కదాచి త్కాళిందీ తట విపిన సంగీతకవరో
ముదా గోపీనారీ వదనకమ లాస్వాద మధుపః
రమా శంభు బ్రహ్మ మరపతి గణే శార్చితపదో
జగన్నాథ స్వామీ నయనపధగామీ భవతుమే
ఒకానొక సమయమున యమునాతీరమున బృందావనములో నృత్యగీత వాద్యముల మహోత్సవములందు నేర్పరియై, గోపికా వదన కమల స్వాదమధుపమైయుండి లక్ష్మీ శివ బ్రహ్మేంద్ర గణనాధాదులచే సేవింపబడిన పాద పద్మములు గల శ్రీ
జగన్నాథస్వామి నా కనులకు ప్రత్యక్షమగునుగాక.
భుజే సవ్యే వేణుంశిరసి శిఖిపించం కటితటే
దుకూలం నేత్రాంతే సహచరకటాక్షం విదధతే
సదా శ్రీమద్బృందావన వసతి లీలా పరిచయో
జగన్నాథ స్వామీ నయనపధగామీ భవతుమే
ఎడమచేత వేణువునొ, కటి ప్రదేశమున దుకూలమును దాల్చి క్రీగంటి చూపుల బరపుచు ఎల్లప్పుడు బృందావనము నందు పరిచితములైన ళీలలను చూపుచు శ్రీ జగన్నాథస్వామి నాకు ప్రత్యక్షమగుగాక.
మహాంభోధే స్తీరే కనకరుచిరే నీల శిఖరే
వసన్ ప్రాసాదాంతః సహజ బభద్రేణ బలినా
సుభద్రా మధ్యస్థః సకలసుర సేవావసరదో
జగన్నాథ స్వామీ నయనపధగామీ భవతుమే
మహాసముద్ర తీరమున కనకరుచిరమగు నీలాద్రి శిఖరమునందలి దివ్య ప్రాసాదమున సుభద్రా బలభద్ర మధ్యభాగమున నివసించుచు సకల దేవతలకు పర్యాయ సేవలొసంగుచున్న శ్రీ జగన్నాథ స్వామి నాకు ప్రత్యక్షమగుగాక.
కృపాపారావారః సజల జలద శ్రేణి రుచిరో
రమావాణీ సోమ స్ఫురదమల పద్మోద్భవముఖైః
సురేంద్రై రారాధ్యః శృతిగణాశిఖా గీతచరితో
జగన్నాథ స్వామీ నయనపధగామీ భవతుమే
కృపాసముధ్రుడనియు సజలజలదనీల శరీరుడనియు రమా వాణీ సోమ బ్రహ్మాది దేవతలచే నారాధ్యుడనియు తన చరిత్రము శ్రుతులచే వినుతింపబడిన శ్రీ జగన్నాథ స్వామి నాకు ప్రత్యక్షమగుగాక.
రధారూఢో గచ్చన్ పధి మిలిత భూదేవపటలైః
స్తుతిప్రాదుర్బావం ప్రతిపద ముపాకర్ణ్య సదయః
దయాసింధుర్భంధుః సకల జగతాం సింధు సుతయా
జగన్నాథ స్వామీ నయనపధగామీ భవతుమే
వేదవేత్తలగు విప్రులు మార్గమునందు కలసి సకల లోక బంధువనియు దయాసముద్రుడనియు స్తుతించుచుండగా దయతో వినుచు లక్షీదేవితో రధారూఢుడై ఊరేగుతున్న శ్రీ జగన్నాథ స్వామి నాకు ప్రత్యక్షమగుగాక.
పరబ్రహ్మపీడః కువలయదళోత్ఫుల్ల నయనో
నివాసీ నీలాద్రొయ్ నిహితచరణౌనంతశిరసి
రసానందో రాధా సరసవపు రాలింగన సుఖో
జగన్నాథ స్వామీ నయనపధగామీ భవతుమే
నీలాచల నివాసియై శేష శిరస్సున పాదముల నుంచి నల్లకలువ రేకులవంటి నేత్రములతో రసానందియై రాధాలింగన సుఖముననుభవించుచు పరబ్రహ్మమూర్తియగు శ్రీ జగన్నాథ స్వామి నాకు ప్రత్యక్షమగుగాక.
న వై ప్రార్ధ్యం రాజ్యం న చ కనకతా భోగ విభవే
న యాచేహం రమ్యాం నిఖిలజనకామ్యాం వవధూం
సదా కాలేకాలే ప్రమధపతినా గీత చరితో
జగన్నాథ స్వామీ నయనపధగామీ భవతుమే
నేను రాజ్యమును గాని ధనకనకములను గాని భోగవైభవములను గాని త్రిభువనసుందరియగు వధువును గాని కోరను. శర్వకాలములయందు నీశ్రరుడేస్వామి చరిత్రములను గానము చేయుచుండునో అట్టి జగన్నాథ స్వామి నా కనుల ముందు సాక్షాత్కరించు గాక.
హరత్వం సంసారం ద్రుతతర మసారం సురపతే !
హరత్వం పాపానాం వితతి మపరాం యాదవపతే !
అహో ! దీనానాధం నిహిత మచలం పాతు మనిశం
జగన్నాథ స్వామీ నయనపధగామీ భవతుమే
ఓ దేవదేవా ! అపారమగు నీ జన్మమరణ ప్రవాహమును శీఘ్రముగా హరింపుము. ఓఅ యాదవనాథా ! నీ పప సమూహమును కూడ హరింపుము. ఏఎ కదలలేని దీనుని అనాధుని రక్షించుటకై శ్రీ జగన్నాథ స్వామి నాకు ప్రత్యక్షమగుగాక.
(శ్రీ శంకర భగవత్పాద కృతం)
kadaachi tkaaLindee taTa vipina sangeetakavaroa
mudaa goapeenaaree vadanakama laasvaada madhupa@h
ramaa Sambhu brahma marapati gaNea Saarchitapadoa
jagannaatha svaamee nayanapadhagaamee bhavatumea
okaanoka samayamuna yamunaateeramuna bRndaavanamuloa nRtyageeta
vaadyamula mahoatsavamulandu nearpariyai, goapikaa vadana kamala
svaadamadhupamaiyunDi lakshmee Siva brahmeandra gaNanaadhaadulachea
seavimpabaDina paada padmamulu gala Sree jagannaathasvaami naa kanulaku
pratyakshamagunugaaka.
bhujea savyea veaNumSirasi Sikhipincham kaTitaTea
dukoolam neatraaMtea sahacharakaTaaksham vidadhatea
sadaa SreemadbRndaavana vasati leelaa parichayoa
jagannaatha svaamee nayanapadhagaamee bhavatumea
eDamacheata veaNuvuno, kaTi pradeaSamuna dukoolamunu daalchi kreeganTi
choopula barapuchu ellappuDu
bRndaavanamu nandu parichitamulaina Leelalanu choopucu Sree jagannaathasvaami
naaku pratyakshamagugaaka.
mahaambhoadhea steerea kanakaruchirea neela Sikharea
vasan praasaadaanta@h sahaja babhadreaNa balinaa
subhadraa madhyastha@h sakalasura seavaavasaradoa
jagannaatha svaamee nayanapadhagaamee bhavatumea
mahaasamudra teeramuna kanakaruchiramagu neelaadri Sikharamunandali
divya praasaadamuna subhadraa balabhadra madhyabhaagamuna nivasincucu sakala
deavatalaku paryaaya seavalosanguchunna Sree jagannaatha svaami naaku
pratyakshamagugaaka.
kRpaapaaraavaara@h sajala jalada SreaNi ruchiroa
ramaavaaNee soama sphuradamala padmoadbhavamukhai@h
sureandrai raaraadhya@h SRtigaNaaSikhaa geetacharitoa
jagannaatha svaamee nayanapadhagaamee bhavatumea
kRpaasamudhruDaniyu sajalajaladaneela SareeruDaniyu ramaa vaaNee soama
brahmaadi deavatalachea naaraadhyuDaniyu tana charitramu Srutulachea
vinutimpabaDina Sree jagannaatha svaami naaku pratyakshamagugaaka.
radhaarooDhoa gacchan padhi milita bhoodeavapaTalai@h
stutipraadurbaavam pratipada mupaakarNya sadaya@h
dayaasindhurbhandhu@h sakala jagataam sindhu sutayaa
jagannaatha svaamee nayanapadhagaamee bhavatumea
veadaveattalagu viprulu maargamunandu kalasi sakala loaka bandhuvaniyu
dayaasamudruDaniyu stutinchuchunDagaa dayatoa vinuchu laksheedeavitoa
radhaarooDhuDai ooreagutunna Sree jagannaatha svaami naaku pratyakshamagugaaka.
parabrahmapeeDa@h kuvalayadaLoatphulla nayanoa
nivaasee neelaadroy nihitacharaNounantaSirasi
rasaanandoa raadhaa sarasavapu raalimgana sukhoa
jagannaatha svaamee nayanapadhagaamee bhavatumea
neelaachala nivaasiyai Seasha Sirassuna paadamula nunchi nallakaluva
reakulavanTi neatramulatoa rasaanandiyai raadhaalingana sukhamunanubhavinchuchu
parabrahmamoortiyagu Sree jagannaatha svaami naaku pratyakshamagugaaka.
Navai praardhyam raajyam na cha kanakataa bhoaga vibhavea
Nayaacheaham ramyaam nikhilajanakaamyaam vavadhoom
Sadaa kaaleakaalea pramadhapatinaaa geeta charitoa
jagannaatha svaamee nayanapadhagaamee bhavatumea
neanu raajyamunu gaani dhanakanakamulanu gaani bhoagavaibhavamulanu
gaani tribhuvanasundariyagu vadhuvunu gaani koaranu. Sarvakaalamulayandu
neeSraruDeasvaami charitramulanu gaanamu cheayuchunDunoa aTTi jagannaatha
svaami naa kanula mundu saakshaatkarinchu gaaka.
haratvam samsaaram drutatara masaaram surapatea !
haratvam paapaanaam vitati maparaam yaadavapatea !
ahoa ! deenaanaadham nihita machalam paatu maniSam
jagannaatha svaamee nayanapadhagaamee bhavatumea
oea deavadeavaa ! apaaramagu nee janmamaraNa pravaahamunu Seeghramugaa
harimpumu. Oa yaadavanaathaa ! nee papa
samoohamunu kooDa harimpumu. Ee kadalaleani deenuni anaadhuni rakshinchuTakai
Sree jagannaatha svaami naaku pratyakshamagugaaka.
(Sree Sankara bhagavatpaada kRtam)
0 comments:
Post a Comment