Wednesday, 15 October 2008

బ్రహ్మ కడిగిన పాదము

బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానె నీ పాదము

చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము

కామిని పాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము

పరమయోగులకు పరిపరివిధముల
పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమపదము నీ పాదము

వినండి :

Get this widget | Track details | eSnips Social DNA

5 comments:

శ్రీసత్య... said...

bagundandi. ee taramlo miss avutunnna manchi, manchi BAKTIRASANNI chala chakkaga prachuristunnaru.thanks for ur posting..

swamy said...

gud sujatha gaaru.

Unknown said...

సుజాత గారూ కీర్తనని అదేవిండోలో ఉండి esnips.com ద్వారా వినగలిలేలా మీరు ఎలా ఏరపాటు చేసుకున్నారో దయతో చెప్పరూ. నా బ్లాగులో పాటలకు ఆ ఏర్పాటు చేయాలని ఉంది.మీ సహాయం కావాలి.

Sujata M said...

Srisatya

Thanks for reading my blog.

fruit garu

thanks.

Sujata M said...

baalakrishnamoorthi garu

I mailed u - Hope u can achieve it in your blog.

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger