Saturday 28 December 2013

గణేశ భుజంగ ప్రయాత స్తోత్రం



రణత్ క్షుద్రు ఘంటా నినాదాభిరామం
చలత్తాండ వోద్దండ పత్పద్మతాళం
లసత్తుందిలాంగోపరి వ్యాలహారం
గణాదీశ మీశానసూనుం త మీడే.

చిరుగంటలు గల్లుగల్లని మ్రోయుచుండ పాద పదమ్ములు తాళము వేయగా నృత్యముచేయుచు సర్పహారము తన దొడ్డ శరీరమున మిసమిసలాడుచు వింత గూర్పగా నొప్పు శివుని కుమారుని గణాఢీశుని నుతించెదను.

ధ్వనిధ్వంస వీణాలయోల్లాసి వక్త్రం
స్ఫురచ్చుండ దండోల్లస ద్బీజపూరం
గళద్దర్ప సౌగంధ్య లోలాళిమాలం
గణాధీశ మీశానసూనుంతమీడే

నిరుపమాన వీణాతాళముల కుల్లాసపడు ముద్దుమొగముతో తొండముతో బంతివలె మాదిఫలమునుదాల్చి స్రవించుచున్న మదజల సౌగంధ్యమును మరగిన తుమ్మెదలు బారులు తీరిచి ఝుంకారములు చేయుచుండ నొప్పు శివపుత్రుని గణాఢీశుని వినుతించెను.

ప్రకాశ జ్జపారక్త రత్న ప్రసూన
ప్రవాళ ప్రభాతారుణ జ్యోతి రేకం
ప్రలంబోదరం వక్రతుండైకదంతం
గణాధీశ మీశానసూనుం త మీడే.

ఝారుచున్న యుదరముతో  వక్రతుండముతో,  ఏకదంతముతో రాశిబోసిన మందార పువ్వులో, రత్నములో  పగడములో లేక ఉదయించుచున్న సూర్యుడో అన్నట్లు ఎఋఋఅని జ్యోతీ రూపుడై వెలుంగు నీశాన పుత్తృని గణాధీశుని వినుతించెను.

విచిత్ర స్ఫుర ద్రత్నమాలా కిరీటం
కిరీటోల్లస చ్చంద్రరేఖా విభూషం
విభూషైకభూషం భవధ్వంస హేతుం
గణాధీశ మీశానసూనుం తమీడే

వివిధ  రత్న విచిత్ర కిరణమాలికలతో కిరీటము, కిరీటమౌపై చంద్రరేఖా విభూషణము కలిగి విభూషణములకు విభూషణమై మోక్షప్రదుడైన పరమేశ్వర కుమారుని గణాఢీశుని స్తుతించెదను.

ఉదంచ ద్భుజావల్లరీ దృశ్య మూలో
చ్చల ద్భృఊలతా విభ్రమ భ్రాజ దక్షం
మరత్సుందరీ చామరైః సేవ్యమానం
గణాధీశ మీశానసూనుం త మీడే

నృత్యము చేయుచున్నపుడు పైకెత్తిన కరములందలి పుష్పగుచ్చములతో బాటు చూడదగి చలించుచున్న కను బొమల విలాస దీప్తులకు  దిట్టయై అమరీచామర సేవ కానందించు శివ కుమారుని సేవించెదను.

శ్ఫుర న్నిష్ఠురాలోల పింగాక్షి తారం
కృపా కోమలోదార లీలావతారం
కళాబిందుగం నీయతే యోగి వర్త్యై
ర్నణాధీశ మీశానసూనుం త మీడే

కొంచెము నిష్ఠురములై కదలుచున్న గోరోచనపు వన్నెగల నయన తారకలు వెలుగుచుండు యోగివర్యులు హృదయమున కళా బిందుమధ్యమున నిల్పి కీర్తించుచుండ కరుణాకోమల లీలావతార మూర్తియగు శివకుమారుని గణనాధుని వినుతించెదను.

అ మేకాక్షరం నిర్మలం నిర్వికల్పం
గుణాతీత మానంద మాకార శూన్యం
పరం పార మోంకార మామ్నాయగర్భం
వదంతి ప్రగల్భం పురాణం త మీడే.

గుణాతీతమగుటచే నానందమై, ఆకర శూన్యమగుటచే నిర్వికల్పమై సంసారసాగరమున కవల సమస్తవేదములను గర్భమున దాల్చిన నిర్మల ప్రణవాక్షర మూర్తియై పురాణపురుషుడని చెప్పబడు శివకుమారుని గణనాధుని ప్రశంసించెదను.
చిదానంద సాంద్రాయ శాంతాయ తుభ్యం
నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యం
నమో నంతలీలాయ కైవల్యభాసే
నమో విశ్వబీజ !  ప్రసీ దేశసూనో !

విశ్వమునకు బీజము కర్తయు పితయు హర్తయునగుచు విశ్వమునందలి అనంత లీలలకు ఏకైక శాంత ప్రభాకందమై సత్వజ్ఞానానంద ఘనమూర్తివగు నో శివపుత్త్రా ! నీకు నమశ్శతములు.

ఈమం సుస్తవం ప్రాత రుత్థాయ భక్త్యా
పఠేద్యస్తు మర్త్యో లభే త్సర్వకామాన్
గణేశ ప్రసాదేన సిద్ధ్యంతి వాచో
గణేశే విభౌ దుర్లభం కి ప్రసన్నే ?

ఈ స్తవమును ప్రాతః కాలమున భక్తి తో పఠించిన మనుష్యుడు సర్వకామములను వాజ్వాధుర్యమును కైవసము చేసికొనును.  శ్రీ గణేశ్వరుడే ప్రసన్నుడైనచో సిద్ధింపని ఏముడుండును ?

(శంకర భగవత్పాద కృతం)

0 comments:

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger