నీవున్నచోటే వైకుంఠము నెరసులు మరి చొరరాదు
పావనమది చెప్పేది వేదము పాటింపగవలెను ||
దేవుడా నా దేహమె నీకు తిరుమలగిరిపట్టణము
భావింప హృదయకమలమె బంగారపు మేడ
వేవేలు నా విజ్ఞానాదులు వేడుకపరిచారకులు
శ్రీవల్లభా ఇందులో ఇతరచింతలు వెట్టకువే ||
పరమాత్మా నా మనసే బహురత్నంబుల మంచము
గరిమల నా యాత్మే నీకు కడు మెత్తని పరపు
తిరముగ నుజ్ఞానదీపమున్నది దివ్యభోగమె ఆనందము
మరిగితి నీవున్నయెడల నిక మాయల గప్పకువే ||
ననిచిన నా వూరుపులే నీకు నారదాదుల పాటలు
వినయపు నా భక్తియె నీకును వినోదమగు పాత్ర
అనిశము శ్రీవేంకటేశ్వర అలమేల్మంగకు బతివి
ఘనుడవు నన్నేలితి విక కర్మములెంచకువే ||
Audio Link : నీవున్నచోటే వైకుంఠము
Request : సాహిత్యం నాకు చాలా నచ్చింది, కానీ వినడానికి clumsy గా, అంత సొంపుగా అనిపించలేదు. ఇంకేదైనా బాణి లో ఈ పాట ఉంటే తెలియచేయగలరు.
neevunnachOTae vaikuMThamu nerasulu mari choraraadu
paavanamadi cheppaedi vaedamu paaTiMpagavalenu ||
daevuDaa naa daehame neeku tirumalagiripaTTaNamu
bhaaviMpa hRdayakamalame baMgaarapu maeDa
vaevaelu naa vij~naanaadulu vaeDukaparichaarakulu
Sreevallabhaa iMdulO itarachiMtalu veTTakuvae ||
paramaatmaa naa manasae bahuratnaMbula maMchamu
garimala naa yaatmae neeku kaDu mettani parapu
tiramuga nuj~naanadeepamunnadi divyabhOgame aanaMdamu
marigiti neevunnayeDala nika maayala gappakuvae ||
nanichina naa voorupulae neeku naaradaadula paaTalu
vinayapu naa bhaktiye neekunu vinOdamagu paatra
aniSamu SreevaeMkaTaeSvara alamaelmaMgaku bativi
ghanuDavu nannaeliti vika karmamuleMchakuvae ||
921. daivamA O daivamA - దైవమా వో దైవమా
-
Youtube Link : Sri Malladi Brothers,
Tune by Sri Malladi Suribabu garu (??)
॥పల్లవి॥ దైవమా వో దైవమా నన్ను దయఁజూడఁ దగదా నే వెఱ్ఱివాఁడనైతే నీవు వెఱ్ఱివా...
1 week ago
0 comments:
Post a Comment