Friday 4 April 2008

గణేశ ప్రార్ధన

తొండము నేకదంతమును
దోరపు బొజ్జయు వామహస్తమున్,
మెండుగ మ్రోయు గజ్జెలును
మెల్లని చూపులు మందహాసమున్,
కొండొక గుజ్జు రూపమున
కోరిన విద్యల కెల్ల నొజ్జవై,
యుండెడి పార్వతీ తనయ!
ఓయీ గణాధిప ! నీకు మ్రొక్కెదన్.

తొలుత నవిఘ్నమనుచు
ధూర్జటినందన ! నీకు మ్రొక్కెదన్
ఫలితము సెయుమయ్య నిను
ప్రార్ధన చేసెదనేకదంత! నా
వలపటి చేతిఘంటమున
వాక్కున నెప్పుడు బాయకుమీ
తలపున నిన్ను వేడెదను
దైవ గణాధిప! లోకనాయకా !!

3 comments:

రాఘవ said...

సుజాతగారూ
చొప్పదండుప్రశ్న అనుకోకపోతే నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు ఉత్పలమాలని, చంపకమాలని ఎనిమిది పాదాలలో వ్రాసారెందుకు? యతి బాగా తెలియాలనా?

రానారె said...

నాకైతే వృత్తాలను కూడా ఇలా రాయడమే బాగుందనిపిస్తోంది! ఇలా రాయడం కేవలం సీసపద్యాల్లోనే చూశాను. యతి స్థానానికొచ్చేసరికి పాదాన్ని కింద రాయడం వల్ల పద్యం సులువుగా వున్నట్టు కనిపిస్తోంది. (నాకు వృత్తాలంటే భయంలెండి) :-)

Sujata M said...

రాఘవ గారు, రానారె గారు..

బాబోయ్ ! నాకేమి తెలియదండి. ఈ పద్యం నేను రాయలేదండి. (ఎవరో రాసింది, చిన్నపుడు నేర్చుకున్నదీ అయిన పద్యం ఇది). మా తెలుగు అయ్యోరు ఛందస్సు సరిగా చెప్పలేదు.. నాకు ఏ మాలలూ తెలియదు. పెద్ద పెద్ద లైన్ల లో రాస్తే చదవటానికి సులువు గా ఉండదని, ఇలా చిన్న చిన్న లైన్ల లో రాసేను. నాకు ఇష్టమైన 'ప్రార్ధన' ఇది. బ్లాగు మొదలు పెట్టాను కదా.. అని, మొదటి టపా గా ఈ ప్రార్ధన రాసేను. నన్ను క్షమించండి! ఇందులో తప్పులున్నా వదిలేసేయ్యండి!

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger