Tuesday, 23 March 2010

రామభద్ర రఘువీర రవివంశ తిలక



రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ
నామమె కామధేనువు నమో నమో

కౌశల్యానందవర్ధన ఘనదశరధసుత
భాసుర యజ్ఞరక్షక భరతాగ్రజ
రాసికెక్క కోదండ రచన విద్యా గురువ
వాసితో సురలు నిను వడి మెచ్చేరయ్యా

మారీచసుబాహు మర్ధన తాటకాంతక
దారుణవీరశేఖర ధర్మపాలక
కారుణ్య రత్నాకర కాకాసుర వరద
సారెకు వేదవిదులు జయవెట్టేరయ్యా

సీతారమణ రాజశేఖర శిరోమణి
భూతలపుటయోధ్యాపుర నిలయా
యీతల శ్రీవేంకటాద్రి నిరవయిన రాఘవా
ఘాత నీ ప్రతాపమెల్ల కడునిండెనయ్యా

జయ జయ రామ



జయ జయ రామ సమర విజయ రామ
భయహర నిజ భక్త పారీణ రామా

జలధి బంధించిన సౌమిత్రి రామా
సెలవిల్లు విరచిన సీతారామా
అల సుగ్రీవునేలిన అయోధ్య రామా
కలిగి యజ్ఞము కాచె కౌసల్య రామా

అరి రావణాంతక ఆదిత్యకుల రామా
గురు మౌనులను గాచే కోదండరామా
ధర నహల్య పాలిటి దశరధ రామా
హరురాణినుతుల లోకాభి రామా

అతి ప్రతాపముల మాయా మృగాంతక రామా
సుత కుశలవ ప్రియ సుగుణ రామా
వితత మహిమల శ్రీవేంకటాద్రి రామా
మతిలోన బాయని మనువంస రామా

రాముడు రాఘవుడు రవికులుడితడు

Get this widget | Track details | eSnips Social DNA


రాముడు రాఘవుడు రవికులుడితడు
భూమిజకు పతియైన పురుష నిధానము

అరయపుత్రకామేష్టియందుపరమాన్నమున
పరగ జనించిన పరబ్రహ్మము
సురల రక్షింపగ అసురుల శిక్షింపగ
తిరమై ఉదయించిన దివ్యతేజము

చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో
సంతతము నిలిచిన సాకారము
వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి
కాంతుల చెన్ను మీరిన కైవల్యపదము

వేద వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు
పాద్కొనపలికేటి పరమార్ధము
పోదితో శ్రీవేంకటాద్రి పొంచి విజనగరాన
ఆదికి అనాదియైన అర్చావతారము

రామచంద్రుడితడు రఘువీరుడు

Get this widget | Track details | eSnips Social DNA


రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలము లియ్యగలిగె నిందరికి

గౌతము భార్య పాలిటి కామధేను వితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు
ఈతడు దాసులపాలిటి ఇహపర దైవము

పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు
సరి హనుమంతు పాలి సామ్రాజ్యము
నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు
గరిమ జనకు పాలి ఘనపారిజాతము

తలప శబరి పాలి తత్వపు రహస్యము
అలరి గుహుని పాలి ఆదిమూలము
కలడన్న వారి పాలి కన్ను లెదుటి మూరితి
వెలయ శ్రీ వేంకటాద్రి విభుడీతడు

Friday, 19 March 2010

దేవదేవం భజే

Get this widget | Track details | eSnips Social DNA


దేవదేవం భజే దివ్య ప్రభావం
రావణాసురవైరి రఘుపుంగవం // రామం //

రాజవరశేఖరం రవికుల సుధాకరం
ఆజానుబాహుంనీలాభ్రకాయం
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం // రామం //

నీలజీమూత సన్నిభశరీరం ఘన వి-
శాలవక్షం విమల జలజనాభం
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలాధిపం భోగిశయనం // రామం //

పంకజాసన వినుత పరమనారాయణం
శంకరార్జితజనకచాప దళనం
లంకా విశోషణం లాలితవిభీషణం
వెంకటేశం సాధు విబ్ధ వినుతం // రామం //

Wednesday, 17 March 2010

తెర తీయగరాదా

తెర తీయగరాదా లోని
తిరుపతి వెంకటరమణ! మచ్చరమను

పరమపురుష ! ధర్మాదిమోక్షముల
పారదోలుచున్నది నాలోని

ఇరవొందగ భుజియించు సమయమున
ఈగ తగులు రీతి యున్నది
హరిధ్యానము సేయు వేళ చిత్తము
అంత్యజు వాడకుబోయిన ట్లున్నది

మత్స్యము ఆకలిగొని గాలముచే
మగ్నమైన రీతి యున్నది
అచ్చమైన దీపసన్నిధి మరు
గిడ బడి చెఱచిన ట్లున్నది

వాగురయని తెలియక మృగగణములు
వచ్చి తగులు రీతి యున్నది
వేగమె నీ మతము ననుసరించిన
త్యాగరాజనుత మదమత్సరమను

భావము :

ఓ తిరుపతి వెంకటరమణా ! నాలో ఉండే మాత్సర్యమనే తెర - నీ దర్శనానికి ఆటంకం కలిగిసూంది. దీన్ని తొలగించు. ఓ పరమపురుషా ! ధర్మ, అర్ధ, కామ, మోక్షాలను స్వానుభవానికి రానీకుండా నాలోని ఈ మాత్సర్యమనే తెర - దూరం చేస్తూంది. స్వామీ ! స్థిమితంగా భోజనం చేసే సమయంలో నోటిలో ఈగ అడ్డం వచ్చినట్లూ, స్థిరచిత్తంలో శ్రీహరిని ధ్యానించే వేళలో మనస్సు అనాచార అసభ్య స్థలాలకు వెళ్ళినట్లూ, నీటిలోని చేప ఆకలితో ఆహారంగా అనుకొని గాలానికి తగులుకొన్నట్లూ, స్వచ్చమైన దీపకాంతిలో ఏదో మరుగు ఏర్పడి, కాంతిని చెరచినట్లూ, లేళ్ళు తమను పట్టుకోవడానికి వల పన్నిన గోయి అని తెలియక అందులో పడినట్లూ, ఏ జన్మలోనిదో అయిన మదమాత్సర్యాల తెర నీ దర్శనభాగ్యానికి అడ్డుగా నిల్చి ఉంది. దయతో ఈ తెరను తొలగించి నీ దివ్య దర్శన భాగ్యాన్ని కల్గించవా ?

తారకమంత్రము కోరిన దొరికెను



తారకమంత్రము కోరిన దొరికెను
ధన్యుడనైతిని ఓరన్నా
మీఱిన కాలుని దూతలపాలిటి
మృత్యువె యని నమ్మర యన్నా

మచ్చికతో నికబాతకంబుల
మాయలలో బడబోకన్నా
హెచ్చ్గ నూటయినిమిది తిరుపతు
లెలమి దిరుగ బని లేదన్నా

ముచ్చటగా నా పుణ్యనదులలో
మునిగెడీ పని యేమిటి కన్నా
వచ్చెడీ పర్వపుదినములలో సుడి
వడి పడుటలు మాను మికన్నా

ఎన్ని జన్మముల నైంచ్ చూచినను
యేకో నారాయణుడనా
అన్ని రూపులై యున్న పరమాత్ముని
నా మహాత్ము కధలను విన్న

ఎన్ని జన్మముల జేసిన పాపము
లీ జన్మముతో విడునన్నా
అన్నిటికిది కడసారి జన్మమిది
సత్యం బికబుట్టుట సున్న

నిర్మల మంతర్లక్ష్య భావమున
నిత్యానందముతో నున్న
కర్మంబులు విడి మోక్షసద్గతిని
గన్నులనే చూచుచునున్న

ధర్మము తప్పక భద్రాద్రీశుని
దనమదిలో నమ్ముచునున్న
మర్మము దెలిసిన రామదాసుని
మందిరమున కేగుచునున్న

నను బ్రోవమని చెప్పవే

నను బ్రోవమని చెప్పవే - సీతమ్మ తల్లీ !
ననుః బ్రోవమని చెప్పవే

నను బ్రోవమని చెప్పు నారీశిరోమణి -
జనకుని కూతురా! జననీ జానకమ్మ

ప్రక్కను జేరుక - చెక్కిలి నొక్కుచు
జక్కగ మరుకేళి - సొక్కి యుండెడి వేళ

లోకాంతరంగుడు - శ్రీకాంత నినుగూడి
యేకాంతమున నేక - శయ్యనున్న వేళ

అద్రిజవినతుడు - భద్రగిరీశుడు
నిద్ర మేల్కొనువేళ నేతరో బోధించి

ఏ తీరుగ నను దయజూచెదవో



ఏ తీరుగ నను దయజూచెదవో - యినవంశోత్తమ రామా
నాతరమా భవసాగర మీదను - నళినదళేక్షణ రామా

శ్రీరఘునందన సీతారమణా - శ్రితజనపోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను - గన్నది కానుపు రామా

మురిపెముతో నా స్వామివి నీవని - ముందుగ దెల్పితి రామా
మరువకయికనభిమానముంచునీ - మఱుగజొచ్చితిని రామా

క్రూరకర్మములు నేరక చేసితి - నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారముసేవవె - దైవశిఖామణి రామా

గురుడవునామదిదైవమునీవను - నురుశాస్త్రంబులు రామా
గురువుదైవమనియెఱుగకతిరిగెడు - క్రూరుడనైతిని రామా

తాండవమున నఖిలాండకోటి - బ్రహ్మాండనాయకా రామా
బంధనమున నీ నామముదలచిన - బ్రహ్మానందము రామా

వాసవకమలభవామరవందిత - వారధిబంధన రామా
భాసురవరసద్గుణములు గల్గిన - భద్రాద్రీశ్వర రామా

వాసవనుత రామదాసపోషకా - వందనమయోధ్య రామా
దాసార్చిత మాకభయమొసంగవె - దాసరధీరఘురామా

Thursday, 11 March 2010

శ్రీ నామ రామాయణం

ఉత్తర కాండము

ఆగత మునిగణ సంస్తుత రామ
విశృత దశకంఠోద్భవ రామ
సీతాలింగన నిర్వత రామ
నీతి సురక్షిత జనపద రామ
విపినత్యాజిత జనకజ రామ
కారిక లవణాసుర వధ రామ
స్వరగత శంబుక సంస్తుత రామ
స్వతనయకుశలవ పండిత రామ
అశ్వమేధక్రతు దీక్షిత రామ
కాలవేధిత సురపద రామ
అజోధ్యక జనముక్తిద రామ
విధిముఖ విబుదానందక రామ
తేజోమజినిజరూపక రామ
సంస్కృతిబంధ విమోచక రామ
కర్మస్థాపన తత్పర రామ
భక్తి పరాయణ ముక్తిద రామ
సర్వచరాచర పాలక రామ
సర్వాభవామయ వారక రామ
వైకుంఠాలయ సంస్థిత రామ
సవ్యానంద పదస్థిత రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ రాజా రామా
రామా రామ జయ సీతా రామా

మంగళము


భయహర మంగళ దశరధ రామా
జయ జయ మంగళ సీతా రామ
మంగళకర జయ మంగళ రామ
సంగత శుభవిభవోదయ రామ
ఆనందామృత వర్షక రామ
ఆశ్రితవత్సల జయ జయ రామ
రఘుపతి రాఘవ రాజారామ
పతిత పావన సీతా రామ

శ్రీ నామ రామాయణం

యుద్ధ కాండము

రావణునిధన ప్రస్థిత రామ
వానరసైన్య సమావృత రామ
శోషిత శరదీశార్ధిత రామ
విభీషణాభయ నిబంధక రామ
కుంభకర్ణ శిరచ్చేతక రామ
రాక్షస సంఘ విమర్ధక రామ
అహిమహిరావణ చారణ రామ
సంహృత దశముఖ రావణ రామ
విధిభవముఖ సురవస్తుత రామ
ఖస్తిత దశరధ వీక్షిత రామ
సీతాదర్శన మోదిత రామ
అభిషిక్త విభీషణవత రామ
పుష్పకయానారోహణ రామ
భరధ్వాజభినిషేవణ రామ
సాకేతపురీభూషన రామ
సకలస్వీయ సమానత రామ
రత్నల సత్పీఠస్థితీ రామ
పత్తాభిషేక కాలంకృత రామ
వార్ధి వకుల సమ్మానిత రామ
విభీషణార్పిత రంగక రామ
కశకులానుగ్రహకార రామ
సకల జీవ సంరక్షక రామ
సమస్త లోకోద్ధారక రామ

శ్రీ నామ రామాయణం

కిష్కింద కాండము

హనుమత్సేవిత నిజపద రామ
నతసుగ్రీవాభీష్టద రామ
గర్వితవాలి సంహారక రామ
వానరదూత ప్రేషక రామ
హితకర లక్ష్మణ సంయుత రామ

సుందర కాండము


కపివర సంతత సంస్మృత రామ
తద్గతి విఘ్న ధ్వంసక రామ
నేతా ప్రాణాధారక రామ
దుష్ట దశానన దూషిత రామ
శిష్టహనుమద్బూషిత రామ
పితోదిక కాకవన రామ
కృతచూడామణి దర్శన రామ
కపివర వచనాశాశ్విత రామ

శ్రీ నామ రామాయణం

అరణ్య కాండము

దండకవన జప వసన రామ
దుష్టవిరాధ వినాశన రామ
శరభంగ సుతీక్ణార్చిత రామ
అగస్త్యానుగ్రహ వర్ణిత రామ
గృధ్రాధిప సంనేవిత రామ
పచవటీతప సుషిత రామ
శూర్పుణఖార్తి విధాయక రామ
ఖరదూషణముఖ సూదక రామ
సీతా ప్రియహరిణానూ రామ
మూర్తీచార్తి కృదాశుగ రామ
వినిష్ట సీతాన్వేషక రామ
గృధ్రాధీపగతి దాయక రామ
శబరీదత్త ఫలాశన రామ
కబంధ బహుచ్చేదన రామ

శ్రీ నామ రామాయణం

అయోధ్య కాండము


అగణిత గూణగణ భూషిత రామ
అవనీ తనయ కామిత రామ
రామచంద్ర సమానత రామ
పితృవాక్యాశ్రిత కానన రామ
ప్రియగుహ నివేదిత పధ రామ
ప్రక్షాళిత నిమృదుపద రామ
భరద్వాజ ముఖానందక రామ
చిత్రకూటాద్రి నికేతన రామ
దశరధసంతత చింతిత రామ
కైకేయీ నిజపితృకర్మక రామ
భరతార్పిత నిజపాదుక రామ

శ్రీ నామ రామాయణం

బాల కాండము

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కాలాత్మక పరమేశ్వర రామ
శేషతల్ప సుఖ నిద్రిత రామ
బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ
కాండ కిరణకుల మండన రామ

శ్రీ మద్దశరధ నందన రామ
కౌసల్యా సుకవర్దన రామ
విశ్వామిత్ర ప్రియతమ రామ
ఘోరతాటకాఘాతక రామ
మారీచాది నిపాతక రామ
కౌశికముఖ సంరక్షక రామ
శ్రీ మదహల్యోద్ధారక రామ
గౌతమ ముని సంపూజిత రామ
సురమని వరగణ సన్స్తుత రామ

నావికా ధావిత మృదుపద రామ
మిధిలాపురజన మోహక రామ
విదేహ మానసరంజక రామ
త్ర్యంబక కార్ముక భంజక రామ
సీతార్పిత వరమాలిక రామ
కృత వైనామిక కౌతుక రామ
భార్గవ దర్ప వినాశక రామ
శ్రీమదయోధ్యా పాలక రామ

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger