|
నిత్య పూజలివివో నేరిచిన నోహో
ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి
తనువే గుడియట తలయే శిఖరమట
పెనుహృదయమే హరి పీఠమట
కనుగొన చూపులే ఘనదీపములట
తన లోపలి అంతర్యామినికిని
పలుకే మంత్రమట పాదైన నాలికే
కలకలమను పిడి ఘంటయట
నలువైన రుచులే నైవేద్యములట
తలపు లోపల నున్న దైవమునకు
గమన చేష్టలే అంగరంగగతియట
తమిగల జీవుడే దాశుడట
అమరిన వూర్పులే ఆలవట్టములట
క్రమముతో శ్రీ వేంకటరాయనికి
4 comments:
మంచి సంకీర్తన.అదీ మంగళంపల్లి వారు పాడింది.బ్రహ్మాండంగా వుంది.
Thank u sir.
blogulo brahmanda swaroopudu, baalagi adhbuthunga vunnadu. baavundi.
U could C my drawings at
www.pruthviart.blogspot.com
Post a Comment