Sunday 23 November 2008

అలమేలు మంగ నీ అభినవ రూపము



అలమేలు మంగ నీ అభినవ రూపము
జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మా

గరుడాచలాధీశు ఘన వక్షమున నుండి
పరమానంద సంభరితవై
నెరతనములు చూపి నిరంతరము నాథుని
హరుషించగ జేసితి గదవమ్మా

శశి కిరణములకు చలువల చూపులు
విశదముగా మీద వెద చల్లుచు
రసికత పెంపున గరగించి యెప్పుడు నీ
వశము చేసుకొంటి వల్లభునోయమ్మా

రట్టడి శ్రీ వేంకటరాయనికి నీవు
పట్టపురాణివై పరగుచు
వట్టిమాకు తిగిరించు వలపు మాటల విభు
జట్టి గొని వురమున సతమైతివమ్మా

2 comments:

మాలతి said...

మరో మంచి పాట.
రెండో చరణం నాలుగో పాదం హతుషించగ అన్నది అనుషించగ అని చదువుకోవాలనుకుంటాను.
అలాగే తరవాత లైనులో శశి కిరణములకు
- మిమ్మల్ని తప్పు బట్టాలని కాదు కానీ, ఇంత శ్రమ తీసుకున్నారు కదా అని.

Sujata M said...

మాలతి గారూ

బాగా వచ్చిన పాటే - టైపు తప్పు చేసాను. చూసుకున్నా కూడా మిస్ అయ్యాను. థాంక్స్ అండీ. హరుషించగా అనే చదువుకోవాలి. చాలా థాంక్స్ !

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger