తిరుమల గిరి రాయ దేవరాహుత్తరాయ
సురత బిన్నాణరాయ సుగుణకొనేటి రాయ
సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ
సరుస వైభవరాయ సకల వినోదరాయ
వర వసంతములరాయ వనితల విటరాయ
గురుతైన తేగరాయ కొండల కోనేటి రాయ
గొల్లెతల ఉద్ధండరాయ గొపాలక్రిష్నరాయ
చల్లువెద జాణరాయ చల్ల పరిమళరాయ
చెల్లుబడి ధర్మరాయ చెప్పరాని వలరాయ
కొల్లలైన భోగరాయ కొండల కోనేటి రాయ
సామసంగీతరాయ సర్వ మోహనరాయ
ధామ వైకుంఠ రాయ దైత్య విభాళరాయ
కామించి నిన్ను గోరితి కరుణించితివి నన్ను
శ్రీమంతుడ నీకు జయశ్రీ వేంకటరాయ
921. daivamA O daivamA - దైవమా వో దైవమా
-
Youtube Link : Sri Malladi Brothers,
Tune by Sri Malladi Suribabu garu (??)
॥పల్లవి॥ దైవమా వో దైవమా నన్ను దయఁజూడఁ దగదా నే వెఱ్ఱివాఁడనైతే నీవు వెఱ్ఱివా...
1 week ago
0 comments:
Post a Comment