Friday, 15 August 2014

శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం



నమస్తేస్తు మహామాయే! శ్రీపేఠే సురపూజితే!
శంఖచక్రగదాహస్తే ! మహాలక్ష్మీ ! నమోస్తుతే ||

అమ్మా ! శ్రీపీఠనివాసిని ! మహామాయారూపిణీ ! దేవతలచే పూజించబడుతల్లీ ! గదాశంఖచక్రాలను ధరించినదేవీ ! మహాలక్ష్మీ ! నీకు అనేక నమస్కారములు. 

వివరణ : సృష్టిస్తితిలయాలకు మూలకారణమైన శక్తికి మహామాయ అనిపేరు.  ఆమెయే శ్రీచక్రారూడ. సకలదేవతలుని ఆమెనే పూజిస్తుంటారు.  ఆమె శంఖచక్రగదాహస్త అయి, వైష్ణవీరూపంతో మహాలక్ష్మిగా, విష్ణుపత్నిగా జగద్రక్షణ చేస్తూంది. లక్ష్మి అంటే సర్వాన్నీ చూచేది అని ఒక వ్యుత్పత్తి. కనుకనే సర్వాన్నీ రక్షించేదీ అయింది.  విష్ణుపత్ని గనుక విష్ణువు ధరించే ఆయుధాలు లక్ష్మికీ వర్తించాయి.  ఇది వైష్ణవీరూపం  ఇందలి అయుదిసంబోధనలూ అమ్మవారిపంచప్రకృత్యాత్మకశక్తికి  సంకేతాలు.

నమస్తే గరుఢారూఢేః ! కోలాసురభయంకరి!
సర్వపాపహరే! దేవి! మహాలక్ష్మి! నమోస్తుతే ||

గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లీ ! కోలుడు అనే రాక్షసునికి భయం కల్గించిన దేవీ! సకలపాపహారిణి ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారములు.

వివరణ : విష్ణుదేవుని అర్ధాంగి గనుక మహాలక్ష్మికూడా గరుడవాహనయే ! లక్ష్మీసహస్రనామస్తోత్రం 65వ శ్లోకం లో "గరుడో పరిసంస్థితా" అని ఉంది. గరుత్మంతుడు వేదమూర్తి కనుక భగవానుడు అతనిపై సంచరిస్తాడు. అంటే వేదాలపై విహరిస్తాడు.  జగన్మాత అయిన లక్ష్మీదేవి కూడా వేదారూఢయే ! అమ్మవారు వేదమాత, కోలా విధ్వంశులనేవాళ్ళు స్వారొచిషమనువు కాలంవాళ్ళు.  ఆకాలంలో చైత్రవంశీయుడైన 'సురధుడు' అనే రాజును కోలావిధ్వంశులనేవాళ్ళు జయించి, అతనికి శత్రువులయ్య్యారు.  కోలుడు, విధ్వంశుడు అనే ఈ రాక్షసుల్ని అమ్మవారు లక్ష్మీ రూపంతో సమ్హరించింది.  కనుక కోలాసుర భయంకరి అయింది.  ఈ విషయం దేవీసప్తశతిప్రధమాధ్యాయం ఐదవశ్లోకంలో సూచితం. భగవతీనామస్మరణం సర్వపాపాల్నీ నశింపజేస్తుంది.

సర్వజ్ఞే ! సర్వవరదే ! సర్వదుష్ట భయంకరి!
సర్వదుఃఖహరే! దేవి! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

సర్వజ్ఞురాలా ! సకలవరాలు ప్రసాదించే దయామయీ! సర్వదుష్టశక్తుల్నీ తోలగించేపరాశక్తీ! అన్ని దుఃఖాలనూ హరించే లక్ష్మీదేవీ! నీకు నమస్కారములు

వివరణ :  అమ్మవారు జగన్నాయకి. విష్ణుపత్ని కనుక ఆమెకు తెలియని విషయం ఉండదు. ఎవరికి ఏ సుఖం కల్గినా అది శ్రీదేవియొక్క అనుగ్రహవిశేషమే ! అమ్మ 'సర్వజ్ఞ కనుక సర్వ దుష్టశక్తుల్నీ,దుఃఖాలనీ తొలగించి, అందరికీ సుఖశాంతుల్ని ప్రసాదిస్తూంది.  బాహ్యాంతశ్శత్రువులు నశిస్తేనే జీవునికి నిజమైన ఆనందం కల్గుతుంది. ఇందుకు లక్ష్మీదేవియొక్క అనుగ్రహం చాలా ముఖ్యం.

 సిద్ధిబుద్ధిప్రదే! దేవి! భుక్తిముక్తిప్రదాయిని !
మంత్రమూర్తే ! సదాదేవె ! మహాలక్ష్మి! నమోస్తుతే ||

సిద్ధినీ  బుద్ధినీ   ప్రసాదించేతల్లీ ! భుక్తిని, ముక్తిని అనుగ్రహించే దేవీ! మంత్రమూర్తీ! దివ్యకాంతిమయీ ! మహాలక్ష్మీ నీకు నమస్కారము. 

వివరణ : అమ్మవారు కార్యసిద్ధిని, అందుకు అవసరమైన బుద్ధిని ప్రసాదిస్తుంది. ఇహపరసౌఖ్యాలు అనుగ్రహిస్తుంది .  అమ్మ మంత్రమూర్తి కనుక ఎవరు ఎలా భావించి, పూజిస్తే వారివారికి తగినట్లుగా రక్షణ ఇస్తూంటుంది.  కార్యసిద్ధీ, కార్యనిర్వహణబుద్ధీ, భుక్తీ, ముక్తీ ఇలా జీవికి అవసరమైన అన్ని దంద్వాలనూ ప్రసాదించడం అమ్మ ప్రత్యేకత.  అన్ని మంత్రాలూ 'శ్రీం' బీజ మయాలే ! కనుక అమ్మ మంత్ర స్వరూపిణి.

ఆద్యంతరహితే ! దేవి! ఆద్యశక్తి ! మహేశ్వరి !
యోగజే ! యోగసంభూతే ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

ఆద్యంతాలు లేనిదేవీ ! ఆదిశక్తీ ! మహేశ్వరీ ! యోగం వల్ల జన్మించిన తల్లీ ! ధ్యానంలో గోచరించే జగన్మాతా ! మహాలక్ష్మి ! నీకు నమస్కారము.

వివరణ :  అమ్మ ఆదిశక్తి. సృష్ఠిస్తితిలయాలకు కారణమైనది.  ఈ తల్లికి మొదలు, తుది అనేవిలేవు.  సర్వకాల, సర్వావస్థలలో అమ్మ చైతన్యరూపిణియై ఉంటుంది.  అమ్మ 'యోగం' వల్ల సంభవించింది.  'యోగ'మంటే ధ్యానం.  ధ్యానంలో మాత్రమే అమ్మ సాక్షాత్కారం కల్గుతుంది. కనుక అమ్మ "యోగజ", "యోగసంభూత" అయింది. అనగా పరమాత్మరూపిణి, జగత్ప్రభువగు విష్ణుదేవుని భార్య కనుక అమ్మ "మహేశ్వరి" అనగా జ్ఞానస్వరూపిణి.

 స్థూలసూక్ష్మ మహారౌద్రే ! మహాశక్తి ! మహోదరే !
మహాపాపహరే ! దేవి ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

స్థూలరూపంతోనూ, సూక్ష్మ రూపంతోనూ, మహారౌద్రరూపంతోనూ కనిపించేతల్లీ ! మహాశక్తిస్వరూపిణీ ! గొప్ప ఉదరం గల జగజ్జననీ ! మహాపాపాల్ని హరించేదేవీ ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారము.

వివరణ : లక్ష్మీదేవి రజోగుణస్వరూపిణి.  హిరణ్యవర్ణ. కనుకనే ఆమె రౌద్ర, స్థూల, సూక్ష్మ రూపాలతో ఆయా సందర్భాలలో వ్యక్తమవుతూ ఉంటుంది.  భౌతికంగా భక్తులు కోరికలకై పూజించేరూపం స్థూలం.  ఇది రజోగుణాత్మకం.  యోగులు నిస్కాములై ధ్యానించేరూపం సూక్ష్మం! ఇది సర్వగుణాత్మకం.  ఇక శత్రుసమ్హారం కావించేరూపం తామసం.  ఇది రౌద్రం.  ఇలా త్రివిధరూపాలతో శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేస్తూ, అమ్మవారు విష్ణుదేవుణ్ణి అనుసరించి వుంటుంది.  ఆమె మహాశక్తి.  ఆమె గర్భంలో సమస్త బ్రహ్మాండాలూ ఉన్నాయి.  అమ్మ పాపసమ్హారిణి. సకలలోకజనని.

పద్మాసనస్థితే ! దేవి ! పరబ్రహ్మ స్వరూపిణి !
పరమేశి ! జగన్మాత ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

పద్మాసనభంగిమలో కూర్చొని ఉండేదేవీ ! పరబ్రహ్మ స్వరూపిణీ ! పరమేశ్వరీ ! జగజ్జననీ ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారము.

వివరణ : లక్ష్మి పద్మం నుండి జనించింది.  పద్మంలోనే నివసిన్స్తుంది.  పద్మాన్నే ధరిస్తుంది. పద్మం పైనే కూర్చుంటుంది.  నిల్చుంటుంది. ఇలా ఆమేసర్వమూ పద్మమే ! పద్మమంటే ఇందు లక్ష్మి ఉంటుంది. పద్యతే అత్ర లక్ష్మీః  అని వ్యుత్పత్తి. అమ్మ నివసించడంవల్లనే పద్మాలకు అంతటి శోభ, మృదుత్వం, ప్రశస్తీ వచాయి.  పద్మాసన - పద్మాన్నే ఆసనంగా కల్గి ఉండేది.  అయ్య పరబ్రహ్మ కనుక ఆయన అర్ధాంగి యగు లక్ష్మి యు పరబ్రహ్మమే ! లక్ష్మి మహానాయకురాలు. సృష్ఠి స్థితి లయాలకు ఆమె కారణం.  మాత అంటే గర్భం తనలో ఇమిడియుండునది అని వ్యుత్పత్తి.  అమ్మ సకలలోకాలనూ తన గర్భం లో ధరించి సృష్ఠి చేస్తుంది. కనుక జగజ్జనని.

శ్వేతాంబరధరే! దేవి ! నానాలంకారభూషితే !
జగత్ స్థితే ! జగన్మాత ! మహాలక్ష్మి ! నమోస్తుతే ||

తెల్లనివస్త్రములు ధరించిన దేవీ ! అనేకాలయిన అలంకారాలు దాల్చినతల్లీ ! లోకస్థితికి కారణమైన విష్ణుపత్నీ ! జగన్మాతా ! మహాలక్ష్మి ! నీకు నమస్కారము. 

వివరణ : మహాలక్ష్మిని శ్వేతాంబరధారిణిగా వర్ణించుట ఇందలి విశేషం.  సాధారణంగా సరస్వతిని శ్వేతాంబరధారిణి గా నుతిస్తారు. ఇచ్చట లక్ష్మిని విద్యాలక్ష్మి గా భావించినపుడు ఆమె సరస్వతీ స్వరూపిణి అని భక్తులు భావించి ఆ రూపంతో దర్శించాలి.  అష్టవిధలక్ష్ములలో విద్యా లక్ష్మి నానాలంకారభూషితురాలు.  ఆభరణాలన్నీ సువర్ణరత్నమయమైనవే !  అమ్మ జగత్తునందలి చరాచర వస్తువు లన్నింటా నిల్చి వాటిల్ని శక్తిమంతాలుగా చేస్తుంది.  అది అమ్మవారి విభూతి అనగా ఐశ్వర్యం, లోక్స్థితి కి అమ్మవారే కారణం !

 
ఫలశ్రుతి
 
మహాలక్ష్మ్యష్టకస్తోత్రం యః పఠేత్ భక్తిమాన్నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||
 
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః ||
 
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం |
మహాలక్ష్మీ ర్భవే నిత్యం ప్రసన్నా వరదా శుభా ||
 
ఇంద్రకృతం శ్రీ మహాక్ష్మ్యస్టకం సంపూర్ణం ||

ఇంద్రుడు గావించిన ఈ మహాలక్ష్మీ స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో పఠించేవాళ్ళు రాజ్యాధికారం మొదలు సకలాభ్యుదయాలూ పొందుదురు.  రోజుకు ఒకమారు ఉదయం మాత్రమే పఠించేవారు మహాపాపాలనుండి విముక్తులవుతారు.  రోజూ ఉదయం, సాయంకాలం రెండు సార్లూ పఠించేవాళ్ళు ధనధాన్య సమృద్ధి కలవారవుతారు. మూడుకాలాల్లో ఉదయం, మధ్యాన్నం, సాయంకాలం - పఠించేవాళ్ళు సకల శత్రుబాధల్నీ తొలగించుకొని సుఖిస్తారు.  అట్టివారికి మహాలక్ష్మి ప్రసన్నురాలై కోరిన వరాలు ఇస్తుంది.  శుభాలు కల్గిస్తుంది.

వివరణ :  ఏ స్తోత్రాన్ని పఠించి ఫలం పొందాలన్నా, భక్తి ముఖ్యం.  భక్తి లేని పారాయణం, చిల్లులు పడిన కుండలోపోసిన నీళ్ళవలె వృధా అవుతుంది.  సర్వం మహాలక్ష్మీ ఆధీనం.  ఆ తల్లి అనుగ్రహిస్తే సకల జీవులు ఇహ పర సుఖ జీవనులై ఉంటారు.  కామక్రోధాధులైన అరిషడ్వర్గమే మహా శత్రువులు.  వాళ్ళు నశిస్తేనే మానవులు శుద్ధాంతఃకరణులవుతారు. భగవదనుగ్రహపాత్రులవుతారు. అట్టివారిని మహాలక్ష్మి తన బిడ్డలుగా ఆదరించి రక్షిస్తుంది.  అంతఃశత్రువుల్ని కూల్చాలంటే మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో స్తుతించి, పూజించాలి.  త్రిలోకాధిపతియగు ఇంద్రుడు గావించిన ఈ దివ్య శ్తోత్రాన్ని మహర్షులు మనకు అనుగ్రహించారు.  


Translation by P Srivani, Saptagiri, Aug 2014

శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం


నారాయణం పరబ్రహ్మం సర్వ కారణకారణం |
ప్రపద్యే వేకంటేశాక్యం తదేవ కవచం మమ ||
సహస్ర శ్రీర్షా పురుషో వేంకటేశ శ్శిరోవతు|
ప్రాణేశః ప్రాణ నిలయః ప్రాణం రక్షతు మే హరి ||
ఆకాశరాట్ సుతానాధ ఆత్మానం మే సదా (అ)వతు |
దేవ దేవోత్తమః పాయాద్ దేహం మే వేంకటేశ్వరః ||
సర్వత్ర సర్వ కాలేషు మంగాంబాజాని రీశ్వరః |
పాలయే న్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు ||

                    ఫల శృతి

య యేతద్ వజ్రకవచ మభేద్యం వేంకటేశితుః |
సాయం ప్రాతః పఠే న్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ||

***
 
 

"వేంకట వజ్ర కవచస్తోత్రం"  మార్కండేయ మహర్షి చెప్పిందని ప్రసిద్ధి. ఈ స్తోత్రం లో నాల్గు శ్లోకాలు 'నన్ను రక్షించు గాక ' అని అర్ధం వచ్చేవి. చివరి ఒక్కశ్లోకం ' ఫల శృతి'  రూపమైనది. మొత్తం ఐదు శ్లోకాలు.

భావం :

1.  శ్రీ వేంకటేశ్వరుడు సాక్షాన్నారాయణుడు.  పరభ్రహ్మ, సర్వకారణాలకూ కారణము తానే అయినవాడు. కనుక అట్టి శ్రీవేంకటేశ్వరుణ్ణి నేను శరణు పొందుతున్నాను.  శ్రే వేంకటేశ్వరుని పేరే (ఆ స్వామిని స్మరించుటే) నాకు భద్రకవచమై రక్షించుగాక.

2.  వేయి తలలు - అంటే అనంతమైన శిరసులు కల పరమాత్ముడైన వేంకటేశుడు నా శిరస్సును రక్షించుగాక! సకల ప్రాణుల ప్రాణాలకు ప్రభువూ, అందరి ప్రాణాలకు నిలయుడూ అయిన ఆ శ్రీహరి నా ప్రాణాన్ని రక్షించుగాక!

3. ఆకాశరాజుకూతురు పత్మావతికి భర్త అయిన వేకటేశుడు నా ఆత్మను (నన్ను) సదా కాపాడుగాక ! దేవదేవోత్తముడైన వేంకటేశ్వరుడు ఈ నా దేహాన్ని కాపాడుగాక !

4. అలమేలుమంగమ్మపతి అన్నిటికీ ప్రభువూ అయిన వేంకటేశ్వరుడు అన్ని చోట్లా, అన్ని కాలాలలో నా సత్కర్మల నన్నింటిని రక్షించి వాటిల్ని సఫలం చేయుగాక.

ఫలశృతి భావం

ఈ వేంకటేశ్వరవజ్రకవచ స్తోత్రం అభేద్యమైనది. ఉదయం, సాయంకాలం ప్రతిదినమూ భక్తితో పఠించేవాళ్ళు మృత్యుభయం లేకుండా ఆనందంగా ఉంటారు. 

లఘు వివరణ

కవచమంటే శరీరాన్ని రక్షించే సాధనం. అది వజ్రంతో తయారయిందంటే ఇక దేనిచేతనూ దెబ్బతినకుండా కాపాడుతుంది.  ఈ వేంకటేశ్వరవజ్రకవచస్తోత్రం భక్తులపాలిటికి వజ్రకవచమై వాళ్ళను కాపాడుతుంది.  శ్రీస్వామివారిని శరణు పొంది, ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో, శ్రద్ధతో పఠించే వాళ్ళు అన్ని ఆపదలనుండీ, శారీరకంగానూ, మానసికంగానూ రక్షింపబడతారు.  మృత్యుభయం లేకుండా హాయిగా వుంటారు (మృత్యువు కంటే మృత్యుభయం గొప్పది).


- విద్వాన్ డా || పమిడికాల్వ చెంచుసుబ్బయ్య, సప్తగిరి మాస పత్రిక, ఆగస్ట్ 2014.



Wednesday, 6 August 2014

నారాయణ స్తోత్రం




రచన: ఆది శంకరాచార్య

నారాయణ నారాయణ జయ గోవింద హరే ||
నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ || 1 ||
ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ || 2 ||

యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ || 3 ||
పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ || 4 ||

మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ || 5 ||
రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ || 6 ||

మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ || 7 ||
బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ || 8 ||

వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ || 9 ||
జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ || 10 ||

పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ || 11 ||
అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ || 12 ||

హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ || 13 ||
దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ || 14 ||

గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ || 15 ||
సరయుతీరవిహార సజ్జన‌ఋషిమందార నారాయణ || 16 ||

విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ || 17 ||
ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ || 18 ||

జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ || 19 ||
దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ || 20 ||

ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ || 21 ||
వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ || 22 ||

మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ || 23 ||
జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ || 24 ||

తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ || 25 ||
గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ || 26 ||

సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ || 27 ||
అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ || 28 ||

నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ || 29 ||
భారత యతవరశంకర నామామృతమఖిలాంతర నారాయణ || 30 ||


Courtesy : SVBC & Vaidika Vignanam dot org

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger