Sunday, 31 August 2008

మేలుకో శృంగార రాయ

మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
మేలుకోవె నా పాలి మించిన నిధానమా

1. సందడించే గోపికల జవ్వన వనములోన
కందువ దిరిగే మదగజమవు
ఇందుముఖి సత్యభామ హృదయపద్మములోని
గంధము మరిగినట్టి గండు తుమ్మెద

2. గతికూడి రుక్మిణి కౌగిటి పంజరములో
రతి ముద్దుగులికేటి రాచిలుకా !
సతులు పదారువేల జంట కన్ను కలువలకు
ఇతవై పొడిమిన నా ఇందు బింబమా

3. వరుస కొలనిలోని వారి చన్ను కొండలపై
నిరతి వాలిన నా నీల మేఘమా
సిరినురమున మోచి శ్రీ వేంకటాద్రి మీద
గరిమ వరాలిచ్చే కల్ప తరువా


కీర్తన వినండి.. Pl open the link in a new Tab.

1 comments:

GKK said...

ఈ పాట బాలకృష్ణ ప్రసాదు, జానకి గార్ల యుగళంలో మరొకటి ఉన్నది. బాగుంటుంది. మలయమారుతం రాగం.fantastic imagery.

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger