భావము లోనా బాహ్యమునందును - గోవింద గోవింద యని కొలువవో మనసా
1. హరి నామములే అన్ని మంత్రములు! హరి లోనివే బ్రహ్మాండంబులు
హరినామములే అన్ని మంత్రములు - హరి హరి హరి హరి హరి హరి యనవో మనసా
2. విష్ణుని మహిమలే - విహిత కర్మములు ! విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడే - విశ్వాంతరాత్ముడు ! విష్ణువు విష్ణువని - వెదకవో మనసా
3. అచ్యుతిడితడే - ఆదియు నంత్యము ! అచ్యుతుడే - యసురాంతకుడు
అచ్యుతుడు శ్రీ వేంకటాద్రిమీద నిదె ! అచ్యుత యచ్యుత శరణనవో మనసా
భావము :
మనస్సు అంతరంగం. మాట బహిరంగం. ఒకటి బావం, మరొకటి బాహ్యం. మనసు, మాట, చేష్ట ఏకముఖంగా సాగినప్పుడే త్రికరణ శుద్ధి. ఓ మనసా ! గోవిందుని త్రికరణ శుద్ధి తో సేవించు.
హరినామస్మరణం సకల పాపహరం. దేవతలందరూ హరి అవతారాలే. బ్రహ్మాండాలనీ దామోదరుని ఉదరంలోనివే. హరినామాలే సకల మంత్రాలు. ఓ మనసా ! హరిని స్మరించు.
విష్ణువు విశ్వ వ్యాపకుడు. విష్ణుమహిమలను అభి వర్ణించేవే విహిత కార్యాలు. విష్ణువును పొగిడేవే వేదాలు. విశ్వాంతరాత్ముడైనవాడు విష్ణువు ఒక్కడే. ఓ మనసా ! విష్ణువును వెదుకు.
అచ్యుతుడు చ్యుతి* లేనివాడు. ఆద్యంతాలలో స్థిరంగా భాసించే వాడు. అసురులను అంతం చేసినవాడు అచ్యుతుడే. శ్రీ వేంకటగిరి శిఖరాలలో వెలసినదీతడే. ఓ మనసా ! అచ్యుతునే శరణు వేడు.
* చ్యుతి అన్న పదానికి నాకూ సరైన అర్ధం తెలియదు.
920. okati sugnanamu - ఒకటి సుజ్ఞానము
-
tuned and sung by Sri Sathiraju Venumadhav in raga rajani
archive link
ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము
ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు ॥పల్లవి॥
తనుఁ ద...
6 months ago
8 comments:
చ్యుతి అంటే పడిపోవటం అని అర్థమున్నది. మీరు పల్లవికి చెప్పిన అర్థ వివరణ చాలా బాగున్నది. మనోధర్మానికి ప్రతీక అయిన ఎమ్మెస్ గారి గాత్రంలో ప్రసిద్ధమైన అన్నమయ్య పదము. నెనరులు
చ్యుతి చెందడం అనగా నాశనం చెందడం.అచ్యుతుడు అనగా శాశ్వతుడు అనగా నాశనం చెందనివాడు. మీరే చెప్పారుగా "అచ్యుతుడు చ్యుతి చెందనివాడు"అని.బాగా చెప్తున్నారు.కొనసాగించండి.
I think this stanza
1. హరి నామములే అన్ని మంత్రములు! హరి లోనివే బ్రహ్మాండంబులు
హరినామములే అన్ని మంత్రములు - హరి హరి హరి హరి హరి యనవో మనసా
should actually be
1. హరి అవతారములే అఖిల దేవతలు - హరి లోనివే బ్రహ్మాండంబులు
హరినామములే అన్ని మంత్రములు - హరి హరి హరి హరి హరి యనవో మనసా
please correct it.
Kama Raju garu.. ok. i corrected.
Telugu Abhimani & Suresh garu thank you. These are just collections from some TTD Publications.
సరిదిద్దినందుకు thanks! BTW, నన్ను 'గారు' అనక్కర్లేదండీ! Just call me Raju.
ok Raju - Thank you. May I know how did you get to read my blog? Was it through Koodali or any other link? Im technically challenged and cant know this aspect. So Im asking.
I can't exactly recall how I ended up at your blog. Contrary to others, I don't follow koodali. My guess is that you left a comment in one of the blogs that I follow. After looking at some of your posts, I might have subscribed to the RSS feed.
BTW, you can install something like sitemeter to see where you are getting most of the hits, how people are ending up at your blog etc.,
There are also ways to give false information (IP spoofing, tor network etc.,) using which you can fool these trackers also.
So the results from sitemeter etc., have to be taken with a pinch of salt.
hth
raju
Ok. Raju. Thanks for the suggestion. I had subscribed to Sitemeter. Later, I deleted the button from the blog, thinking that its not so useful for me, for the very less quantity of readers I get. I will add it now.
Post a Comment