శ్లో || సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః
అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః
1. సురేశః = దేవతలకు అధిపతి అయినవాడు
2. శరణం = శరణమయినవాడు
3. శర్మ = సహనము
4. విశ్వరేతాః = విశ్వమునకు శుక్రబీజమయినవాడు
5. అహః = పగలు
6. సంవత్సరః = సంవత్సరము
7. వ్యాళః = సర్పము
9. ప్రత్యయః = విశ్వాశము
10. సర్వదర్శనః = సమస్తమును చూచువాడు
భావము :
పరమాత్మ దేవతలకు అధిపతిగను, శరణ్యముగను, సహనముగను అయి వున్నాడు. విశ్వమునకు, బీజము వంటివాడు. జీవుల పుట్టుకకు కారణమయినవాడు. అట్లే దినము, సంవత్సరము, నర్పము వంటి కాలము తానయి వున్నవాడు. విశ్వాశమునకు మూలము మరియు సమస్తమును దర్శింపజేయువాడు.
920. okati sugnanamu - ఒకటి సుజ్ఞానము
-
tuned and sung by Sri Sathiraju Venumadhav in raga rajani
archive link
ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము
ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు ॥పల్లవి॥
తనుఁ ద...
6 months ago
4 comments:
క్షణం విశ్రాంతి లేకుండా ప్రాణికోటికి తెలియకుండానే వాళ్ళ ప్రాణాలను హరిస్తూ, ఆయుస్సును క్షీణింపచేస్తూ,నిర్లిప్తంగా నిరంతరం ముందుకు నడిచే ’కాలసర్పం’లాంటి’మహావ్యాళుడు’ పరమాత్మ అని అర్థం
వ్యాళః=సర్పము
Post a Comment