శిరుత నవ్వుల వాడు శిన్నెకా వీడు
వెరుపెరుగడు సూడవే శిన్నెకా
పొలసు మేనివాడు బోరవీపువాడు
సెలసుమోరవాడు శిన్నెక
గొలుసుల వంకల కోరలతో భూమి
వెలసినాడు సూడవే శిన్నెక .. శిరుత నవ్వుల వాడు ..
మేటి కురచవాడు మెడమీది గొడ్డలి
సీటకాల వాడు శిన్నెక
ఆటదాని బాసి అడవిలో రాకాసి
వేటలాడీ సూడవే శిన్నెక .. శిరుత నవ్వుల వాడు ..
బింకపుమోతల పిల్లంగోవి వాడు
సింక సూపులవాడు శిన్నెక
కొంకక కలికియై కొసరిగూడెనన్ను
వేంకటేసుడు సూడవే శిన్నెకా .. శిరుత నవ్వుల వాడు ..
** వినండి.
920. okati sugnanamu - ఒకటి సుజ్ఞానము
-
tuned and sung by Sri Sathiraju Venumadhav in raga rajani
archive link
ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము
ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు ॥పల్లవి॥
తనుఁ ద...
6 months ago
2 comments:
అన్నమయ్య స్పృశించని జీవన పార్శ్వంలేదు. ప్రతి పదమూ పరమాన్న భోజనమే. ఈ పదంలో ఎంత సొగసు? శోభారాజు గారి గొంతులో చాలా బాగుంది. అయినా సింధుభైరవిలో ఈ పదానికి వరుసలు కట్టిందెవరో తెలియదు. వారికి ప్రత్యేకంగా నమస్కారం చెప్పాలి. సింధుభైరవిలోనే శ్రీరంగం గోపాలరత్నం గారి గొంతులో అన్నముని సంస్క్రుతకీర్తన ’సకలం హే సఖి’ గుర్తుచేసుకుని ఆనంద పడ్డాను. నెనరులు.
Thank you sir. I am great fan of both the singers who are magnificient in their own way.
Post a Comment