బ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః
అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః ||
1. బ్రాజిష్ణుః = దీప్తిమంతుడు
2. భోజనం = భోజనము, ఆహారము
3. భోక్తా = భుజించువాడు
4. సహిష్ణుః = సహనము కలవాడు
5. జగదాదిజః = సృష్టి మొట్టమొదట పుట్టినవాడు
6. అనఘః = పాపము లేనివాడు
7. విజయః = విజయము
8. జేతా = జయించినవాడు
9. విశ్వయోనిః = విశ్వమే పుట్టుక స్థానము కలవాడు
10. పునర్వసుః = కోరినపుడు సంపదలు కలిగించువాడు
భావము :
భగవంతుని దీప్తిమంతునిగను, జీవుల ఆహారము తానేఐనవానిగను, జీవుల ద్వారా ఆహారము స్వీకరించువానిగను, సహనమే తన రూపమయినవానిగను, ప్రపంచమునకు మొట్టమొదట పుట్టినవానిగను, జయించిన వానిగను, విశ్వమునకు పుట్టుక తానే అయినవానిగను, ధ్యానము చేయవలెను.
923. eMtavADavayya nIvu yekkaDekkaDa - ఎంతవాఁడవయ్య నీవు యెక్కడెక్కడ
-
Youtube Link : Sri NC Sridevi
ఎంతవాఁడవయ్య నీవు యెక్కడెక్కడ
పొంత నీ జాణతనాలు పొగడేము నేము
మాటలనే తేనెలూరీ మంతనాన నోరూరీ
యేట వెట్టే నీ మహిమ లెక్కడ
తే...
2 weeks ago
3 comments:
శ్లోకంలో బ్రాజిష్ణు గా సరిచేయండి
Thanks sir.
నాకో సదేహం!!
బ్రాజిష్ణు ర్భోజనం అనేది ఎలా రాయాలి.
బ్రాజిష్ణుర్ భోజనం కదా, లేక బ్రాజిష్ణుర్భోజనం కదా, సంభి వచ్చినప్పుడు కలిపిరాయాలి కదా?
Post a Comment