శ్లో|| ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్టః ప్రజాపతిః
హిరణ్య గర్భో భూగర్బో మాధవో మధుసూదనః
1. ఈశానః = అందరికన్నా గొప్పవాడైన పరమాత్మ
2. ప్రాణదః = ప్రాణములు ఇచ్చువాడు
3. ప్రాణః = ప్రాణము
4. జేష్ఠః = అందరికన్నా పెద్ద వాడు
5. శ్రేష్టః = అత్యుత్తమమయినవాడు
6. ప్రజాపతిః = పుట్టుకకు కారణమయినవాడు
7. హిరణ్యగర్భః = బంగారపు గ్రుడ్డు
8. భూ గర్భః = భూమి యొక్క కేంద్రము
9. మాధవః = లక్ష్మీదేవి భర్త
10. మధుసూదనః = మధువు అను రాక్షసుని చంపినవాడు
భావము :
పరమాత్మను మిక్కిలి గొప్పవానిగను, ప్రాణము నిచ్చువానిగను మరియు ప్రాణము గను, అందరికన్నా పెద్దవానిగను, ఉత్తమమయిన వానిగను, పుట్టుకకు కారణమయినవాడుగను, బంగారపు గుడ్డు గను, భూమికి కేంద్రము మరియు గర్భము అయినవానిగను, లక్ష్మీదేవి కి భర్త గను, మధువు అను రాక్షసుని సంహరించినవానిగను, ధ్యానము చేయవలెను.
921. daivamA O daivamA - దైవమా వో దైవమా
-
Youtube Link : Sri Malladi Brothers,
Tune by Sri Malladi Suribabu garu (??)
॥పల్లవి॥ దైవమా వో దైవమా నన్ను దయఁజూడఁ దగదా నే వెఱ్ఱివాఁడనైతే నీవు వెఱ్ఱివా...
1 week ago
8 comments:
sujata గారు:
ఈశాన: అనుకుంటా అండి, "ఈ శాన్య:" కాదు.
ఈశాన: –“The Controller of all the five Great Elements”. When this term is used, Eesvara becomes the Administrator of His own Law in the phenomenal world of plurality. The executive function of His Infinite Will, when manifested through Him, the Lord. Eesvara, is said to function as Eesaanah. Or, the term can also mean One who is the Supreme Eesvara-the Paramesvara.
భాస్కర రామరాజు గారు చెప్పింది సరియైనదనుకుంటాను.ఓ సారి సరిచూడండి.
తేటగీతి:-
నిప్పు భక్తగు. మరుపది నివురు నిజము.
నివురు బాపిన భక్త్యగ్ని నెఱుగ నగును.
భక్తి రచనలె వాయువై బాపు నివురు.
శక్తి భక్తులు పెంచును చదువరులకు.
నిర్ విఘ్నేన మనో వాంఛా ఫల సిద్ధిరస్తు అని ఆపరమాత్మ మిమ్ములను దీవించు గాక.
జైహింద్.
Bhaavodwegame kaanee Bhaashaanbhavam leni..
Vishnu Bhaktudanu...
Mee mantra visleshana athi ramyam.. maa vanti vaariki aadhyaatmika mano vikaasam...
Em mantraalu chaduvutunnamo samoolam gaa avagaahana kaligi vundatam mee valla saadhyam...
Naa manahpoorvaka abhinandanalu mee ee vislesanaki...
భాస్కర రామ రాజు గారు
చాలా థాంక్స్ అండీ. నేను చూసుకోలేదు. ఇపుడు సరిదిద్దాను.
సుజాత గారు, ఏమీ అనుకోవద్దు, "ఈశాన:", "ఈ శాన:" కాదు. ఈ కి శా కి మధ్యన స్పేస్ తీసేయ్యండి.
:) ధన్యవాదాలు..
సుజాత గారూ
నా దగ్గర శోభారాజు గారి అన్నమయ్య సంకీర్తనల సి.డి. వుంది.ఆ పాటలను కంప్యూటరు లోనికి కాపీ చేసాను.వాటిని నా బ్లాగులోని కీర్తనలకు కలపటం కుదురు తుందా?ఎలా చెయ్యాలో తెలియజేయగలరు.
సుజాత గారూ
నా దగ్గర శోభారాజు గారి అన్నమయ్య సంకీర్తనల సి.డి. వుంది.ఆ పాటలను కంప్యూటరు లోనికి కాపీ చేసాను.వాటిని నా బ్లాగులోని కీర్తనలకు కలపటం కుదురు తుందా?ఎలా చెయ్యాలో తెలియజేయగలరు.
Post a Comment