Friday 18 July 2008

చందమామ రావో

చందమామ రావో జాబిల్లి రావో
కుందనపు పైడి కోర విన్న పాలు తేవో


నగు మోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి
నిగమములందుండే అప్పకు నా నీలవర్ణునికి
జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి

తెలిదెమ్మి కన్నుల మేటికి మంచి తియ్యని మాటల గుమ్మకు
కలికి చేతల కోడెకు మా కతలకారి ఈ బిడ్డకు
కులముద్ధరించిన పట్టె కు మంచి గుణములు కలిగిన కోడె కు
నిలువెల్ల నిండవొయ్యరికి నవనిధుల చూపుల చూచే సుగుణునకు


సురల గాచిన దేవరకు చుంచు గరుడునెక్కిన గబ్బికి
నెరవాది బుద్ధుల పెద్దకు మా నీటు చేతల పట్టికి
విరుల వింటి వాని అయ్యకు వేవేలురూపుల స్వామికి
సిరమించు నెరవాది జాణకు మా శ్రీవేంకటనాధునికి

1 comments:

Unknown said...

సుజాత గారు,ఈ కీర్తన పొందుపరచినందుకు ధన్యవాదాలు.నా దగ్గర అనురాధ శ్రీరాం గారు పాడిన ఈ కీర్తన ఉంది.మీకు ఎలా పంపించాలో చెప్పగలరు

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger