Wednesday, 27 August 2008

డోలాయాం

డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం ..డోలా..

మీన కూర్మ వరాహా మృగపతి అవతారా
దానవారే గుణశౌరే ధరణిధర మరుజనక ..డోలా..

వామనరామ రామ వరకృష్ణ అవతారా
శ్యామలాంగా రంగ రంగ సామజవరద మురహరణ ..డోలా..

దారుణ బుద్ధ కలికి దశవిధ అవతారా
శీరపాణే గోఅస మాణే శ్రీవేంకటగిరి కూటనిలయ ..డోలా..


కీర్తనను వినండి [Please open the link in a new Tab to stay in this page ]

2 comments:

సుజాత వేల్పూరి said...

ఇదీ,క్షీరాబ్ది...ఈ రెండూ ఎమ్మెస్ అమ్మ పాడిన అన్నమాచార్య కీర్తనల్లోనే వినాలండి! ఇంకెవరైనా పాడితే పాడి ఉండొచ్చు, ఎమ్మెస్ గొంతులో అమృతం కురిసినట్టు జాలువారతాయి ! వినే ఉంటారు మీరు. ఆ ఆలబంలో "నానాటి బతుకు నాటకము" వింటుంటే తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వచ్చిన సందర్భాలు చాలా !

Sujata M said...

సుజాత గారు .. మీరన్నది నిజం. ఈ పాట కొత్త గొంతుల్లో వినడానికి కాస్త..... అదోలా ఉన్నా (బానే ఉంది కదూ ?!), నాకు కొంచెం డిఫెరెంట్ గా, బావున్నట్టనిపించి పోస్ట్ చేసాను. ఈ కీర్తనలు ఎం.ఎస్. గొంతులోనే బావుంటాయి. మరి మాలాంటోళ్ళు నేర్చుకుంటే ఇలా కూడా ఉంటుంది మరి ! ఈ సారి నుండీ ఎం.ఎస్.పాటలే పోస్ట్ చేయ్యడానికి ప్రయత్నిస్తాను.

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger