Sunday, 29 June 2008

రామదాసు కీర్తన

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే

నను బ్రోవుమని చెప్పు నారీ శిరోమణి
జనకుని కూతురు జనని జానకమ్మ

ప్రక్కన చేరుక చెక్కిలి నొక్కుచు
చక్కగా మరుకేళి జోక్కియుండు వేళ

లోకాన్తరంగుడు శ్రీకాంత నినుగూడి
ఏకాంతలు ననేక శయ్యనున్న వేళ

అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు
నిద్ర మేల్కొను వేళ నెలతరో బాధించు

0 comments:

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger