యెవ్వరికి గలుగు నేడీ భాగ్యము
నివ్వటిల్ల నన్ను మన్నించితివి గాకా ||
వేడు కౌను నీ గుణాలు వలదులు పొగడితే
చూడజూడ నీ రూపు సోద్యము లౌను
కూడి వున్నంతదడవు గొబ్బున సంతోసమవును
యీడ నామనసు నీపై నెంత మురిపితివో ||
నెమ్మది నిద్రించితేను నీ కలలే కందును
కొమ్మలతో నిన్ను బేరుకొని మెత్తును
కమ్మర నీ గురుతులు కాయ మంటితేజొక్కుచు
ఇమ్ముల నీమీది బత్తి యెంత నాకిచ్చితివో ||
చిగురించు నవ్వులు చేయి నా పై జాచితే
నిగుడు దమకములు నీవు చేరితే
తగు నలమేల్మంగ నింతట శ్రీవేంకటేశ్వర
వొగి నీరతుల కెంత వొడి గట్టించితివో ||
evvariki galugu neaDee bhaagyamu
nivvaTilla nannu manninchitivi gaakaa ||
veaDu kounu nee guNaalu valadulu
pogaDitea
chooDajooDa nee roopu soadyamu lounu
kooDi vunnantadaDavu gobbuna
santoasamavunu
yeeDa naamanasu neepai nenta muripitivoa
||
nemmadi nidrinchiteanu nee kalalea
kandunu
kommalatoa ninnu bearukoni mettunu
kammara nee gurutulu kaaya
manTiteajokkuchu
immula neemeedi batti yenta
naakicchitivoa ||
chigurinchu navvulu cheayi naa pai
jaachitea
niguDu damakamulu neevu chearitea
tagu nalamealmanga nintaTa
SreeveankaTeaSvara
vogi neeratula kenta voDi gaTTinchitivoa ||
0 comments:
Post a Comment