Friday 9 January 2015

విశ్వప్రకాశునకు





విశ్వప్రకాశునకు వెలి యేడ లో నేడ
శాశ్వతున కూహింప జన్మ మిక నేడ

సర్వపరిపూర్ణునకు సంసార మిక నేడ
నిర్వాణమూర్తికిని నిలయ మిక నేడ
వుర్వీధరునకు కాలూద నొకచో టేడ
పార్వతీస్తుత్యునకు భావ మిక నేడ

నానాప్రభావునకు నడు మేడ మొద లేడ
ఆననసహస్రునకు నవ్వ లివ లేడ
మౌని హృదయస్థునకు మాటేడ పలు కేడ
జ్ఞానస్వరూపునకు కాన విన నేడ

పరమయోగీంద్రునకు పరు లేడ తా నేడ
దురితదూరునకు సంస్తుతి నింద లేడ
తిరువేంకటేశునకు దివ్యవిగ్రహ మేడ
హరికి నారాయణున కవుగాము లేడ





భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, జీవుల కర్మఫలప్రదాత. ఇదే సత్యం. మన కర్మలే మనందరి సుఖదుఃఖాలకు కారణం.  భగవంతుడు సాక్షీభూతుడు. హరికధాకాలక్షేపం, పురాణశ్రవణం లాంటివాటి ముఖ్యోద్దేశ్యం నామస్మరణే ! ఈ విశ్వాన్నే ప్రకాశింపజేసి, శాసించి, నశింపజేయగల వేకటేశ్వరుడికి, యోగీశ్వరునికి, జ్ఞానేశ్వరునికి, అనంత ప్రభావశాలికి అన్నమయ్య వినిపిస్తున్న కీర్తన ఇది. 

From : Saptagiri Magaine Oct 2014

1 comments:

navachaitanyavedike said...

samsaramu kadu samcharam

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger