిద్ధపడిన
ఉభయకర్మములు = సంచిత ప్రారబ్దాలు
కైవల్యము = మోక్షము
ఎగువనె = ఎత్తైన ప్రదేశములో

భౌతిక ప్రపంచములో మన జీవితం నాటకము, అసత్యమని వివరిస్తూ శాశ్వతమైన మోక్షాన్ని సాధించాలని అన్నమయ్య ఈ కీర్తన లో బోధిస్తున్నాడు. రోజొ రోజూ సాగే ఈ జీవితం నాటకం. అస్పష్టంగా కనిపించేది ఎంతో పుణ్యం చేసుకొంటేనే దక్కేది మోక్షం. పుట్టుట నిజం. చనిపోవుట నిజం. ఆ రెండింటి మధ్య గల జీవితం నాటకం. కళ్ళకు కనిపిస్తూ ఎదురుగా ఉన్న ప్రపంచం భ్రమ. బాగా దూరంగా వుండి, వాస్తవమైనది మోక్షం. తినేది అన్నం. చుట్టుకొనేది బట్ట. ఆ రెండింటి పోరాటాల మధ్యగల జీవితం నాటకం. ఈ జీవిని అంటిపెట్టుకొని ఉండేవి సంచిత ప్రారబ్దాలు. వాటి సరిహద్దులు దాటినప్పుడే మోక్షం. పాపం సమాప్తం కాదు. పుణ్యం లభించదు. ఈ రెండింటిని ఆచరించే మనల్ని చూసి నవ్వే కాలం నాటకం. ఎత్తైన కొండల మీద ఉన్న శ్రీ వేంకటేశ్వరుడే మనకు ప్రభువు. ఆకాశాన్ని దాటిపోతే మోక్షం.


కష్టపడి సంపాదించిన సొమ్ములు భూమి మీద ఉండిపోతాయి. పశువులు వాటికి సంబంధించిన శాలల్లో ఉండిపోతాయి. భార్య గుమ్మం దగ్గరే ఉంటుంది. బంధు జనులు శ్మశానం వరకు వస్తారు. మురిపెంగా పెంచ్జుకొన్న శరీరం చితిలో కాలిపోతుంది. కర్మను అనుసరించి జీవుడొక్కడే ఈ లోకాన్ని విడిచి వెళతాడు. అతని వెంట ఎవరూ రారు. అందుకే అన్నమయ్య 'నానాటి బదుకు నాటకమూ అన్నాడు.

ప్రపంచమేంటే విస్తరించబడినది అని అర్ధం. మన శరీరంలో ఉన్న పంచ భూతాలే (భూమి, నీరు అగ్ని గాలి, ఆకాశం) మన ఎదుటగా ఉన్నాయని అదే ప్ర 'పంచ' మని అన్నమయ్య నిర్వచిస్తున్నాడు. కొంతమంది అన్నం తింటుంటే కొంతమందిని ఆశ తింటుంటుంది. అన్న వస్త్రాల కోసం (జీవితావసరాల కోసం) చేసే పోరాటాల మధ్య ఉండే జీవితం నాటకమని కవి హిత బోధ.

కోక అనేది ఆత్మీయమైన తెలుగు పదం. "ఆలి కొన్నది కోక / అంతరిక్షపు నౌక / అంతకన్నను చౌక / ఓ కూనలమ్మ", 'అమ్మకి కూడు పెట్టని వాడు పెద్దమ్మకి కోక పెడతానన్నడట' అల్లా ఎన్నో భావాలు కోకని చుట్టుకొన్నాయి. ఇలాంటి పదాలను ప్రయోగించే కవి మనసును చుట్టుకొంటాడు.

ప్రారబ్ధం (ఈ జన్మ పూర్తయ్యేంత వరకు అనుభవించడానికి విధి నియమించిన కర్మ) సంచితం ( పూర్వ జనలో సంపాదించిన పుణ్య పాపాలతో కూడిన కర్మ) లను ఉభయ కర్మలుగా ఇక్కడ మనం గ్రహించాలి. ఎందుకంటే ఉభయకర్మలు ఒడిగట్టుకొన్నవని కవి వాక్కు. మనకు ఇస్టమున్నా, లేకపోయినా ఈ రెండు కర్మలను భరించడానికి సిద్ధపడాలి. ఈ రెండింటిని స్వామి అనుగ్రహంతో సమాప్తం చేసుకొన్నప్పుడే మోక్షమని కవి బోధ.

దేని వల్ల జనం తనై తాము రక్షిచుకొంటారో దాన్ని పాపమంటారు. శుభాన్ని చేసేది పుణ్యం. ఏది పాపం ? ఏది పుణ్యమనేది నిర్ణయించడం చాలా కష్టం. ఒకసారి భగవాన్ రమణమహర్షి దగ్గరకు ఒకాయన వచ్చి "నేను పాపిని" అని ఏడ్చాడట. స్వామి నవ్వుతూ , "నిద్రలో నువ్వు పుణ్యుడివా, పాపివా?" చెప్పమన్నారు. ఆ వ్యక్తి నాకు తెలియదన్నాడు. "ఇప్పుడు మాత్రం నీకు ఏమి తెలుసు ? నువ్వెవడివి చెప్పడానికి ?" అన్నారట. తెగని పాపాన్ని, పుణ్యాన్ని గురించి చెప్పడానికి మనకున్న జ్ఞానం చాలదు. అజ్ఞానం చాలదు.

అందుకే కాలపురుషుడు మనని చూసి నవ్వుకొంటుంటాడని, ఇది నాటకమని అన్నమాచార్యుని బోధ. ఈ సంసార నాటకమంతా నవ్వుల పాలు కావడానికని 'నాటకమంతా నవ్వులకే' అనే ఇంకో కీర్తనలో అన్నమయ్య మనల్ని హెచ్చరించాడు. ప్రతిదీ నాటకమే. నాటక సూత్రధారి వేంకటేశుడు. సూత్రధారి చెప్పినట్ట్లు చేస్తే ఆయనని నమ్ముకొంటే, ఈ ప్రపంచ నాటకంలో పుణ్య పాపాలకు అతీతంగా బతకగలం. అందుకే స్వామి ఏలిక అంటూ అన్నమయ్య బోధ.

'As you like it' నాటకంలో షేక్ స్పియర్ (1564-1616) "ప్రపంచం ఒక నాటక రంగస్థలం' అని చెప్పక మునుపే అన్నమయ్య (1408 - 1503) "ఈ ప్రపంచం లోని బతుకు ఒక నాటకం" అన్నాడు. యోగశాస్త్రంలో పదహారు రేకులు గల చక్కని శూన్యం గల కమలాన్ని ఆకాశచక్రం అంటారు. సాధకుడు యోగంలో దానిని దాటితే మోక్షం. "గగనము మీదిది కైవల్యము" అంటూ "నువ్వు ఆ యోగసాధనలు చెయలేవు. స్వామిని శరణు వేడురా ! మోక్షం ఎంత గగనమైనా నీలు సులభమవుతుందని" కవి ఉపదేశం. ఈ కీర్తన లో అన్నమయ్య వేదాంతం మమకార మాలిన్యాన్ని కడిగివేసే గంగోత్రి వంటిది.

- డా|| తాడేపల్లి పతంజలి (అన్నమయ్య అన్నమాట), సాక్షి, జనవరి 10, 2010.naanaaTi baduku naaTakamu
kaanaka kannadi kaivalyamu

puTTuTayu nijamu poavuTayu nijamu
naTTanaDimi pani naaTakamu
yeTTaneduTa galadee pramanchamunu
kaTTagaDapaTidi kaivalyamu

kuDicheadannamu koaka chuTTeDidi
naDu mantrapu pani naaTakamu
voDi gaTTukonina vubhaya karmamulu
gaDi daaTinapuDea kaivalyamu

tegadu paapamunu teeradu puNyamu
nagi nagi kaalamu naaTakamu
yuguvane Sree veankaTeaSvaruDealika
gaganamu meedidi kaivalyamu


naanaaTi = roaju roajuku
naDu mantaramu = madhya kaalamuna kaliginadi
pani = jeevitamu
oDikaTTu = bharimpaTaaniki siddhapaDina
ubhayakarmamulu = sanchita praarabdaalu
kaivalyamu = moakshamu
eguvane = ettaina pradeaSamuloa

bhoutika prapanchamulao mana jeevitam naaTakamu, asatyamani vivaristoo SaaSvatamaina moakshaanni saadhinchaalani annamayya ee keertana loa boadhistunnaaDu. roajo roajoo saagea ee jeevitam naaTakam. aspashTamgaa kanipincheadi entoa puNyam cheasukonTeanea dakkeadi moaksham. puTTuTa nijam. chanipoavuTa nijam. aa renDinTi madhya gala jeevitam naaTakam. kaLLaku kanipistoo edurugaa unna prapancham bhrama. baagaa dooramgaa vunDi, vaastavamainadi moaksham. tineadi annam. chuTTukoneadi baTTa. aa renDint ipoaraaTaala madhyagala jeevitam naaTakam. ee jeevini anTipeTTukoni unDeavi sanchita praarabdaalu. vaaTi sarihaddulu daatinappuDea moaksham. paapam samaaptam kaadu. puNyam labhinchadu. ee renDinTini aacharinchea manalni choosi navvea kaalam naaTakam.

గోవిందా శ్రిత గోకుల బృందాగోవిందా శ్రిత గోకుల బృందా
పావన జయ జయ పరమానందా

జగదభిరామా సహస్ర నామా
సుగుణ ధామ సంస్తుత నామా
గగన శ్యామా ఘనరిపు భీమా
అగణిత రఘు వంశాంబుధి సోమా

జననుత చరణా శరణ్య శరణా
దనుజ హరణ లలిత స్ఫురణా
అనఘా చరణాయుత భూభరణా
దినకర సన్నిభ దివ్యాభరణా

గరుడతురంగా కారోత్తుంగా
శారధి భంగ ఫణి శయనాంగా
కరుణాపాంగా కమలాసంగా
వర శ్రీ వేంకటగిరిపతి రంగా


గోవిందా = భూమిని, గోవును, స్వర్గాన్నీ, వేదాన్ని పొందినవాడా
శ్రిత = ఆశ్రయించిన
గోకుల బృంద = ఆవుల గుంపు కలిగిన వాడా
పావన = పవిత్రమైన వాడా
జయ = సర్వులను జయించి వశపరచుకొనెడివాడా
జయ జయ = గెలువుము, గెలువుము
పరమానంద = ఎక్కువైన ఆనందమే స్వరూపముగా కలిగినవాడా
జగదభిరామా = ప్రపంచములో ప్రియమైనవాడా !
సహస్ర నామా = వేయి పేర్లు కలిగిన వాడా !
సంస్తుత నామా= పొగడ దగిన పేర్లు కలిగిన వాడా
గగన శ్యామా = ఆకుపచ్చ, నలుపూ కలిసిన ఆకాశపు రంగు కలవాడా
ఘనరిపు భీమా = ఘనులయిన శత్రువులకు భయంకరమైన వాడా !
అగణిత = లెక్కించడానికి వీలు లేని
రఘువంశాంబుధి సోమా = గొప్పదయిన రఘువంశ సముద్రమునకు చంద్రుడా !
జననుత చరణా = జనుల చేత పొగడదగిన పాదాలు కలవాడా
శరణ్య శరణా = రక్షకులకు రక్షణ ఇచ్చువాడా !
దనుజ హరణా = రాక్షసులను సంహరించువాడా
లలిత స్ఫురణా = అందంగా ప్రకాశించువాడా !
అనఘా = పాపము లేని వాడా !
చరణాయుత = చరణముల చేత విస్తృతమైన
భూభరణా = భూమిని ధరించినవాడా
దినకర సన్నిభ = సూర్యునితో సమానమైన వాడా !
దివ్యాభరణా = దివ్యమైన ఆభరణాలు కలిగినవాడా !
గరుడతురంగా = గరుత్మంతుడు వాహనముగా కలిగినవాడా
ఆకారోత్తుంగా = విశ్వరూపము కలిగిన వాడా !
శరధి భంగ = సముద్ర గర్వమును పోగొట్టిన వాడా
ఫణి శయనగాంగా = ఆదిశేషుడు పానుపుగా కలిగినవాడా !
కరుణాపాంగా = దయ నిండిన కడకన్ను కలవాడా !
కమలాసంగా = లక్ష్మీదేవి యందు అనురాగము కలిగిన వాడా !
వర = శ్రేష్ఠుడైన
శ్రీ వేంకట గిరి పతి రంగా = శ్రీ వేంకటాచల ప్రభూ !అన్నమాచార్యుల వారి రెండో భార్య అక్కలమ్మ. ఆమెకు పుట్టిన వారు పెద తిరుమలాచార్యుల వారు. ఈయన కూడా తండ్రి లాగా రోజుకో కీర్తన వేంకటేశ్వరునికి అంకితం చేస్తూ రాశారు. వారు రాసిన ప్రసిద్ధమైన సంస్కృత కీర్తన ఇది. గోవర్ధన గిరిని ఎత్తి గోవులను రక్షించడం చేత గోవిందుడయ్యాడని భారతం చెప్పింది. గోవర్ధనోద్ధరణ సందర్భంలో సురభి పాలతో శ్రీకృష్ణుని అభిషేకించి ఆయనకు గోవిందుడని నామకరణము చేసినట్లు భాగవతంలో వుంది. వరాహావతారంలో రసాతలంలో ఉన్న భూమిని తన కోరలతో పైకి ఉద్ధరించాడు కనుక విష్ణువును గోవిందుడన్నారు. నమ్ముకొన్న భక్తులను నేటి కలి యుగంలో ఆయన ఉద్ధరిస్తాడని మనసారా నమ్ముతూ గోవింద ! గోవింద అని కోట్లాది భక్తులు నోరారా పిలుస్తుంటారు. తనకు సంబంధించిన గోపాలక మిత్రులను, గోగణాలను రక్షించడానికి ఏడు రోజులపాటు శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని చిటికెన వేలి మీద ఎత్తాడు. వారికోసం ఎందరో రాక్షసులను సంహరించాడు. దీనినే పెద తిరుమలాచార్యులు 'శ్రిత గోకుల బృందా !' అన్నాడు.

ఈ కీర్తన లో కవి ప్రయోగించిన 'జగదభిరామ' ప్రయోగం ఎంతో పేరు పొందింది. ఆధునిక చల చిత్ర యుగంలో ఈ ప్రయోగంతో మొదలయ్యే పాట విశేషమైన ఆదరణ పొందిన విషయం అందరికీ తెలిసిందే ! 'అభిరామ' అనే పేరుతో తమిళనాడులో మీనాక్షీ దేవికి పూజలు జరుగుతున్నాయి. స్ఫురణ అంటే మనస్సు మీద మెరుపు అన్నారు రమణ మహర్షి. కాంతి, శబ్ధం రెండింటిని ఈ శబ్దం సూచిస్తుందని వారి మాట. ఇంతటి విశేషార్ధం కల స్ఫురణ సబ్దాన్ని లలితంగా కవి ప్రయోగించాడు. పెద తిరుమలాచార్యులు 'గరుడ తురంగము' అంటే' జగదానంద కారక' అను ప్రసిద్ధమైన కీర్తనలో త్యాగరాజస్వామి 'ఖగతురంగ' అన్నారు. రెండు చోట్లా తురంగ మంటే వాహనమని అర్ధం. పదే పదే స్వామి నామస్మరణ చేస్తే తరిస్తాం. ఈ కీర్తనలో ఉద్ద్యేశ్యం అదే. 'జయలిడగా' అని తండ్రి అన్నమయ్య పలికిన రీతిలో స్వామికి 'జయ జయ' అన్న పెద తిరుమలయ్యను కూడా సాహితీ పరులు 'జయము జయము' అని కొనియాడతారు. స్వస్తి.

- డా||తాడేపల్లి పతంజలి (అన్నమయ్య అన్నమాట) సాక్షి, జనవరి 31, 2010.
goavindaa Srita goakula bRndaa
paavana jaya jaya paramaanandaa

jagadabhiraamaa sahasra naamaa
suguNa dhaama sanstuta naamaa
gagana Syaamaa ghanaripu bheemaa
agaNita raghu vamSaambuDhi soamaa

jananuta charaNaa SraNya SaraNaa
danuja haraNa lalita sphuraNaa
anaghaa charaNaayuta bhoobharaNaa
dinakara sannibha divyaabharaNaa

garuDaturangaa kaaroattungaa
Sardhi bhanga faNi Sayanaangaa
karuNaapaangaa kamalaasangaa
vara Sree veankaTagiripati rangaa

goavindaa = bhoomini, goavunu, svargaannee, veadaanni pondinavaaDaa
Srita = aaSrayinchina
goakula bRnda = aavula gumpu kaligina vaaDaa
paavana = pavitramaina vaaDaa
jaya = sarvulanu jayinchi vaSaparachukoneDivaaDaa
jaya jaya = geluvumu, geluvumu
paramaananda = ekkuvaina aanandamea svaroopamugaa kaliginavaaDaa
jagadabhiraamaa = prapanchamuloa priyamainavaaDaa !
sahasra naamaa = veayi pearlu kaligina vaaDaa !
samstuta naamaa = ppgaDadagina pearlu kaligina vaaDaa
gagana Syaamaa = aakupaccha, nalupoo kalisina aaakaaSapu rangu kalavaaDaa
ghanaripu bheemaa = ghanulayina Satruvulaku bhayamkaramaina vaaDaa !
agaNita = lekkinchaDaaniki veelu leani
raghuvamSaambudhi soamaa = goppadayina raghuvamSa samudramunaku chandruDaa !
jananuta charaNaa = janula cheata pogaDadagina paadaalu kalavaaDaa
SaraNya SaraNaa = rakshakulaku rakshaNa icchuvaaDaa !
danuja haraNaa = raakshasulanu samharinchuvaaDaa
lalita sphuraNaa = andamgaa prakaaSinchuvaaDaa !
anaghaa = paapamu leani vaaDaa !
charaNaayuta = charaNamula cheata vistrutamaina
bhoobharaNaa = bhoomini dharinchinavaaDaa
dinakara sannibha = sooryunitoa samaana manyina vaaDaa !
divyaabharaNaa = divyamaina aabharaNaalu kaliginavaaDaa !
garuDaturangaa = garutmantuDu vaahanamugaa kaliginavaaDaa
aakaaroattungaa = viSvaroopamu kaligina vaaDaa !
Saradhi bhanga = samudra garvamunu poagoTTina vaaDaa
phaNi Sayanagaangaa = aadiSeashuDu paanupugaa kaliginavaaDaa !
karuNaapaangaa = daya ninDina kaDakannu kalavaaDaa !
kamalaasangaa = lakshmeedeavi yandu anuraagamu kaligina vaaDaa !
vara = SreashThuDaina
Sree veankaTa giri pati rangaa = Sree veankaTaachala prabhoo !

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger