ఏమి చిత్రం బేమి మహిమలు యేమి నీ మాయా వినోదము
వామనాచ్యుత నిన్ను దెలియగ వసుధలో మా తరములా ||
సకలలోక నివాస నాయక శౌరి మురహర నరహరీ
ప్రకటమాయెను నీ గుణంబులు పాలముచ్చ వటంచును
వికటముగ నిను గన్న తల్లి వేల నీ వదనంబు మీటిన
అకట హా యని నోరు దెరచిన యందు లోకములుండెను ||
శ్రీసతిపతి దైత్యదానవశిక్ష కామర రక్షక
రాసి కెక్కెను బండిరొప్పిన రవ్వలా నీ నేతలు
మోసమున నర్జునుడు నీలో ముందు గానక మాటలాడిన
వాసవార్చిత విశ్వరూపము వసుధ జూపితివవుదువు ||
నమో నమో శ్రీవేంకటేశ్వర నారదప్రియ భక్తవత్సల
విమలమగు నీ దాసులిదె నీ విద్య లెల్లా జూచిరి
సుముఖులైన కరిశబరి బలియును శుకధ్రువాదులు నిన్ను గొలువగ
సమత వున్నతపదము లొసగితి సర్వమిందును గంటిమి ||
Audio Link : ఏమి చిత్రం బేమి మహిమలు
aemi chitraM baemi mahimalu yaemi nee maayaa vinOdamu
vaamanaachyuta ninnu deliyaga vasudhalO maa taramulaa ||
sakalalOka nivaasa naayaka Sauri murahara naraharee
prakaTamaayenu nee guNaMbulu paalamuchcha vaTaMchunu
vikaTamuga ninu ganna talli vaela nee vadanaMbu meeTina
akaTa haa yani nOru derachina yaMdu lOkamuluMDenu ||
Sreesatipati daityadaanavaSiksha kaamara rakshaka
raasi kekkenu baMDiroppina ravvalaa nee naetalu
mOsamuna narjunuDu neelO muMdu gaanaka maaTalaaDina
vaasavaarchita viSvaroopamu vasudha joopitivavuduvu ||
namO namO SreevaeMkaTaeSvara naaradapriya bhaktavatsala
vimalamagu nee daasulide nee vidya lellaa joochiri
sumukhulaina kariSabari baliyunu Sukadhruvaadulu ninnu goluvaga
samata vunnatapadamu losagiti sarvamiMdunu gaMTimi ||
920. okati sugnanamu - ఒకటి సుజ్ఞానము
-
tuned and sung by Sri Sathiraju Venumadhav in raga rajani
archive link
ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము
ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు ॥పల్లవి॥
తనుఁ ద...
6 months ago
0 comments:
Post a Comment