నానాటి బదుకు నాటకము
కానక కన్నది కైవల్యము
పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాటకము
యెట్టనెదుట గలదీ ప్రమంచమును
కట్టగడపటిది కైవల్యము
కుడిచేదన్నము కోక చుట్టెడిది
నడు మంత్రపు పని నాటకము
వొడి గట్టుకొనిన వుభయ కర్మములు
గడి దాటినపుడే కైవల్యము
తెగదు పాపమును తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
యుగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము
నానాటి = రోజు రోజుకు
నడు మంతరము = మధ్య కాలమున కలిగినది
పని = జీవితము
ఒడికట్టు = భరింపటానికి సిద్ధపడిన
ఉభయకర్మములు = సంచిత ప్రారబ్దాలు
కైవల్యము = మోక్షము
ఎగువనె = ఎత్తైన ప్రదేశములో
భౌతిక ప్రపంచములో మన జీవితం నాటకము, అసత్యమని వివరిస్తూ శాశ్వతమైన మోక్షాన్ని సాధించాలని అన్నమయ్య ఈ కీర్తన లో బోధిస్తున్నాడు. రోజొ రోజూ సాగే ఈ జీవితం నాటకం. అస్పష్టంగా కనిపించేది ఎంతో పుణ్యం చేసుకొంటేనే దక్కేది మోక్షం. పుట్టుట నిజం. చనిపోవుట నిజం. ఆ రెండింటి మధ్య గల జీవితం నాటకం. కళ్ళకు కనిపిస్తూ ఎదురుగా ఉన్న ప్రపంచం భ్రమ. బాగా దూరంగా వుండి, వాస్తవమైనది మోక్షం. తినేది అన్నం. చుట్టుకొనేది బట్ట. ఆ రెండింటి పోరాటాల మధ్యగల జీవితం నాటకం. ఈ జీవిని అంటిపెట్టుకొని ఉండేవి సంచిత ప్రారబ్దాలు. వాటి సరిహద్దులు దాటినప్పుడే మోక్షం. పాపం సమాప్తం కాదు. పుణ్యం లభించదు. ఈ రెండింటిని ఆచరించే మనల్ని చూసి నవ్వే కాలం నాటకం. ఎత్తైన కొండల మీద ఉన్న శ్రీ వేంకటేశ్వరుడే మనకు ప్రభువు. ఆకాశాన్ని దాటిపోతే మోక్షం.
కష్టపడి సంపాదించిన సొమ్ములు భూమి మీద ఉండిపోతాయి. పశువులు వాటికి సంబంధించిన శాలల్లో ఉండిపోతాయి. భార్య గుమ్మం దగ్గరే ఉంటుంది. బంధు జనులు శ్మశానం వరకు వస్తారు. మురిపెంగా పెంచ్జుకొన్న శరీరం చితిలో కాలిపోతుంది. కర్మను అనుసరించి జీవుడొక్కడే ఈ లోకాన్ని విడిచి వెళతాడు. అతని వెంట ఎవరూ రారు. అందుకే అన్నమయ్య 'నానాటి బదుకు నాటకమూ అన్నాడు.
ప్రపంచమేంటే విస్తరించబడినది అని అర్ధం. మన శరీరంలో ఉన్న పంచ భూతాలే (భూమి, నీరు అగ్ని గాలి, ఆకాశం) మన ఎదుటగా ఉన్నాయని అదే ప్ర 'పంచ' మని అన్నమయ్య నిర్వచిస్తున్నాడు. కొంతమంది అన్నం తింటుంటే కొంతమందిని ఆశ తింటుంటుంది. అన్న వస్త్రాల కోసం (జీవితావసరాల కోసం) చేసే పోరాటాల మధ్య ఉండే జీవితం నాటకమని కవి హిత బోధ.
కోక అనేది ఆత్మీయమైన తెలుగు పదం. "ఆలి కొన్నది కోక / అంతరిక్షపు నౌక / అంతకన్నను చౌక / ఓ కూనలమ్మ", 'అమ్మకి కూడు పెట్టని వాడు పెద్దమ్మకి కోక పెడతానన్నడట' అల్లా ఎన్నో భావాలు కోకని చుట్టుకొన్నాయి. ఇలాంటి పదాలను ప్రయోగించే కవి మనసును చుట్టుకొంటాడు.
ప్రారబ్ధం (ఈ జన్మ పూర్తయ్యేంత వరకు అనుభవించడానికి విధి నియమించిన కర్మ) సంచితం ( పూర్వ జనలో సంపాదించిన పుణ్య పాపాలతో కూడిన కర్మ) లను ఉభయ కర్మలుగా ఇక్కడ మనం గ్రహించాలి. ఎందుకంటే ఉభయకర్మలు ఒడిగట్టుకొన్నవని కవి వాక్కు. మనకు ఇస్టమున్నా, లేకపోయినా ఈ రెండు కర్మలను భరించడానికి సిద్ధపడాలి. ఈ రెండింటిని స్వామి అనుగ్రహంతో సమాప్తం చేసుకొన్నప్పుడే మోక్షమని కవి బోధ.
దేని వల్ల జనం తనై తాము రక్షిచుకొంటారో దాన్ని పాపమంటారు. శుభాన్ని చేసేది పుణ్యం. ఏది పాపం ? ఏది పుణ్యమనేది నిర్ణయించడం చాలా కష్టం. ఒకసారి భగవాన్ రమణమహర్షి దగ్గరకు ఒకాయన వచ్చి "నేను పాపిని" అని ఏడ్చాడట. స్వామి నవ్వుతూ , "నిద్రలో నువ్వు పుణ్యుడివా, పాపివా?" చెప్పమన్నారు. ఆ వ్యక్తి నాకు తెలియదన్నాడు. "ఇప్పుడు మాత్రం నీకు ఏమి తెలుసు ? నువ్వెవడివి చెప్పడానికి ?" అన్నారట. తెగని పాపాన్ని, పుణ్యాన్ని గురించి చెప్పడానికి మనకున్న జ్ఞానం చాలదు. అజ్ఞానం చాలదు.
అందుకే కాలపురుషుడు మనని చూసి నవ్వుకొంటుంటాడని, ఇది నాటకమని అన్నమాచార్యుని బోధ. ఈ సంసార నాటకమంతా నవ్వుల పాలు కావడానికని 'నాటకమంతా నవ్వులకే' అనే ఇంకో కీర్తనలో అన్నమయ్య మనల్ని హెచ్చరించాడు. ప్రతిదీ నాటకమే. నాటక సూత్రధారి వేంకటేశుడు. సూత్రధారి చెప్పినట్ట్లు చేస్తే ఆయనని నమ్ముకొంటే, ఈ ప్రపంచ నాటకంలో పుణ్య పాపాలకు అతీతంగా బతకగలం. అందుకే స్వామి ఏలిక అంటూ అన్నమయ్య బోధ.
'As you like it' నాటకంలో షేక్ స్పియర్ (1564-1616) "ప్రపంచం ఒక నాటక రంగస్థలం' అని చెప్పక మునుపే అన్నమయ్య (1408 - 1503) "ఈ ప్రపంచం లోని బతుకు ఒక నాటకం" అన్నాడు. యోగశాస్త్రంలో పదహారు రేకులు గల చక్కని శూన్యం గల కమలాన్ని ఆకాశచక్రం అంటారు. సాధకుడు యోగంలో దానిని దాటితే మోక్షం. "గగనము మీదిది కైవల్యము" అంటూ "నువ్వు ఆ యోగసాధనలు చెయలేవు. స్వామిని శరణు వేడురా ! మోక్షం ఎంత గగనమైనా నీలు సులభమవుతుందని" కవి ఉపదేశం. ఈ కీర్తన లో అన్నమయ్య వేదాంతం మమకార మాలిన్యాన్ని కడిగివేసే గంగోత్రి వంటిది.
- డా|| తాడేపల్లి పతంజలి (అన్నమయ్య అన్నమాట), సాక్షి, జనవరి 10, 2010.
naanaaTi baduku naaTakamu
kaanaka kannadi kaivalyamu
puTTuTayu nijamu poavuTayu nijamu
naTTanaDimi pani naaTakamu
yeTTaneduTa galadee pramanchamunu
kaTTagaDapaTidi kaivalyamu
kuDicheadannamu koaka chuTTeDidi
naDu mantrapu pani naaTakamu
voDi gaTTukonina vubhaya karmamulu
gaDi daaTinapuDea kaivalyamu
tegadu paapamunu teeradu puNyamu
nagi nagi kaalamu naaTakamu
yuguvane Sree veankaTeaSvaruDealika
gaganamu meedidi kaivalyamu
naanaaTi = roaju roajuku
naDu mantaramu = madhya kaalamuna kaliginadi
pani = jeevitamu
oDikaTTu = bharimpaTaaniki siddhapaDina
ubhayakarmamulu = sanchita praarabdaalu
kaivalyamu = moakshamu
eguvane = ettaina pradeaSamuloa
bhoutika prapanchamulao mana jeevitam naaTakamu, asatyamani vivaristoo SaaSvatamaina moakshaanni saadhinchaalani annamayya ee keertana loa boadhistunnaaDu. roajo roajoo saagea ee jeevitam naaTakam. aspashTamgaa kanipincheadi entoa puNyam cheasukonTeanea dakkeadi moaksham. puTTuTa nijam. chanipoavuTa nijam. aa renDinTi madhya gala jeevitam naaTakam. kaLLaku kanipistoo edurugaa unna prapancham bhrama. baagaa dooramgaa vunDi, vaastavamainadi moaksham. tineadi annam. chuTTukoneadi baTTa. aa renDint ipoaraaTaala madhyagala jeevitam naaTakam. ee jeevini anTipeTTukoni unDeavi sanchita praarabdaalu. vaaTi sarihaddulu daatinappuDea moaksham. paapam samaaptam kaadu. puNyam labhinchadu. ee renDinTini aacharinchea manalni choosi navvea kaalam naaTakam.
920. okati sugnanamu - ఒకటి సుజ్ఞానము
-
tuned and sung by Sri Sathiraju Venumadhav in raga rajani
archive link
ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము
ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు ॥పల్లవి॥
తనుఁ ద...
4 months ago
0 comments:
Post a Comment