నగవులు నిజమని నమ్మేదా
వొగి నడియాసలు వొద్దనవే
తొల్లిటి కర్మము దొంతుల నుండగ
చెల్లబో ఇక చేసేదా
యెల్లలోకములు యేలేటి దేవుడా
వొల్లనొల్ల నిక వొద్దనవే
పోయిన జన్మము పొరుగుల నుండగ
ఛీయనక యిందు చెలగేదా
వేయినామముల వెన్నుడమాయలు
వొయయ్య ఇక వొద్దనవే
నలినీ నామము నాలికనుండగ
తలకొని ఇతరము తడవేదా
బలు శ్రీవేంకటపతి నిన్ను గొలిచి
వొలుకు చెంచలము లొద్దనవే
Listen to this Song Here.
921. daivamA O daivamA - దైవమా వో దైవమా
-
Youtube Link : Sri Malladi Brothers,
Tune by Sri Malladi Suribabu garu (??)
॥పల్లవి॥ దైవమా వో దైవమా నన్ను దయఁజూడఁ దగదా నే వెఱ్ఱివాఁడనైతే నీవు వెఱ్ఱివా...
1 week ago
1 comments:
వీలైతే అర్థమయినంతవరకూ కీర్తన లోని భావం కూడా వ్రాయడానికి ప్రయత్నించండి.
Post a Comment