శ్రీ రామచంద్ర కృపాళు, భజు , మనహరణ భవ భయదారుణం
నవకంజ లోచన్, కంజముఖ, కరకంజ, పదకంజారుణం
కందర్ప అగణిత అమిత భవి నవనీల నీరద సుందరం,
ఫటసీత మానహు తడిత రుచి శమి నౌమి జనకసుతావరం.
భజు దీనబంధు దినేశ దానవ దైత్య వంశ నికందనం,
రఘునంద ఆనందకంద కోసలచంద దశరథనందనం.
సిరముకుట కుండల తిలక చారు ఉదారు అంగ విభూషణం,
అజానుభుజ శర-చాప-ధర సంగ్రామ-జితఖర దూషణం.
ఇతి వదతి తులసీదాస శంకర శేష-ముని-మన రంజనం,
మమ హృదయకంజ నివాస కురు, కామాదిఖల దల గంజనం.
Sunday, 28 September 2008
తులసీదాస కృత శ్రీ రామ చంద్ర స్తుతిః
Posted by Sujata M at 11:05 1 comments
Labels: భజన్
Monday, 22 September 2008
సాధించెనే ఓ మనసా
పల్లవి : సాధించెనే ఓ మనసా
బోధించెన సన్మార్గ వచనముల
అను పల్లవి: బొంకు జేసి తా బట్టిన పట్టు
1. సమయానికి తగు మాటలాడెనే
దేవకీ వసుదేవుల నేగించినటు
2. రంగేశుడు సద్గంగా జనకుడు
సంగీత సంప్రదాయకుడు
3. గోపీజన మనోరథ మొసంగ లేకనే,
గేలియు జేసేవాడు
4. వనితల సదా సొక్కజేయుచును
మ్రొక్కజేసే పరమాత్ముడదియుగాక,
యశోదతనయుడంచు ముదంబునను
ముద్దుబెట్ట నవ్వుచుండు హరి
5. పరమ భక్తవత్సలుడు,
సుగుణపారావారుండా జన్మమ
నఘుడీ కలిబాధల దీర్చువాడనుచు
నే హృదంబజుమున జూచుచుండగ
6. హరే ! రామచంద్ర రఘుకులేశ మృదు సుభాష
శేషశయన పరనారీ సోదరాజ విరాజ తురగ రాజ
రాజనుత నిరామాయాప ఘన సరసీరుహదళాక్ష
యనుచు వేడుకొన్నను తాబ్రోవకను
7. శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస
నికేతన కనకాంబరధర లసన్మకుట కుండల విరాజిత
హరేయనుచునే పొగడగ త్యాగరాజగేయుడు
మానవేందృడయిన రామచంద్రుడు
8. సద్భక్తులనడతలిట్లనెనే
అమరికనా నాపూజ కొనెనే, అలుగ వద్దనెనే
విముఖులతో జేరబో వెతగల్గిన తాళుకొమ్మనెనే
దశమాది సుఖదాయకుడగు
శ్రీ త్యాగరాజ నుతుడు చెంతరాకనే
Posted by Sujata M at 20:49 1 comments
Labels: శ్రీ త్యాగరాజ పంచరత్న కీర్తనలు
Thursday, 4 September 2008
పలుకు తేనెల తల్లి
పలుకు తేనెల తల్లి పవళించెను ! కలికితనముల విభుని గలసినది గాన
1. నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర పగలైనదాక జెలి పవళించెను
తెగని పరిణతులతో తెల్లవారిన దాక జగదేకపతిమనసు జట్టిగొనెగాన
2. కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగదరుణి బంగారు మేడపై బవళించెను
చెంగలువ కనుగొనల సింగారములు దొలక అంగజ గురునితోడ నలసినదిగాన
3. మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై పరవశంబున దరుణి పవళించెను
తిరువేంకటాచలాధిపుని కౌగిటన్ గలసి ! అరవిరై నును జెమట నంటినది గాన
భావము :
దివ్య శృంగారం అమలినమైనది. అందుకే 'తల్లి ' శయన లీలలను భక్తుడు తడబాటు లేక వర్ణించినాడు. అలమేలుమంగ తాళ్ళపాక వారి ఇంటి ఆడపడుచు. తన చినారి తల్లి - కలిమిలేమ - ఎక్కడ కందిపోవునో అని ఆ 'అపుకు తేనెల తల్లి ' పవ్వళించుటకు సంకీర్తనాచార్యుడు బంగారుమేడ లో శయనమందిరమును సృష్టించి, ముత్యాల పానుపు అమర్చినాడు.
అలమేలు మంగ పగలైనదాక పవ్వళించినది. సఖులు మంగమ్మ శయనమందిరం చేరి, ముసి ముసి నగవులతో గుసగుసలాడినారు.
పలుకుతేనెల తల్లి కలికితనములతో విభుని మెప్పించి, కలసి, పవ్వళించినది.
చెలి పగలైనదాక పవ్వళించినది. ఆమె నిగనిగలాడు మోమున కిరువైపుల వినీలకుంతలములు చెదరినవి. జగదేకపతి మనస్సును తన జవ్వనముచే జన్నెవట్టి కొన్నది. కలిమికాంతకు స్వాధీనము కానిదేమున్నది ? రేయి సరసములు తెల్లవారు వరకు సాగినవి. అందుకే పగలైనప్పటికీ పడక వదలలేదు.
తరుణి బంగారుమేడపై పవ్వళించినది. కొంగు జారినది. చనుగుబ్బల మెరుగులు వ్యాపించినవి. రాత్రి ఆమె శ్రీనివాసునితో కలసి, అలసినది. వాడు 'అంగజగురుడు '. ఇంక చెప్పవలసిన దేమున్నది ? రాత్రంతా ఆమెకు నిదురపోవు అవకాశమెక్కడిది ? ఆమె కనుగొనలు ఎర్రవారినవి. అవి చెంగులువ కనుగొనల తొలకిన సింగారములు.
వనితమురిపాల నటనతో, పారవశ్యముతో ముత్యాలపానుపుపై పవ్వళించినది. ఆమె తారుణ్యలావణ్యములు పరచినట్లున్నవి. వేంకటేశ్వరుని బిగికౌగిలినలుగుటవలన ఆమె మేన చిరుచెమట వ్యాపించినది. సగము విచ్చిన పూవు వలె అలమేలుమంగ పవ్వళించినది.
కలికితనములన్ = నేర్పరితనం చేత
నెఱులు = వెంట్రుకలు
కెలకులను = ఇరుప్రక్కలందు
పరిణతులతో = ముగింపులతో
జట్టిగొనెన్ = వెలకు కొనును
అంగజగురుని తోడ = మన్మధుని తండ్రి అయిన వేంకటేశ్వరునితో
మురిపెము = మురియు భావార్ధమం
మలగు = శయ్య
అరవిరి = సగము విచ్చిన పూవు
కీర్తన వినండి
Posted by Sujata M at 17:27 4 comments
Labels: అన్నమయ్య శృంగార సంకీర్తనలు