నల్లని మేని నగవు జూపుల వాడు
తెల్లని కన్నుల దేవుడు
1) బిరుసైన దనుజుల పీచమణచినట్టి
తిరుపుగైదువుతోడి దేవుడు
చరిబడ్డ జగమెల్ల జక్కజాయకు దెచ్చి
తెరవు చూపినట్టి దేవుడు
2) నీట గలిసినట్టి నిండిన చదువులు
తేటపరచినట్టి దేవుడు
పాటి మాలినట్టి ప్రాణుల దురితపు
తీట వాపినట్టి దేవుడు
3) గురుతు వెట్టగ రాని గుణముల నెలకొన్న
తిరు వేంకటాద్రి పై దేవుడు
తిరముగ ధ్రువునికి దివ్యపదంబిచ్చి
తెరచి రాజన్నట్టి దేవుడు
కీర్తనను వినండి [Open the link in a new Tab to stay in this page]
920. okati sugnanamu - ఒకటి సుజ్ఞానము
-
tuned and sung by Sri Sathiraju Venumadhav in raga rajani
archive link
ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము
ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు ॥పల్లవి॥
తనుఁ ద...
6 months ago
5 comments:
సుజాత గారు,
ఈ కీర్తన సుశీల గారు పాడిన ఒక ప్రైవేట్ ఆల్బంలో ఈ పాట చాలా రోజుల క్రితం కాలేజీలో ఉన్నప్పుడు విన్నాను, నచ్చి నేర్చుకున్నాను కూడా. అదే ఆల్బంలో "తోరణములె త్రోవెల్లా, ఊరట బారట నుంచిన లతలా" అనే కీర్తన కూడా ఉంటుంది. వసంత, రామకృష్ణ పాడారు. విన్నారా మీరు?
వేదాలను నిండిన చదువులు గా చెప్పటం. అన్నమయ్యకు మాత్రమే సాధ్యమయ్యే సొగసుతనం. ఈ పదం శ్రీరంగం గోపాలరత్నం గొంతులో పూర్వికళ్యాణిలో చాలా బాగుంటుంది. tirumala.org సైటులో వినవచ్చు. కృ..లు.
సుజాత గారు, బావుంది. ఈ సారి పాడించుకుంటాను. మీరు చెప్పిన ఇంకో పాట విన్లేదు. చూడాలి.
తెలుగు అభిమాని గారు .. చాలా థాంక్స్. నాకు బాగా నచ్చిన శ్రీ రంగం గారి పాట 'ఏ పిలుపు తో పిలిచితే పలుకుతావటా ..' (వేంకటేశ్వర వైభవం సినిమా లోనిది)
ఇది నాకు చాలా ఇష్టమైన పాట. నాదగ్గర టేపు వుంది కూడాను. అయినా మీ లింకులో విన్నాను. :)
Thanks.
"నల్లని మేని నగవు జూపుల వాడు"పాట విని చాలా ఆనందించాను.నాబ్లాగులలోని కీర్తనలకు ఇలానే పాటలను లింకు చెయ్యాలని ఉంది.కానీ ఎలాచెయ్యాలో తెలియక నానా ఇబ్బందిగాను ఉంది.దయచేసి ఆ విధానాన్ని తెలియజేస్తే సదా కృతజ్ఞుడనై ఉంటాను.
Post a Comment