Friday, 17 October 2014

పదివేల మొక్కులు

పదివేల మొక్కులు నీ పాదాలకు మొక్కేనిదే
ఇదె నిన్ను వేడుకొనే నింటికి రావయ్యా

పొత్తుల మాటలు నిన్ను బొదిగి యే మాడితినో
చిత్తగించి నాపై దయ సేయవయ్యా
కొత్తలుగా నేనెంత గునిసి జంకించితినో
ఇత్తల నోరచుకొని యింటికి రావయ్యా  ||పదివేలు||

చెనకి నిన్నే మేమి సేతలు సేసొతినో
మనవి చేకొని నన్ను మన్నించవయ్యా
తనివిదీరగ నిన్ను తప్పులెట్టు వట్టితినో
యెనసి నవ్వు సేసుక  యింటికి రావయ్యా ||పదివేలు||

కడుదమకించి చనుగవ నెన్నెట్టితినో
చిడిముడితో నన్ను రక్షించుకోవయ్యా
అడరి శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను
యెడయ కేలితివిట్టే యింటికి రావయ్యా ||పదివేలు||


padiveala mokkulu nee paadaalaku mokkeanidea
ide ninnu veaDukonea ninTiki raavayyaa

pottula maaTalu ninnu bodigi yea maaDitinoa
chittaginchi naapai daya seayavayyaa
kottalugaa neanenta gunisi jankinchitinoa
ittala noarachukoni yinTiki raavayyaa  ||padivealu||

chenaki ninnea meami seatalu seasotinoa
manavi cheakoni nannu manninchavayyaa
tanivideeraga ninnu tappuleTTu vaTTitinoa
yenasi navvu seasuka  yinTiki raavayyaa ||padivealu||

kaDudamakinchi chanugava nenneTTitinoa
chiDimuDitoa nannu rakshinchukoavayyaa
aDari SreeveankaTeaSa alamealmanganu neanu
yeDaya kealitiviTTea yinTiki raavayyaa ||padivealu||

0 comments:

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger