ఇక్ష్వాకు కుల తిలక యికనైనా బలుకవె రామచంద్రా - నన్ను
రక్షింపు మింక నోరఘుకులతిలక - శ్రీ రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
1
చుట్టు ప్రాక్రారములు సొంపుతో గట్టిస్తి - రామచంద్రా - ఆ
ప్రాక్రారానికి బట్టె పదివేల వరహాలు రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
2
గోపురమంటపాల్ కుదురుగ గట్టిస్తి-రామచంద్రా- నన్ను
గ్రొత్తగజూడక యిత్తఱి బ్రోవుము - రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
3
భరతునకు జేయిస్తి పచ్చల పతకము రామచంద్రా ||
పతకానికిబట్టె పదివేలవరహాలు రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
4
శత్రుఘ్నునకు నేను జేయిస్తి మొలత్రాడు రామచంద్రా ||
మొలత్రాటికి బట్టె మొహరీలు పదివేలు రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
5
లక్ష్మణునకు వేస్తి ముత్యాల పతకము రామచంద్రా - ఆ
పతకానికిబట్టె పదివేల వరహాలు రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
6
సీతకు జేయిస్తి చింతాకు పతకము రామచంద్రా ఆ
పతకానికి బట్టె పదివేల వరహాలు రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
7
వాహనములు మీకు వరుసతో జేయిస్తి రామచంద్రా - జగ
న్మోహన సంకెళ్ళు వేసిరి కాళ్ళకు రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
8
కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా
కులుకుచు దిరిగెద-వెవరబ్బ సొమ్మని రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
9
మీ తండ్రి దశరథ మహారాజు పెట్టేనా రామచంద్రా లేక -
మీ మామ జనక మహారాజు పంపెనా రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
10
అబ్బ తిట్టితినని యాయాసపడవద్దు రామచంద్రా - ఈ -
దెబ్బల కోర్వక అబ్బ తిట్టితి నయ్య రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
11
ఏటికిజల్లిన నీళ్ళాయె నా బ్రతుకు రామచంద్రా - నేను
అధమునికంటెను అన్యాయమైతిని రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
12
సర్కారు పైకము తృణముగ నెంచుమీ రామచంద్రా ఈ
దెప్పరమున గాచి యప్పుదీర్చుమయ్య రామచంద్రా || ||ఇక్ష్వాకు ||
13
కౌసల్యాపుత్రక దశరథతనయ శ్రీరామచంద్రా - కావు
క్షేమమున భద్రాద్రిలో నెలకొన్న - శ్రీరామచంద్రా || ||ఇక్ష్వాకు ||
14
భక్తులందఱిని బరిపాలించెడి రామచంద్రా - నీవు
క్షేమముగ శ్రీ రామదాసుని నేలుము రామ ||ఇక్ష్వాకు ||
* * *
920. okati sugnanamu - ఒకటి సుజ్ఞానము
-
tuned and sung by Sri Sathiraju Venumadhav in raga rajani
archive link
ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము
ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు ॥పల్లవి॥
తనుఁ ద...
6 months ago
0 comments:
Post a Comment