చిన్ని శిశువూ, చిన్ని శిశువూ
యెన్నడూ జూడమ్మ యిటువంటి శిశువూ
తోయపుపుంగురులతోడ దూగేటి శిశసు, చింత
కాయలవంటి జడలగములతోడ
మ్రోయుచున్న కనకంపు మువ్వల పాదాల తోడ
పాయక యశోదవెంట బారాడు శిశువూ
ముద్దుల వ్రేళ్ళతోడ మెరవంక యుంగరాల
నిద్దపుంజేతుల పైడి బొద్దుల తోడ
అద్దపుంజెక్కులతోడ నప్పలప్ప లనినంత
గద్దించి యశోదమేను కౌగిలించు శిశువూ
బలుపైన పొట్టమీది పాలచాఱలతోడ
నులెవడి వెన్న దిన్న నోరి తోడ
చెలగి నేడిదె వచ్చి శ్రీవేంకటాద్రిపై
నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువూ
chinni SiSuvoo, chinni SiSuvoo
yennaDoo jooDamma yiTuvanTi SiSuvoo
toayapupungurulatoaDa doogeaTi SiSasu, chinta
kaayalavanTi jaDalagamulatoaDa
mroayuchunna kanakampu muvvala paadaala toaDa
paayaka yaSoadavenTa baaraaDu SiSuvoo
muddula vreaLLatoaDa meravanka yungaraala
niddapunjeatula paiDi boddula toaDa
addapuMjekkulatoaDa nappalappa laninanta
gaddinchi yaSoadameanu kougilinchu SiSuvoo
balupaina poTTameedi paalachaa~ralatoaDa
nulevaDi venna dinna noari toaDa
chelagi neaDide vacchi SreeveankaTaadripai
nilichi loakamulella nilipina SiSuvoo
920. okati sugnanamu - ఒకటి సుజ్ఞానము
-
tuned and sung by Sri Sathiraju Venumadhav in raga rajani
archive link
ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము
ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు ॥పల్లవి॥
తనుఁ ద...
6 months ago
2 comments:
chakkaga undandi, mee sisivvu.
సుజాత గారు.. చక్కని కీర్తన...
నాకూ అన్నమాచార్య కీర్తనలు అంటే ప్రాణం..
ఆ కృష్ణయ్య ఫోటోలతో ఈ కీర్తనకు నేను చేసిన వీడియో..
http://www.youtube.com/watch?v=xlPt--ll_lY&feature=plcp
Post a Comment