ఇందుకు విరహితము లిన్నియు నజ్ఞానమని
చందమున గీతలందు జాటీ నిదివో
మానావమానములు మానిడంబు విడుచుట
పూని హింసకు జొరక యరుపు గలుగుటయు
అని మతి గరగుట యాచార్యోపాసన
తానెప్పుడు శుచియౌట తప్పని విజ్ఞానము
అంచల సుస్థిర బుద్ధి యాత్మ వినిగ్రహము
అంచిత విషయ నిరహంకారాలు
ముంచిన జన్మ దుఃఖములు దలపోయుట
కంచపు సంసారము గడచుటే జ్ఞానము
అరి మిత్ర సమబుద్ధి అనన్య భక్తియు
సరి నేకాంతమును సజ్జన సంగవిముక్తి
ధర నధ్యాత్మ జ్ఞానతత్వము తెలియుట
గరిమ లందుట శ్రీవేంకటపతి జ్ఞానము
Meaning : - భగవంతుడు గీతలో వివరించిన జ్ఞానా జ్ఞానములను ఈ కీర్తనలో తెల్పుతున్నాడు అన్నమయ్య. మానము అవమానములను వర్జించడం, దంభం లేకుండుట, హింసాప్రవృత్తి లేకుండడం, ఓర్పు కలిగి ఉండడం, గురు సేవ, శౌచము అనేవి ; విషయ సుఖాలందు వైరాగ్యం అహంకారం లేకుండా వుండటం, అందరి యందు సమ సమ భావం కలిగి ఉండడం మొదలైనవి జ్ఞానము. వీటికి భిన్నమైనది అజ్ఞానం.
induku virahitamu linniyu najnaanamani
chandamuna geetalandu jaaTee nidivoa
maanaavamaanamulu maaniDambu viDuchuTa
pooni himsaku joraka yarupu galuguTayu
ani mati garaguTa yaachaaryoapaasana
taaneppuDu SuchiyouTa tappani vijnaanamu
anchala susthira buddhi yaatma vinigrahamu
anchita vishaya nirahamkaaraalu
munchina janma du@hkhamulu dalapoayuTa
kanchapu samsaaramu gaDachuTea jnaanamu
ari mitra samabuddhi ananya bhaktiyu
sari neakaantamunu sajjana sangavimukti
dhara nadhyaatma jnaanatatvamu teliyuTa
garima landuTa SreeveankaTapati jnaanamu
Briefly : - bhagavantuDu geetaloa vivarinchina jnaanaa jnaanamulanu ee keertanaloa telputunnaaDu annamayya. maanamu avamaanamulanu varjinchaDam, dambham leakunDuTa, himsaapravRtti leakunDaDam, oarpu kaligi unDaDam, guru seava, Souchamu aneavi ; vishaya sukhaalandu vairaagyam ahamkaaram leakunDaa vunDaTam, andari yandu sama sama bhaavam kaligi unDaDam modalainavi jnaanamu. veeTiki bhinnamainadi ajnaanam.
921. daivamA O daivamA - దైవమా వో దైవమా
-
Youtube Link : Sri Malladi Brothers,
Tune by Sri Malladi Suribabu garu (??)
॥పల్లవి॥ దైవమా వో దైవమా నన్ను దయఁజూడఁ దగదా నే వెఱ్ఱివాఁడనైతే నీవు వెఱ్ఱివా...
1 week ago
1 comments:
వెంకన్న సేవ కి Whatsapp
https://www.youtube.com/watch?v=X9cAkbSfr0k&feature=youtu.be
Post a Comment