గోవిందా శ్రిత గోకుల బృందా
పావన జయ జయ పరమానందా
జగదభిరామా సహస్ర నామా
సుగుణ ధామ సంస్తుత నామా
గగన శ్యామా ఘనరిపు భీమా
అగణిత రఘు వంశాంబుధి సోమా
జననుత చరణా శరణ్య శరణా
దనుజ హరణ లలిత స్ఫురణా
అనఘా చరణాయుత భూభరణా
దినకర సన్నిభ దివ్యాభరణా
గరుడతురంగా కారోత్తుంగా
శారధి భంగ ఫణి శయనాంగా
కరుణాపాంగా కమలాసంగా
వర శ్రీ వేంకటగిరిపతి రంగా
గోవిందా = భూమిని, గోవును, స్వర్గాన్నీ, వేదాన్ని పొందినవాడా
శ్రిత = ఆశ్రయించిన
గోకుల బృంద = ఆవుల గుంపు కలిగిన వాడా
పావన = పవిత్రమైన వాడా
జయ = సర్వులను జయించి వశపరచుకొనెడివాడా
జయ జయ = గెలువుము, గెలువుము
పరమానంద = ఎక్కువైన ఆనందమే స్వరూపముగా కలిగినవాడా
జగదభిరామా = ప్రపంచములో ప్రియమైనవాడా !
సహస్ర నామా = వేయి పేర్లు కలిగిన వాడా !
సంస్తుత నామా= పొగడ దగిన పేర్లు కలిగిన వాడా
గగన శ్యామా = ఆకుపచ్చ, నలుపూ కలిసిన ఆకాశపు రంగు కలవాడా
ఘనరిపు భీమా = ఘనులయిన శత్రువులకు భయంకరమైన వాడా !
అగణిత = లెక్కించడానికి వీలు లేని
రఘువంశాంబుధి సోమా = గొప్పదయిన రఘువంశ సముద్రమునకు చంద్రుడా !
జననుత చరణా = జనుల చేత పొగడదగిన పాదాలు కలవాడా
శరణ్య శరణా = రక్షకులకు రక్షణ ఇచ్చువాడా !
దనుజ హరణా = రాక్షసులను సంహరించువాడా
లలిత స్ఫురణా = అందంగా ప్రకాశించువాడా !
అనఘా = పాపము లేని వాడా !
చరణాయుత = చరణముల చేత విస్తృతమైన
భూభరణా = భూమిని ధరించినవాడా
దినకర సన్నిభ = సూర్యునితో సమానమైన వాడా !
దివ్యాభరణా = దివ్యమైన ఆభరణాలు కలిగినవాడా !
గరుడతురంగా = గరుత్మంతుడు వాహనముగా కలిగినవాడా
ఆకారోత్తుంగా = విశ్వరూపము కలిగిన వాడా !
శరధి భంగ = సముద్ర గర్వమును పోగొట్టిన వాడా
ఫణి శయనగాంగా = ఆదిశేషుడు పానుపుగా కలిగినవాడా !
కరుణాపాంగా = దయ నిండిన కడకన్ను కలవాడా !
కమలాసంగా = లక్ష్మీదేవి యందు అనురాగము కలిగిన వాడా !
వర = శ్రేష్ఠుడైన
శ్రీ వేంకట గిరి పతి రంగా = శ్రీ వేంకటాచల ప్రభూ !
అన్నమాచార్యుల వారి రెండో భార్య అక్కలమ్మ. ఆమెకు పుట్టిన వారు పెద తిరుమలాచార్యుల వారు. ఈయన కూడా తండ్రి లాగా రోజుకో కీర్తన వేంకటేశ్వరునికి అంకితం చేస్తూ రాశారు. వారు రాసిన ప్రసిద్ధమైన సంస్కృత కీర్తన ఇది. గోవర్ధన గిరిని ఎత్తి గోవులను రక్షించడం చేత గోవిందుడయ్యాడని భారతం చెప్పింది. గోవర్ధనోద్ధరణ సందర్భంలో సురభి పాలతో శ్రీకృష్ణుని అభిషేకించి ఆయనకు గోవిందుడని నామకరణము చేసినట్లు భాగవతంలో వుంది. వరాహావతారంలో రసాతలంలో ఉన్న భూమిని తన కోరలతో పైకి ఉద్ధరించాడు కనుక విష్ణువును గోవిందుడన్నారు. నమ్ముకొన్న భక్తులను నేటి కలి యుగంలో ఆయన ఉద్ధరిస్తాడని మనసారా నమ్ముతూ గోవింద ! గోవింద అని కోట్లాది భక్తులు నోరారా పిలుస్తుంటారు. తనకు సంబంధించిన గోపాలక మిత్రులను, గోగణాలను రక్షించడానికి ఏడు రోజులపాటు శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని చిటికెన వేలి మీద ఎత్తాడు. వారికోసం ఎందరో రాక్షసులను సంహరించాడు. దీనినే పెద తిరుమలాచార్యులు 'శ్రిత గోకుల బృందా !' అన్నాడు.
ఈ కీర్తన లో కవి ప్రయోగించిన 'జగదభిరామ' ప్రయోగం ఎంతో పేరు పొందింది. ఆధునిక చల చిత్ర యుగంలో ఈ ప్రయోగంతో మొదలయ్యే పాట విశేషమైన ఆదరణ పొందిన విషయం అందరికీ తెలిసిందే ! 'అభిరామ' అనే పేరుతో తమిళనాడులో మీనాక్షీ దేవికి పూజలు జరుగుతున్నాయి. స్ఫురణ అంటే మనస్సు మీద మెరుపు అన్నారు రమణ మహర్షి. కాంతి, శబ్ధం రెండింటిని ఈ శబ్దం సూచిస్తుందని వారి మాట. ఇంతటి విశేషార్ధం కల స్ఫురణ సబ్దాన్ని లలితంగా కవి ప్రయోగించాడు. పెద తిరుమలాచార్యులు 'గరుడ తురంగము' అంటే' జగదానంద కారక' అను ప్రసిద్ధమైన కీర్తనలో త్యాగరాజస్వామి 'ఖగతురంగ' అన్నారు. రెండు చోట్లా తురంగ మంటే వాహనమని అర్ధం. పదే పదే స్వామి నామస్మరణ చేస్తే తరిస్తాం. ఈ కీర్తనలో ఉద్ద్యేశ్యం అదే. 'జయలిడగా' అని తండ్రి అన్నమయ్య పలికిన రీతిలో స్వామికి 'జయ జయ' అన్న పెద తిరుమలయ్యను కూడా సాహితీ పరులు 'జయము జయము' అని కొనియాడతారు. స్వస్తి.
- డా||తాడేపల్లి పతంజలి (అన్నమయ్య అన్నమాట) సాక్షి, జనవరి 31, 2010.
goavindaa Srita goakula bRndaa
paavana jaya jaya paramaanandaa
jagadabhiraamaa sahasra naamaa
suguNa dhaama sanstuta naamaa
gagana Syaamaa ghanaripu bheemaa
agaNita raghu vamSaambuDhi soamaa
jananuta charaNaa SraNya SaraNaa
danuja haraNa lalita sphuraNaa
anaghaa charaNaayuta bhoobharaNaa
dinakara sannibha divyaabharaNaa
garuDaturangaa kaaroattungaa
Sardhi bhanga faNi Sayanaangaa
karuNaapaangaa kamalaasangaa
vara Sree veankaTagiripati rangaa
goavindaa = bhoomini, goavunu, svargaannee, veadaanni pondinavaaDaa
Srita = aaSrayinchina
goakula bRnda = aavula gumpu kaligina vaaDaa
paavana = pavitramaina vaaDaa
jaya = sarvulanu jayinchi vaSaparachukoneDivaaDaa
jaya jaya = geluvumu, geluvumu
paramaananda = ekkuvaina aanandamea svaroopamugaa kaliginavaaDaa
jagadabhiraamaa = prapanchamuloa priyamainavaaDaa !
sahasra naamaa = veayi pearlu kaligina vaaDaa !
samstuta naamaa = ppgaDadagina pearlu kaligina vaaDaa
gagana Syaamaa = aakupaccha, nalupoo kalisina aaakaaSapu rangu kalavaaDaa
ghanaripu bheemaa = ghanulayina Satruvulaku bhayamkaramaina vaaDaa !
agaNita = lekkinchaDaaniki veelu leani
raghuvamSaambudhi soamaa = goppadayina raghuvamSa samudramunaku chandruDaa !
jananuta charaNaa = janula cheata pogaDadagina paadaalu kalavaaDaa
SaraNya SaraNaa = rakshakulaku rakshaNa icchuvaaDaa !
danuja haraNaa = raakshasulanu samharinchuvaaDaa
lalita sphuraNaa = andamgaa prakaaSinchuvaaDaa !
anaghaa = paapamu leani vaaDaa !
charaNaayuta = charaNamula cheata vistrutamaina
bhoobharaNaa = bhoomini dharinchinavaaDaa
dinakara sannibha = sooryunitoa samaana manyina vaaDaa !
divyaabharaNaa = divyamaina aabharaNaalu kaliginavaaDaa !
garuDaturangaa = garutmantuDu vaahanamugaa kaliginavaaDaa
aakaaroattungaa = viSvaroopamu kaligina vaaDaa !
Saradhi bhanga = samudra garvamunu poagoTTina vaaDaa
phaNi Sayanagaangaa = aadiSeashuDu paanupugaa kaliginavaaDaa !
karuNaapaangaa = daya ninDina kaDakannu kalavaaDaa !
kamalaasangaa = lakshmeedeavi yandu anuraagamu kaligina vaaDaa !
vara = SreashThuDaina
Sree veankaTa giri pati rangaa = Sree veankaTaachala prabhoo !
920. okati sugnanamu - ఒకటి సుజ్ఞానము
-
tuned and sung by Sri Sathiraju Venumadhav in raga rajani
archive link
ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము
ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు ॥పల్లవి॥
తనుఁ ద...
4 months ago
2 comments:
So,
Did you discover yourself?
cheers
zilebi.
:D
Not completely.
Cheers.
Post a Comment