తరుణి జవ్వనపుదపము సేయగను
వరుస తోడ జాతి వైరములుడిగె ||
జక్కవపులుగులు జంటవాయవివె
గక్కన వెన్నెలగాసినను
యెక్కడ గోవిలయెలుగులు చెదరవు
గుక్కక వానలు గురిసినను ||
గుంపుదుమ్మెదలు గొబ్బున బెదరవు
సంపెంగతావులు చల్లినను
ముంపున జకోరములు వసివాడవు
సొంపుగళలు పెను సూర్యుడుండగను ||
చిలుకలు సందడిసేసిన దొలగవు
కలసినసమరతి కయ్యమున
యెలమిని శ్రీవేంకటేశుడు గూడగ
చెలియంగములని చెప్పగ బొసగె ||
*******************************************************************
"ఈ కీర్తన యందు శృంగారము గుబాళించును. వెన్నెల కాచినను జక్కవలు (చన్నులు) జోడు వీడకుండుట, రతిస్వేదవర్షమున్నను వాసంతికములగు కోయిలలు కూయుచుండుట, సంపెంగ వంటి ముక్కున బుట్టిన నిట్టూర్పులు సందడించినను, చికుర భ్రమరములు బెదరకుండుట, రతి సమ్మర్దశబ్దములతో చిలుకలు - చిలుకల యెలుగులు (రతికూజితములు) కట్టుగదలక ఉన్నచోటనే (కంఠములందే) ప్రతిధ్వనించుట మొదలగు సహజవైర త్యాగము వర్ణించబడినది. యౌవనమును తపముగా వర్ణించుటచే, తపశ్శక్తికి పరీక్షగా చెప్పిన "అహింసాప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగః" అను యోగశాస్త్ర మర్యాద ఇందు పాటింపబడినది. ఇది చాలా ఉదాత్తమైన భావన. కావున అన్నమయ్య దృష్టి, పరమేశ్వరార్చనగా సాగించిన ఈసంకీర్తనారాశిలో ఉత్తమాధమభేదబుద్ధి భావములందైనను భాషయందైనను తగదు."
- గౌరిపెద్ది రామసుబ్బ శర్మ
(తాళ్ళపాక వాజ్మయ పరిశోధకుడు)
taruNi javvanapudapamu saeyaganu
varusa tODa jaati vairamuluDige ||
jakkavapulugulu jaMTavaayavive
gakkana vennelagaasinanu
yekkaDa gOvilayelugulu chedaravu
gukkaka vaanalu gurisinanu ||
guMpudummedalu gobbuna bedaravu
saMpeMgataavulu challinanu
muMpuna jakOramulu vasivaaDavu
soMpugaLalu penu sooryuDuMDaganu ||
chilukalu saMdaDisaesina dolagavu
kalasinasamarati kayyamuna
yelamini SreevaeMkaTaeSuDu gooDaga
cheliyaMgamulani cheppaga bosage ||
921. daivamA O daivamA - దైవమా వో దైవమా
-
Youtube Link : Sri Malladi Brothers,
Tune by Sri Malladi Suribabu garu (??)
॥పల్లవి॥ దైవమా వో దైవమా నన్ను దయఁజూడఁ దగదా నే వెఱ్ఱివాఁడనైతే నీవు వెఱ్ఱివా...
1 week ago
0 comments:
Post a Comment