Saturday, 19 July 2008

చక్కని తల్లికి ఛాంగుభళా

చక్కని తల్లికి ఛాంగుభళా తన
చక్కెర మోవికి ఛాంగుభళా

కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు చూపులకు ఛాంగుభళా
పలుకుల సొలపుల పతితో కసరెడి
చలముల యలుకకు ఛాంగుభళా


కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెరుగులకు ఛాంగుభళా
ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి ఛాంగుభళా


జందెపు ముత్యపు సరుల హారముల
చందనగంధికి ఛాంగుభళా
విందయి వేంకటవిభు పెనచిన తన
సందిదండలకు ఛాంగుభళా

Listen to this Song here

2 comments:

Unknown said...

చరణం చివర పల్లవిని రెండుకాని మూడుకానీ అక్షరాలతో వ్రాస్తే బాగుంటుంది.ఎందుకంటే పల్లవిలోని భావానికి చరణాలలో చెప్పినదానితో వివరణ వస్తుంది.గమనించగలరు.
word verification దయచేసి తీసివెయ్యండి.

GKK said...

అన్ని వందల సంవత్సరాలు ఈ పసిడిరాసులు భాండాగారములో దాగిఉండటమేమి? మన పూర్వజన్మల ఫలమేమో ఈనాడు మనకు ఇంతమంది సంగీతకారులు, గాయకులు, తితిదే వారు, పండితులు మనకు ఈ కానుకలను అడుగకనే అందివ్వటమేమి? అంతా ఆ విష్ణుమాయకాదూ!

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger